యానిమేషన్ సినిమాలంటే అందరికీ ఇష్టం. జూటోపియా 2” (Zootopia 2) చైనా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. అయితే, చైనా వంటి మార్కెట్‌లో విదేశీ సినిమాలు పెద్ద స్థాయిలో కలెక్షన్లు సాధించడం అంత ఈజీ కాదు. చైనా మార్కెట్ విదేశీ సినిమాలపై అంతగా సానుకూలంగా ఉండదు. అయినా సరే హాలీవుడ్ నుండి వచ్చిన “జూటోపియా 2” (Zootopia 2) అనిమేషన్ సినిమా చైనాలో చక్రం తిరిగేసింది.
Read Also: Thama Movie: ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న రష్మిక ‘థామా’
వసూళ్లు రాబట్టిన సినిమాలలో ఒకటి గా Zootopia 2
జూటోపియా 2 తన గ్లోబల్ బాక్స్ ఆఫీస్ ఓపెనింగ్ వీకెండ్‌లో $556 మిలియన్లను సంపాదించింది. చైనాలో ఈ సినిమా ఒకే రోజులో సుమారు 925 కోట్ల రూపాయిలు వసూలు చేసింది. $150 మిలియన్ బడ్జెట్‌తో తయారైన ఈ సినిమా, అనిమేషన్ సినిమాలలో అత్యంత పెద్ద బడ్జెట్ సినిమా కావడం విశేషం.
చైనాలో హాలీవుడ్ సినిమాల్లో ఇది అత్యధిక ఓపెనింగ్ వారం వసూళ్లను సాధించింది. జూటోపియా 2, నాలుగు రోజుల్లో $200 మిలియన్లను సంపాదించింది. చైనాలో విడుదలైన హాలీవుడ్ సినిమాలలో ఇది అత్యంత వేగంగా వసూళ్లు రాబట్టిన సినిమాలలో ఒకటి గా నిలిచింది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: