📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu News: Zelensky: ట్రంప్ తో జెలెన్ స్కీ భేటీ..మరోసారి రష్యాకు బెదిరింపులు

Author Icon By Vanipushpa
Updated: October 18, 2025 • 11:05 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఉక్రెయిన్‌తో యుద్ధం ఆపకపోతే తమ దగ్గర ఉన్న అత్యంత శక్తివంతమై తోమహాక్ క్షిపణులను ఆ దేశానికి ఇవ్వాల్సి వస్తుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Trump) ఈ మధ్యన రష్యాను బెదిరించారు. రష్యా చేత ఎలా అయినా యుద్ధం ఆపించాలని ట్రంప్ పట్టుపట్టుకుని కూర్చుకున్నారు. దాని కోసం రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ బెదిరింపులకు కూడా లొంగపోయేసరికి ఇప్పుడు ఆయనతో మరోసారి సమావేశానికి కూడా సిద్ధమయ్యారు. హంగరీ రాజధాని బుడాపెస్ట్‌లో మరి కొన్ని రోజుల్లో పుతిన్, జెలెన్‌స్కీ(Zelensky)లతో సమావేశమవనున్నారు ట్రంప్.

Read Also: PAK VS AFG: పాకిస్థాన్ పై అఫ్గానిస్థాన్ దాడి ఏడుగురు మృతి

ట్రంప్ తో జెలెన్ స్కీ భేటీ..మరోసారి రష్యాకు బెదిరింపులు

యుద్ధం ముగించడమే నాకు ముఖ్యం: ట్రంప్

అయితే అంతకు ముందే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఈరోజు అమెరికాకు వచ్చారు ఓవల్ ఆఫీసలో అధ్యక్షుడు ట్రంప్‌ను కలిశారు. తోమహాక్ క్షిపణులను ఇవ్వాలని అందుకు బదులుగా తాము డ్రోన్లను ఇస్తామని చెప్పారు. కానీ ట్రంప్ మాత్రం ఉక్రెయిన్ అధ్యక్షుడికి మొండిచెయ్యి చూపించారు. తోహమమాక్ క్షిపణులను ఇప్పుడు ఇవ్వలేనని చెప్పేశారు. అమెరికా నిల్వలను తగ్గించలేనని..వాటిని సరి చూసుకోవాలని చెప్పారు. దాని కన్నా ముఖ్యంగా తనకు యుద్ధం ముగించడమే అత్యంత ముఖ్యమని తెలిపారు. రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం త్వరలోనే ముగుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ట్రంప్ తోమహాక్ క్షిపణుల నిరాకరణ

అందుకే ఇప్పుడు తాను క్షిపణులను ఇవ్వలేనని జెలెన్‌స్కీ కు చెప్పేశారు ట్రంప్. అయితే తోమహాక్ క్షిపణులు తమ దగ్గర ఉంటే రష్యా అధ్యక్షుడు పుతిన్‌ శాంతి చర్చలను సీరియస్‌గా తీసుకునేలా చేయొచ్చని ఉక్రెయిన్ అధ్యక్షుడు అంటున్నారు. ముందు బుడాపెస్ట్‌లో సమావేశం అవ్వనివ్వాలని..తర్వాత క్షిపణుల గురించి ఆలోచిస్తానని ట్రంప్ దానికి బదులు చెప్పారని వైట్ హౌస్ అధికారులు చెబుతున్నారు. అయితే ట్రంప్ తోమహాక్ క్షిపణుల నిరాకరణ వెనుక రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరిక ఉందని తెలుస్తోంది.

జెలెన్‌స్కీ…ట్రంప్‌తో మరికొన్ని ఒప్పందాలు

ఉక్రెయిన్‌కు క్షిపణులను ఇస్తే అమెరికా-రష్యా సంబంధాలకు హాని కలుగుతుందని, దాని వలన యుద్ధం మరింత సీరియస్ అవుతుందే తప్ప ఏం ఉపయోగం లేదని ఆయన హెచ్చరించినట్లు సమాచారం. దీంతో పాటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ…ట్రంప్‌తో మరికొన్ని ఒప్పందాలను చేసుకున్నారు. దీంతో పాటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ…ట్రంప్‌తో మరికొన్ని ఒప్పందాలను చేసుకున్నారు. అమెరికన్ ధ్రువీృత సహజవాయువును నిల్వ చేయడం వంటి సంభావ్య ఇంధన ఒప్పందాలపై చర్చించారు. దీని ద్వారా యూరప్‌లో అమెరికా వ్యాపారం మరింత విస్తరిస్తుందని తెలిపారు. ఉక్రెయిన్ ఇంధన మౌలిక సదుపాయాలను పునరుద్ధరించడంలో సహాయపడుతుందన్నారు.

ఇప్పుడు ఉక్రెయిన్ అధ్యక్షుడు ఎవరు?
వోలోడిమిర్ జెలెన్స్కీ
ఉక్రెయిన్ / అధ్యక్షుడు
ఇప్పుడు ఉక్రెయిన్ అధ్యక్షుడు ఎవరు అనే చిత్రం?
ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ యూరోపియన్ యూనియన్ విదేశాంగ వ్యవహారాలు మరియు భద్రతా విధాన ఉన్నత ప్రతినిధి కాజా కల్లాస్‌తో సమావేశం నిర్వహించారు.

ఉక్రెయిన్ ప్రజాస్వామ్యమా?
రాజ్యాంగ వ్యవస్థ యొక్క ప్రాథమిక స్వేచ్ఛలు మరియు ప్రాథమిక అంశాలు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 ఉక్రెయిన్‌ను సార్వభౌమాధికారం కలిగిన మరియు స్వతంత్ర, ప్రజాస్వామ్య, సామాజిక, చట్ట ఆధారిత రాష్ట్రంగా ఏర్పాటు చేస్తుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 5 ఉక్రెయిన్‌ను గణతంత్ర రాజ్యంగా నిర్వచిస్తుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Latest News Breaking News Russia Ukraine Conflict Telugu News trump foreign policy Ukraine US relations Zelensky Trump meeting Zelensky warns Russia

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.