📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Zelensky peace plan : 60 రోజుల కాల్పుల విరమణైతే చాలు,శాంతికి రెడీ…

Author Icon By Sai Kiran
Updated: December 27, 2025 • 3:34 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Zelensky peace plan : ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే దిశగా అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్‌స్కీ ఒక కీలక ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చారు. తన ‘20 అంశాల శాంతి ప్రణాళిక’పై దేశవ్యాప్తంగా ప్రజాభిప్రాయ సేకరణ (రెఫరెండం) నిర్వహించేందుకు తాను సిద్ధమని, అయితే ఇందుకు రష్యా కనీసం 60 రోజుల పాటు కాల్పుల విరమణ పాటించాల్సిందేనని స్పష్టం చేశారు.

అమెరికా మీడియా సంస్థ ‘యాక్సియోస్’కు ఇచ్చిన ఫోన్ ఇంటర్వ్యూలో జెలెన్‌స్కీ ఈ విషయాలను వెల్లడించారు. శాంతి ఒప్పందంలో భాగంగా భూభాగాలు, సరిహద్దులకు సంబంధించిన క్లిష్టమైన నిర్ణయాలు ఉంటే, వాటిపై తుది మాట ప్రజలదే కావాలని ఆయన అన్నారు. “ఇది చాలా కఠినమైన నిర్ణయం. అందుకే మొత్తం శాంతి ప్రణాళికను ప్రజల ముందుంచి వారి అభిప్రాయాన్ని తీసుకోవాలనుకుంటున్నాను. కానీ బాంబు దాడుల మధ్య ఓటింగ్ జరగదు. భద్రత, ఎన్నికల నిర్వహణ దృష్ట్యా కనీసం 60 రోజుల విరామం అవసరం” అని జెలెన్‌స్కీ వివరించారు.

Read Also: AP: ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ

ఈ నేపథ్యంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ (Zelensky peace plan) ట్రంప్ తో ఫ్లోరిడాలో జరగనున్న భేటీపై జెలెన్‌స్కీ ఆశలు పెట్టుకున్నారు. ఈ సమావేశం యుద్ధ ముగింపుకు స్పష్టమైన దారి చూపుతుందని ఆయన భావిస్తున్నారు. ప్రస్తుతం ఉక్రెయిన్–అమెరికా మధ్య ఐదు కీలక ఒప్పందాలపై అంగీకారం కుదిరిందని, భద్రతా హామీల కాలపరిమితిని ప్రతిపాదిత 15 ఏళ్ల నుంచి మరింత పెంచాలని తాను కోరుతున్నట్లు తెలిపారు.

మరోవైపు రష్యా కూడా ప్రజాభిప్రాయ సేకరణకు కాల్పుల విరమణ అవసరమని ఒప్పుకుంటున్నప్పటికీ, 60 రోజుల గడువు చాలా ఎక్కువని భావిస్తున్నట్లు సమాచారం. కాలపరిమితిని తగ్గించాలని రష్యా కోరుతుండగా, క్షేత్రస్థాయిలో ఏర్పాట్లకు రెండు నెలలు కూడా తక్కువేనని ఉక్రెయిన్ వాదిస్తోంది. ఈ అంశాలపై ట్రంప్, జెలెన్‌స్కీ, యూరోపియన్ నేతల మధ్య త్వరలో కాన్ఫరెన్స్ కాల్ జరిగే అవకాశముందని సమాచారం.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

60 day ceasefire proposal Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Russia Ukraine negotiations Telugu News Ukraine conflict update Ukraine peace referendum Ukraine Russia ceasefire Ukraine security guarantees Ukraine war latest news Zelensky Axios interview Zelensky peace plan Zelensky Trump meeting

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.