ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ (Zelensky) ఒక సంచలన నిర్ణయం వెల్లడించారు. రష్యాతో యుద్ధం ముగిసిన తర్వాత తాను పదవిని వదులుకుంటానని ఆయన స్పష్టం చేశారు. అధ్యక్ష పదవిని కొనసాగించడం తన లక్ష్యం కాదని చెప్పారు. ప్రజలకు శాంతిని తీసుకురావడమే తన ప్రాధాన్యం అని స్పష్టం చేశారు. ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంటే పార్లమెంటు చర్చించాలని కూడా కోరారు. యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో ఎన్నికలు నిరవధికంగా వాయిదా పడ్డాయి.

యుద్ధం ముగించడం ప్రధాన లక్ష్యం
జెలెన్‌స్కీ ప్రకారం, తన ప్రధాన లక్ష్యం యుద్ధం నిలిపివేయడమే. రష్యా దాడులను ఎదుర్కొంటున్న దేశంలో శాంతి నెలకొల్పడమే ముఖ్యమని ఆయన తెలిపారు. అధికారం కోసం పోటీ చేయాలనే ఉద్దేశం తనకు లేదని చెప్పారు. ఇది తన వ్యక్తిగత నిర్ణయం అని ఆయన హైలైట్ చేశారు.జెలెన్‌స్కీ భావోద్వేగంతో మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులను వివరించారు. ఎవరు బతకాలో ఆయుధాలే నిర్ణయిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచం మానవ చరిత్రలోనే అత్యంత విధ్వంసకరమైన ఆయుధ పోటీని చూస్తోందని అన్నారు. ఈ పరిస్థితిని అరికట్టడం అంతర్జాతీయ సమాజం బాధ్యత అని స్పష్టం చేశారు.
ఐక్యరాజ్యసమితిపై విమర్శలు
న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో జెలెన్‌స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ సంస్థలు తమ వైఫల్యాన్ని చాటుకున్నాయని ఆయన అన్నారు. ఉక్రెయిన్, గాజా, సూడాన్‌లలో యుద్ధాలు కొనసాగుతూనే ఉన్నాయని చెప్పారు. ఐక్యరాజ్యసమితి వంటి సంస్థలు వాటిని ఆపలేకపోయాయని విమర్శించారు.రష్యా తమపై దాడులు ఆపడం లేదని జెలెన్‌స్కీ హెచ్చరించారు. పుతిన్ యుద్ధాన్ని నిలిపివేయకపోతే అది మరింత విస్తరిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. యూరప్ అంతటా రష్యా డ్రోన్లు ఎగురుతున్నాయని ఆయన తెలిపారు. ఇది కేవలం ఉక్రెయిన్ సమస్య కాదని, మొత్తం ప్రపంచానికి ముప్పని ఆయన చెప్పారు.
ఎన్నికలపై అనిశ్చితి
ఉక్రెయిన్‌లో ఎన్నికలు వాయిదా పడిన విషయం తెలిసిందే. యుద్ధం కొనసాగుతున్న పరిస్థితుల్లో ఎన్నికలు జరగడం కష్టమని జెలెన్‌స్కీ అంగీకరించారు. అయితే శాంతి నెలకొన్న వెంటనే ప్రజాస్వామ్య ప్రక్రియ పునరుద్ధరించాలని తన సంకల్పాన్ని వెల్లడించారు. ఎన్నికలు జరగడానికి అవకాశం ఉంటే, పార్లమెంటు ఆ నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు.జెలెన్‌స్కీ ప్రసంగం అంతర్జాతీయ వేదికపై మళ్లీ చర్చనీయాంశమైంది. యుద్ధం కాకుండా శాంతి కోసం పోరాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రపంచం కలిసి రష్యాపై చర్యలు చేపట్టకపోతే పరిస్థితి మరింత విషమిస్తుందని హెచ్చరించారు. ఆయుధాల ఆధారంగా మానవ జీవితం నిర్ణయించబడకూడదని ఆయన గుర్తుచేశారు.
Read Also :