📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

DSC Job Calendar: త్వరలో డిఎస్సీ జాబ్ కేలండర్

Author Icon By Pooja
Updated: February 20, 2026 • 10:52 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

3వేలు పైగా నియామకాలకు అవకాశం

: అసెంబ్లీలో మంత్రి లోకేష్

DSC Job Calendar: కర్నూలు క్లస్టర్ యూనివర్సిటీకి బ్యాలెన్స్ పను లు వచ్చే విద్యా సంవత్సరంలో పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేష్ పేర్కొ న్నారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. స్పీకర్ అయ్య న్నపాత్రుడు ప్రశ్నోత్తరాలతో సభను మొద లుపెట్టారు ఇందుకు గంటను సమయాన్ని నిర్దే శించారు. ఈ సమయంలో కర్నూలు క్లస్టర్ విశ్వవిద్యాలయానికి సంబంధించి ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి నారా లోకేశ్ సమాధానమిచ్చారు. కర్నూలు క్లస్టర్ విశ్వవి ద్యాలయం కోసం రూ.139 కోట్ల నిధులు మం జూరు చేశామని దాంట్లో రూసా కింద రూ.55 కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. ఏ కార్యక్ర మం చేసినా క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ తీసు కుంటున్నామని తెలిపారు.

Read Also:HLL Lifecare Recruitment: లైఫ్‌కేర్‌లో 40 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు

DSC Job Calendar: DSC Job Calendar Coming Soon

కర్నూలు పార్లమెంట్ చుట్టు పక్కల ఎక్కవ పెట్టుబడులు వస్తున్నా యన్నారు. క్లస్టర్ యూనివర్సిటీల్లో ఫోకస్ సబ్జెక్టు లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని చెప్పారు. అందుకే స్పెషలైజేషన్లపైనా శ్రద్ధ తీసుకుం టున్నామని తెలిపారు. బ్యాలెన్స్ పనులు వచ్చే అకాడమిక్ ఇయర్లో పెండింగ్ నిధులు మం జూరు చేస్తామని మంత్రి లోకేశ్ సభలో పేర్కొ న్నారు. సమగ్ర శిక్షా అభియాన్ కింద పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగుల వేతనాలను 50 శాతం పెంచే ఉద్దేశం ఉందా అని ఎచ్చెర్ల (శ్రీకాకుళం) ఎమ్మెల్యే ఈశ్వరరావు ప్రశ్నించారు. వీరంతా చాలా తక్కువ జీతాలతో పనిచేస్తున్నారని తెలిపారు. వారి జీత భత్యాలు పెంచాలని, ఈపీఎఫ్ సౌకర్యం కల్పిం చాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఆ తర్వాత ఎమ్మెల్యే పార్థసారధి కస్తూరిబా బాలికా విద్యా లయాలపై మాట్లాడారు. కస్తూరిబా బాలికా విద్యా లయాల్లో ఆడపిల్లలకు గొప్పగా విద్యనందిస్తున్నాయని తెలిపారు. ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో సీట్లు దొరకని పరిస్థితి ఉందన్నారు.

ప్రస్తుతం 79 శాతం ఉత్తీర్ణత ఉన్న స్కూళ్లు త్వరలో 90 శాతం ఉత్తీర్ణత సాధించే అవకాశం ఉందని తెలిపారు. మరిన్ని కస్తూరిబా బాలికా విద్యాలయాలను ప్రారంభించాలని ఎమ్మెల్యే కోరారు. ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రి లోకేశ్ సమాధానం ఇచ్చారు. సమగ్ర శిక్షా అభియాన్ కింద పని చేస్తున్న ఉపాధ్యాయులు, డేటా ఎంట్రీ ఆపరే టర్లకు ఎంత వేతనం చెల్లిస్తున్నారని మంత్రి నారా లోకేశ్ ప్రశ్నించారు. దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ జీతాలు ఇస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. ఈ పథకం కేంద్ర ప్రభు త్వ అధీనంలో ఉందని, ఈ అంశాలను కేంద్ర దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు చర్యలు తీసు కుంటామని మంత్రి హామీ ఇచ్చారు. అలాగే, సీజనల్ హాస్టళ్ల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు మంత్రి లోకేశ్. త్వరలోనే వాటిని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.

ఉగాది కానుకగా డీఎస్సీ నియామకాల ప్రకటన: తెలుగు సంవత్సరాది ఉగాది పండగ సందర్భంగా ఉపాధ్యాయ నియామకాలకు ప్రకటన విడుదల చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే క్షేత్రస్థాయి నుంచి ఖాళీల వివరాలను పాఠశాల విద్యాశాఖ సేకరించింది. అన్ని రకాల పోస్టులు కలిపి 3 వేల 600 వరకు ఉండే అవకాశం ఉండనుంది. ఇందుకుగానూ ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూషన్లు, ఆదర్శ పాఠశాలలు, సంక్షేమ శాఖలకు చెందిన పాఠశాలల నుంచి ప్రాథమికంగా వివరాలు సేకరించారు. వీటి అన్నింటిలో కలిపి 1,200 వరకు ఖాళీలు రానున్నాయి. వీటితో పాటు ప్రభుత్వ పాఠశాలలు, పంచాయతీరాజ్, పురపాలక పాలక పాఠశాలల్లో 1,700 పోస్టులు ఉంటాయి. 700 వరకు ప్రత్యేక విద్యా పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉంది. గతేడాది ఏప్రిల్ లో 16,347 పోస్టులకు ప్రకటన ఇచ్చారు. వీటిలో 15,941 పోస్టులు మాత్రమే భర్తీ అయ్యాయి. కొన్ని పోస్టులకు రిజర్వేషన్ల అభ్యర్థులు లేకపోడం వల్ల అవి మిగిలి పోయాయి. డీఎస్సీలో కర్నూలు జిల్లాకు అదనపు ఉపాధ్యాయులను శాంక్షన్ చేశామన్నారు. త్వరలోనే డీఎస్సీని జాబ్ క్యాలెండర్ కింద విడుదల చేస్తామని మంత్రి లోకేశ్ హామీ ఇచ్చారు.
పాలస్తీనా యుద్ధం కారణంగా జెరుసులెం యాత్రకు ఆస్కారం లేదు. గతంలో క్రైస్తవ ఆస్తులు అన్యాక్రాంతం అయ్యాయా అని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు అసెంబ్లీలో ప్రశ్న లేవనెత్తారు. గుంటూరులో క్రిస్టియన్ భవన్ నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందని అడిగారు ఎమ్మెల్యే. దీనిపై మంత్రి ఎన్ఎండీ ఫరూక్ సమాధానం ఇస్తూ.. క్రైస్తవ ఆస్తుల విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం లేదని స్పష్టం చేశారు. జగన్ క్రిస్టియన్ కాదని అనుకుంటున్నానని… ఎందుకు ఐదేళ్ల పాటు ఆ క్రైస్తవ భవన్ పూర్తిచేయలేదని ప్రశ్నించారు. ఎందుకు ఆయన తనహయంలో నిధులు ఇవ్వలేదని అడిగారు. ఇప్పుడు కూటమి వచ్చింది కనుక త్వరలోనే పెండింగ్ పనులు పూర్తి చేసి భవనాన్ని అందుబాటులోకి తేస్తామని హామీ ఇచ్చారు. ఇజ్రాయిల్, పాలస్తీనా యుద్ధం జరుగుతున్నందున జెరుసలేం యాత్రకు ఆస్కారం లేకుండా ఉందని మంత్రి ఎండీ ఫరూక్ పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

APEducation Google News in Telugu Latest News in Telugu NaraLokesh

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.