📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర

Zelensky: ట్రంప్‌తో భేటీ కానున్న జెలెన్‌స్కీ

Author Icon By Vanipushpa
Updated: August 16, 2025 • 4:39 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఉక్రెయిన్(Ukraine) యుద్ధానికి ముగింపు పలికే దిశగా దౌత్యపరమైన ప్రయత్నాలు ఒక్కసారిగా వేగవంతమయ్యాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌(Putin)తో అమెరికాలోని అలాస్కా(Alaska)లో చర్చలు జరిపిన కొద్ది గంటలకే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Trump) కీలక చర్యలకు ఉపక్రమించారు. ఈ క్రమంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ (Zelensky) తో ఆయన శనివారం ఫోన్‌లో సుదీర్ఘంగా మాట్లాడారు. అనంతరం, సోమవారం (ఆగస్టు 18న) వాషింగ్టన్‌లో వ్యక్తిగతంగా సమావేశం కావాలని జెలెన్‌స్కీని ఆహ్వానించారు. ఈ భేటీలో యుద్ధ నివారణ, హింసకు ముగింపు పలికే అంశాలపై సమగ్రంగా చర్చించనున్నారు.

Zelensky: ట్రంప్‌తో భేటీ కానున్న జెలెన్‌స్కీ

స్వయంగా చెప్పిన జెలెన్‌స్కీ
ఈ విషయాన్ని జెలెన్‌స్కీ స్వయంగా సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ ద్వారా వెల్లడించారు. “అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో సుదీర్ఘంగా, ఫలప్రదంగా చర్చలు జరిపాం. శాంతిని నెలకొల్పేందుకు గరిష్ఠ స్థాయిలో కృషి చేయడానికి ఉక్రెయిన్ సిద్ధంగా ఉందని పునరుద్ఘాటించాం. రష్యా నేతతో జరిగిన సమావేశం, చర్చకు వచ్చిన ప్రధాన అంశాలను ట్రంప్ నాకు వివరించారు” అని జెలెన్‌స్కీ తెలిపారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో అమెరికా సానుకూల ప్రభావం చూపడం చాలా ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.
వాషింగ్టన్‌లో ట్రంప్‌తో భేటీ
అంతేకాకుండా, అమెరికా, రష్యా, ఉక్రెయిన్ మధ్య త్రైపాక్షిక సమావేశం నిర్వహించాలన్న ట్రంప్ ప్రతిపాదనకు తాము మద్దతు ఇస్తున్నట్లు జెలెన్‌స్కీ స్పష్టం చేశారు. కీలకమైన సమస్యలను నేతల స్థాయిలో చర్చించడం ద్వారానే పరిష్కరించగలమని, అందుకు ఈ ఫార్మాట్ సరైనదని ఉక్రెయిన్ భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. “సోమవారం వాషింగ్టన్‌లో ట్రంప్‌తో భేటీ అయి అన్ని వివరాలపై చర్చిస్తాను. ఈ ఆహ్వానానికి నేను కృతజ్ఞుడను” అని ఆయన తన పోస్టులో రాసుకొచ్చారు.

కచ్చితమైన ఒప్పందం కుదరలేదు: వైట్ హౌస్
మరోవైపు, అలాస్కాలో పుతిన్‌తో జరిగిన ట్రంప్ సమావేశంలో చర్చలు ముందుకు సాగినప్పటికీ, ఎలాంటి కచ్చితమైన ఒప్పందం కుదరలేదని వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి. చర్చల అనంతరం పుతిన్ మాట్లాడుతూ, ఉక్రెయిన్‌పై ఇరు నేతల మధ్య ఒక అవగాహన కుదిరిందని పేర్కొన్నారు.
అయితే, ట్రంప్ దీనిపై స్పందిస్తూ, “ఒక ఒప్పందం కుదిరే వరకు ఎలాంటి అంగీకారం లేదు” అని స్పష్టం చేశారు. సంక్షోభానికి మూలకారణాలను తొలగిస్తేనే శాంతి సాధ్యమని పుతిన్ అన్నారు. దాదాపు దశాబ్దం తర్వాత ఒక రష్యా అధ్యక్షుడు అమెరికాలో పర్యటించడం ఇదే తొలిసారి.

జెలెన్స్కీ గురించి మనకు ఏమి తెలుసు?
జెలెన్స్కీ ఉక్రెయిన్ యొక్క మొదటి యూదు అధ్యక్షుడు; వోలోడిమిర్ గ్రోయిస్మాన్ ప్రధానమంత్రిగా ఉండటంతో, ఉక్రెయిన్ ఇజ్రాయెల్ కాకుండా ఒకేసారి యూదు దేశాధినేత మరియు ప్రభుత్వ అధిపతిని కలిగి ఉన్న మొదటి దేశంగా అవతరించింది.
ఉక్రెయిన్ ఎందుకు ముఖ్యమైనది?
ప్రపంచ వ్యవహారాల్లో ఉక్రెయిన్ ఒక మధ్యస్థ శక్తిగా పరిగణించబడుతుంది. దాని సైన్యం ప్రపంచంలోనే ఆరవ అతిపెద్దది, ఎనిమిదవ అతిపెద్ద రక్షణ బడ్జెట్‌తో, మరియు ప్రపంచంలోనే అతిపెద్ద మరియు అత్యంత వైవిధ్యమైన డ్రోన్ నౌకాదళాలలో ఒకదాన్ని నిర్వహిస్తుంది.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/shubhamshu-shukla-will-meet-modi-in-india-soon/international/531054/

Diplomacy International Relations Latest News Breaking News Telugu News trump ukraine US Politics Zelensky

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.