ఇంటర్నేషనల్ క్రికెట్ ప్రపంచంలో నిత్యం కొత్త కొత్త రికార్డులు నమోదవుతుంటాయి. అయితే ఇటీవల కాలంలో టీమిండియాకు చెందిన 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశి (Vaibhav Suryavanshi) క్రికెట్‌లో అరుదైన రికార్డు సృష్టించి వార్తల్లో నిలిచాడు. అలాంటి సమయంలో మరో టాలెంటెడ్ యువ క్రికెటర్ జాక్ వుకుసిక్ కూడా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. అతడు తన తక్కువ వయసులోనే జాతీయ జట్టుకు కెప్టెన్‌గా నియమితుడై ఒక అరుదైన రికార్డును నెలకొల్పాడు. ఇది ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే ఓ మైలురాయిగా మారింది.
జాక్ వుకుసిక్ ఎవరు?
జాక్ వుకుసిక్ (Jack Vukusic) క్రొయేషియా (Croatia) కు చెందిన యువ క్రికెటర్. అతను టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్‌లో తన దేశానికి నాయకత్వం వహించి అత్యంత పిన్న వయసులో కెప్టెన్‌గా నిలిచాడు. క్రికెట్ ప్రపంచంలో యువ ఆటగాళ్లకు ఇది గొప్ప ప్రేరణగా మారింది. టీనేజ్ వయసులో క్రికెట్ ఆడడం సాధారణమే అయినా, కెప్టెన్సీ బాధ్యతలు భుజాలపై వేసుకోవడం మాత్రం చాలా అరుదైన విషయం.

పాత రికార్డు ఎవరిది?
జాక్ వుకుసిక్ కేవలం 17 సంవత్సరాలు 311 రోజులు వయసులోనే క్రొయేషియా తరఫున టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో కెప్టెన్‌గా ఆడాడు. అతని నాయకత్వంలో జట్టు సైప్రస్‌తో జరిగిన మ్యాచ్‌లో బరిలోకి దిగింది. ఈ ఘనతతో వుకుసిక్ (Jack Vukusic) ప్రపంచ క్రికెట్ చరిత్రలో అతి చిన్న వయసులో కెప్టెన్ అయిన ఆటగాడిగా నిలిచాడు.ఇంతకు ముందు ఈ రికార్డు ఫ్రాన్స్‌కు చెందిన నోమాన్ అమ్జాద్ పేరిట ఉండేది. అతను 18 సంవత్సరాలు 24 రోజులు వయసులో ఫ్రాన్స్ టీమ్‌కు కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. కానీ 2024లో జాక్ వుకుసిక్ ఆ రికార్డును అధిగమించాడు. దీనితో పాటు అతని ఆటతీరు, తీరుతో క్రికెట్ విశ్లేషకులందరి ప్రశంసలు అందుకున్నాడు.
అత్యంత చిన్న వయసులో కెప్టెన్సీ చేసిన రికార్డు
కొద్ది రోజుల క్రితం, వైభవ్ సూర్యవంశీ అనే 14 ఏళ్ల యువ క్రికెటర్ టీ20ల్లో అతి చిన్న వయసులో సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. అదే విధంగా, జోక్ వుకుసిక్ కూడా అంతర్జాతీయ క్రికెట్‌లోనే కాదు, టీ20లలో కూడా కెప్టెన్సీ చేసిన అతి చిన్న వయసు క్రికెటర్‌గా నిలిచాడు. వైభవ్ సూర్యవంశీ చిన్న వయసులో సెంచరీ సాధిస్తే, జోక్ వుకుసిక్ చిన్న వయసులో కెప్టెన్‌గా నిలిచి రికార్డు నెలకొల్పాడు.టీ20 క్రికెట్‌లో అత్యంత చిన్న వయసులో కెప్టెన్సీ చేసిన రికార్డు గతంలో పాకిస్తాన్ ఆటగాడు తైమూర్ అలీ పేరిట ఉండేది. అతను 2009లో 17 ఏళ్ల 358 రోజుల వయసులో క్వెట్టా బియర్స్‌కు కెప్టెన్సీ చేశాడు. 16 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆ రికార్డును జోక్ వుకుసిక్ బద్దలు కొట్టాడు. ఈ యువ క్రికెటర్ భవిష్యత్తులో కూడా ఇలాంటి అద్భుతాలు సృష్టిస్తాడని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
జాక్ వుకుసిక్ ఎవరు?
జాక్ వుకుసిక్ క్రొయేషియా దేశానికి చెందిన యువ క్రికెటర్. అతను అంతర్జాతీయ క్రికెట్‌లో అతి చిన్న వయసులో కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు.
జాక్ వుకుసిక్ ఎంత వయసులో కెప్టెన్ అయ్యాడు?
జాక్ వుకుసిక్ కేవలం 17 సంవత్సరాలు 311 రోజుల వయసులో క్రొయేషియా తరఫున కెప్టెన్సీ చేశాడు.
Read hindi news: hindi.vaartha.com
Read also: