న్యూజిలాండ్ ఎంపీ ‘హక’ వీడియో మరోసారి వైరల్

Read Time:  1 min
new zealand mp hana rawhiti
new zealand mp hana rawhiti
FONT SIZE
GET APP

గతేడాది న్యూజిలాండ్ పార్లమెంట్లో ‘హక’ (సంప్రదాయ కళ) తమ కమ్యూనిటీపై వివక్షను ప్రశ్నిస్తూ ఎంపీ హన-రాహితి పార్లమెంటులో చేసిన ప్రసంగం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఆమె వీడియో వైరల్ గా మారింది. పార్లమెంట్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓ బిల్లును వ్యతిరేకిస్తూ హన ‘హక’ ప్రదర్శనతో నిరసన వ్యక్తం చేశారు. బిల్లు పేపర్లు చించేస్తు… అధికార సభ్యులను చూస్తూ కోపంతో ఊగిపోయారు. ఆమెకు మద్దతుగా సహచర ఎంపీలు, గ్యాలరీలో ఉన్నవారు కూడా గళం కలపడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు.

ఎంపి పేరు హనా-రౌహితి మైపి క్లార్క్‌ (21). 1 70 ఏళ్లలో న్యూజిలాండ్‌లో అత్యంత పిన్న వయస్కురాలైన ఎంపీగా రికార్డు సృష్టించారు. ఆమె గత ఏడాది అక్టోబర్‌లో నానాయా మహుతా నుంచి పోటీ చేసి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ఆమె (మావోరి కమ్యూనిటీ) గిరిజనుల కోసం పోరాడుతున్నారు. ఆమె తాత కూడా ఓ సామాజిక కార్యకర్త. ఆమె హంట్లీ అనే ఓ చిన్న పట్టణానికి చెందింది. అక్కడ మావోరి కమ్యూనిటీకి చెందిన చిన్నారుల కోసం గార్డెన్‌ నడుపుతూ చిన్నారులకు తోటపనిపై అవగాహన కల్పిస్తోంది. ఇక జనవరిలో జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో ‘నేను మీ కోసం చనిపోతాను. కానీ నేను మీకోసం కూడా జీవిస్తాను. నేను రాజకీయ నాయకురాలిని కాదు. మావోరీ భాష యొక్క సంరక్షకురాలిని. కొత్త జనరేషన్‌ యొక్క స్వరాన్ని వినిపిస్తాను. పార్లమెంటులోకి ప్రవేశించేముందు నాకు కొన్ని సలహాలు ఇచ్చారు. వ్యక్తిగతంగా ఏమీ తీసుకోకూడదని.. సరే, ఈ ఛాంబర్‌లో చెప్పిన ప్రతిదాన్ని నేను వ్యక్తిగతంగా తీసుకోకుండా ఉండలేను. కొత్తగా ఎన్నికైన ఈ ప్రభుత్వం రెండు వారాల్లోనే నా ప్రపంచం మొత్తం మీద (ఆరోగ్యం, నీరు, భూమి, సహజవనరులు, మావోరీ, వార్డ్స్‌, రెయో (భాషలపై) దాడి చేసింది. ఈ దేశంలో నాకు, మీకు ఉండే హక్కు ఉంది. ఇంటి నుండి చూస్తున్న ప్రతి వ్యక్తికి.. ఈ క్షణం నాది కాదు, ఇది మీది’ అంటూ ప్రసంగించి వార్తల్లో నిలిచారు. ఇప్పుడు మరోసారి అదే మాదిరి వార్తల్లో హైలైట్ అవుతున్నారు.

????Unprecedented & simply magnificent. That time in Nov 2024 when a haka led by Aotearoa’s youngest MP 22yo Hana-Rawhiti Kareariki Maipi-Clarke erupted in the House stopping the Treaty Principles Bill from passing its first reading, triggering the Speaker to suspend Parliament.… pic.twitter.com/pkI7q7WGlr— Kelvin Morgan ???????? (@kelvin_morganNZ) November 14, 2024

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.