gautam

అంబానీని మించిపోయిన జీత్ అదానీ పెళ్లి ఖర్చు

భారతదేశంలోని ప్రముఖ సంపన్న వ్యాపారుల్లో అదానీ, అంబానీలు ఉన్నారు. గడచిన ఏడాది ముఖేష్ అంబానీ తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లిని దాదాపు రూ.5,000 కోట్లు వెచ్చించి అంగరంగ వైభవంగా జరిపించారు. ఈ క్రమంలో దేశవిదేశాల నుంచి అతిరుథులతో ముంబై నగరం కిక్కిరిసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా 2025లో దేశంలోని మరో సంపన్నుడు అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ చిన్న కుమారుడు జీత్ అదానీ పెళ్లి జరిగింది. ఈ క్రమంలో జీత్ అదానీ దివా షా వివాహం జరిగింది. అంబానీ మాదిరిగా అదానీ తన కుమారుడి వివాహాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించలేదు. అదానీ తన కుమారుడి వివాహాన్ని సింపుల్‌గా నిర్వహించడమే కాకుండా రూ.10,000 కోట్లు విరాళంగా ప్రకటించారు. అయితే ఈ విరాళంలో ఎక్కువ భాగం ఆరోగ్య సంరక్షణ, ఎడ్యుకేషన్, నైపుణ్యాభివృద్ధికి ఖర్చు చేయాలని నిర్ణయించారు.

Advertisements

అదానీ ప్రకటించిన విరాళంలో సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు మెరుగైన ఆసుపత్రులు, వైద్య కళాశాలలను అందుబాటులోకి తీసుకురావటంపై దృష్టి పెట్టనున్నట్లు వెల్లడైంది. గ్లోబల్ స్కిల్స్ అకాడమీలను అప్‌గ్రేడ్ చేయడానికి డబ్బు వినియోగించబడుతుందని వెల్లడైంది. అదానీ తన కుమారుడి వివాహానికి సంబంధించిన పెళ్లి ఫోటోలను ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. అయితే జీత్ అదానీ వివాహానికి సన్నిహితులను ఆహానించనందుకు క్షమాపణలు సైతం కోరారు. అహ్మదాబాద్‌లో సాంప్రదాయ ఆచారాలు, శుభ్ మంగళ్ భావ్ తో ప్రియమైనవారి మధ్య జరిగిందని వెల్లడించారు.వివాహానికి ముందు అదానీ గ్రూప్ ‘మంగళ సేవా’ చొరవను ప్రారంభించింది.

ప్రతి సంవత్సరం కొత్తగా వివాహం చేసుకున్న 500 మంది వికలాంగ మహిళలకు ఆర్థిక సహాయం అందించబడుతుందని వెల్లడించారు. అదానీ గ్రూప్ ఇచ్చిన సమాచారం ప్రకారం కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి అతనికి ప్రతి సంవత్సరం రూ.10 లక్షలు ఆర్థిక సహాయం ఇవ్వబడుతుంది. జీత్ అదానీ కొత్తగా పెళ్లైన 25 మంది వికలాంగ మహిళలను, వారి భర్తలను స్వయంగా కలిసి ఆ జంటలకు ఆర్థిక సహాయం అందించారు.

Related Posts
Donald Trump: ట్రంప్ సుంకాలతో ఐటీ షేర్స్ 9%..సెన్సెక్స్ 500 పాయింట్లు ఫట్
ట్రంప్ సుంకాలతో ఐటీ షేర్స్ 9%..సెన్సెక్స్ 500 పాయింట్లు ఫట్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై 26 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించాక ఈ ప్రభావం నేడు భారత మార్కెట్‌పై స్పష్టంగా కనిపిస్తుంది. ఉదయం 9:17 గంటలకు Read more

కస్టమర్లకు రిలయన్స్ జియో దీపావళి ఆఫర్స్..
jio offers diwali

దేశంలోనే అతిపెద్ద టెలికాం సంస్థ రిలయన్స్ జియో (Reliance Jio) దీపావళి సందర్భంగా వినియోగదారులకు గుడ్ న్యూస్ అనిడఁచింది. "దీపావళి ధమాకా" పేరుతో కొత్త ఆఫర్లను విడుదల Read more

హైదరాబాద్‌ వేదికగా దేశంలోనే మొట్టమొదటి ఎక్స్‌పీరియన్స్ సెంటర్ స్టోర్‌ను ప్రారంభించిన ‘‘విక్టర్‌’’..
333

-స్టోర్‌లో కస్టమర్‌లు ఉత్పత్తులను ఎక్స్‌పీరియన్స్‌ చేయడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బ్యాడ్మింటన్ కోర్ట్.. హైదరాబాద్: ప్రపంచంలోనే టాప్‌ -2 బ్యాడ్మింటన్ బ్రాండ్ ‘‘విక్టర్ రాకెట్స్’’ హైదరాబాద్‌లోని కొండాపూర్‌ Read more

మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన గోల్డ్ ధరలు
gold price

భారతీయ సాంప్రదాయంలో మహిళలకు బంగారం అంటే ఎంతో ప్రత్యేకమైన సంబంధం ఉంది. బంగారం ఆభరణాలను సంపద, గౌరవం, భద్రత, సౌభాగ్యంగా భావిస్తారు. వివాహాలు, శుభకార్యాలు, పండగలు, ప్రత్యేక Read more

Advertisements
×