📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Sridhar Vembu: విదేశీ విద్య కోసం భారీగా రుణాలు చేయవద్దు: జోహో వ్యవస్థాపకుడు

Author Icon By Vanipushpa
Updated: August 4, 2025 • 4:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనే కలలు కంటున్న భారతీయ విద్యార్థుల(Indian Students) కు, వారి తల్లిదండ్రులకు ప్రముఖ టెక్ సంస్థ జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు(Sridhar Vembu) కీలక హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా అమెరికా(America)లో చదువుల కోసం పెద్ద మొత్తంలో విద్యా రుణాలు తీసుకోవడంలో ఉన్న ప్రమాదాల గురించి ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అమెరికాలో ఉద్యోగ మార్కెట్ చాలా బలహీనంగా ఉందని, ఇమ్మిగ్రేషన్ పరమైన సవాళ్లు కూడా పెరిగాయని ఆయన స్పష్టం చేశారు.

Sridhar Vembu: విదేశీ విద్య కోసం భారీగా రుణాలు చేయవద్దు: జోహో వ్యవస్థాపకుడు

12 శాతం వడ్డీతో ఏకంగా రూ.70 లక్షల రుణం

ఈ మేరకు తన ‘ఎక్స్’ ఖాతాలో ఓ పోస్ట్ ద్వారా ఆయన వాస్తవ పరిస్థితిని వివరించారు. అమెరికాలోని ఓ చిన్న కాలేజీలో మాస్టర్స్ డిగ్రీ కోసం ఓ భారతీయ విద్యార్థి 12 శాతం వడ్డీతో ఏకంగా రూ.70 లక్షల రుణం తీసుకున్న ఉదంతాన్ని ఆయన పంచుకున్నారు. చదువు పూర్తయినా, ఆ విద్యార్థికి ఉద్యోగం దొరకడం గగనంగా మారిందని, త్వరలోనే రుణానికి సంబంధించిన ఈఎంఐలు కూడా మొదలుకానున్నాయని, ఈ పరిస్థితి తనను తీవ్రంగా కలచివేసిందని శ్రీధర్ వెంబు పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల విదేశీ విద్య కోసం ఇంత భారీగా అప్పులు చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని ఆయన గట్టిగా సూచించారు. కేవలం విదేశాల్లోనే కాదు, భారత్‌లో చదువులకైనా ఇంత పెద్ద మొత్తంలో రుణాలు చేయడం సరైన నిర్ణయం కాదని హితవు పలికారు.

నైపుణ్యానికి, ప్రతిభకు ప్రాధాన్యత ఇవ్వాలని

కంపెనీలు కూడా కేవలం డిగ్రీలను చూసి ఉద్యోగాలు ఇచ్చే పద్ధతిని మార్చుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. డిగ్రీల కంటే అభ్యర్థుల్లోని నైపుణ్యానికి, ప్రతిభకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. తమ జోహో సంస్థలో విద్యార్థులకు అవసరమైన శిక్షణ ఇచ్చి, వారి నైపుణ్యాలను మెరుగుపరచడంపైనే ఎక్కువగా ఖర్చు చేస్తామని, ఇతర కంపెనీలు కూడా ఇదే విధానాన్ని అనుసరించాలని ఆకాంక్షించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) యుగంలో ఉద్యోగ మార్కెట్ మరింత అనిశ్చితంగా మారిందని, అందుకే తమ కంపెనీ నియామకాల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోందని శ్రీధర్ వెంబు తెలిపారు. ఆయన పోస్ట్‌పై నెటిజన్ల నుంచి సానుకూల స్పందన వస్తోంది. విదేశీ చదువుల మోజులో పడి ఆర్థికంగా చితికిపోవద్దని చాలామంది అభిప్రాయపడుతున్నారు .

శ్రీధర్ వెంబు ఐఐటి ర్యాంక్?

ప్రారంభ జీవితం మరియు విద్యా నైపుణ్యం వెంబు ప్రతిభ ప్రారంభంలోనే ప్రకాశించింది. ప్రతిష్టాత్మకమైన JEEలో 27వ ర్యాంకుతో ఆల్ ఇండియా ర్యాంకు సాధించి, అతను IIT మద్రాస్‌లో ప్రవేశం పొందాడు. అయితే, పాఠ్యాంశాల్లో లోతు లేకపోవడం వల్ల అతను మరిన్నింటి కోసం ఆరాటపడ్డాడు.

జోహోలో ఎన్ని శాఖలు ఉన్నాయి?

మీరు ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసిన తర్వాత, కొత్త బ్రాంచ్‌ను ఎలా సృష్టించవచ్చో ఇక్కడ ఉంది: గమనిక: మీరు జోహో ఎక్స్‌పెన్స్‌లో గరిష్టంగా 200 బ్రాంచ్‌లను సృష్టించవచ్చు.

Read hindi news: hindi.vaartha.com

Read Also;

https://vaartha.com/ed-letter-to-banks-over-anil-ambani-loan-fraud-case/national/525764/

#telugu News Education Advice financial planning Latest News Breaking News Sridhar Vembu Zoho Foreign Education Student Loans Sridhar Vembu Education Advice Overseas Study Indian Students

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.