📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest news: Bangladesh: పాక్ పై ప్రేమ..భారత్ పై కక్ష.. బయటపడ్డ యూనస్ బుద్ధి

Author Icon By Saritha
Updated: October 27, 2025 • 2:12 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్ పై బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ (Bangladesh) అధినేత మహమ్మద్ యూనస్ మరోసారి తన కుటిలబుద్ధిని బయటపెట్టుకున్నారు. బంగ్లా తాత్కాలిక ప్రధాని షేక్ హసీనా భారత్ లో ఆశ్రయం పొందడంపై యూనస్ నిత్యం ఏదోఒక విధంగా ఇండియాపై తనదైన విమర్శల్ని గుప్పిస్తున్నారు. తాజాగా పాకిస్తాన్ ఆర్మీ ఉన్నతాధికారికి యూనస్ ఒక వివాదాస్పద మ్యాప్ను బహుమతిగా ఇవ్వడం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ చర్య ద్వారా భారత్ సార్వభౌమత్వాన్ని యూనస్ పరోక్షంగా ప్రశ్నించారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఢాకాలో పర్యటించిన మీర్జా పాకిస్తాన్(Pakistan) జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఛైర్మన్ జనరల్ సాహిత్ షంషాద్ మీర్జా ఢాకాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన

యూనస్ తో సమావేశమయ్యారు. ఈ భేటీ తర్వాత, యూనస్ స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో కొన్ని ఫొటోలను పోస్ట్ చేశారు. ఇందులో పాక్ జనరల్ కు ‘ఆర్ట్ ఆఫ్ ట్రయంఫ్’ అనే పుస్తకాన్ని యూనస్ బహుమతిగా ఇస్తున్న చిత్రం ఉంది. ఆ పుస్తకం ముఖచిత్రంపై ఉన్న మ్యాప్లో భారత్ లోని ఏడు ఈశాన్య రాష్ట్రాలను బంగ్లాదేశ్ భూభాగంలో కలిపి చూపించారు. ఇది తీవ్రవాద ఇస్లామిక్ సంస్థలు కోరుతున్న ‘గ్రేటర్ బంగ్లాదేశ్’ వాదనకు బలం చేకూర్చేలా ఉంది.

Read also: ప్రభాస్ హీరోయిన్ లేటెస్ట్ డ్యాన్స్ వీడియో వైరల్

Bangladesh: పాక్ పై ప్రేమ..భారత్ పై కక్ష.. బయటపడ్డ యూనస్ బుద్ధి

యూనస్ పై తీవ్ర నెటిజన్ల విమర్శలు

ఈ ఫొటో బయటకు రావడంతో సోషల్ మీడియాలో(Bangladesh) యూనస్ పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అనవసరంగా భారత్ అంతర్గత విషయాల్లోకి ప్రవేశిస్తున్నారని నెటిజన్లు విమర్శిస్తున్నారు. అయితే ఈ వివాదంపై భారత విదేశాంగశాఖ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. చైనా, పాకిస్తాన్ ల మద్దతు యూనస్ కోరుతున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు షేక్ హసీనాను తమదేశానికి అప్పగించాలని యూనస్ పలుమార్లు వ్యాఖ్యానించారు. తమ శత్రువుకు భారత్ ఆశ్రయం ఇస్తున్నదని భారత్ పై ఇప్పటికే యూనస్ పలుమార్లు విమర్శించారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

bangladesh Controversy Greater Bangladesh india Latest News in Telugu Muhammad Yunus northeast India Pakistan army Sheikh Hasina Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.