हिन्दी | Epaper
భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest News: Arrest: దేశానికి ద్రోహం చేస్తున్న యూట్యూబర్ అరెస్టు

Anusha
Latest News: Arrest: దేశానికి ద్రోహం చేస్తున్న యూట్యూబర్ అరెస్టు

అసలే భారత్ పాకిస్తాన్ ల మధ్య విద్వేశాలు పెరిగిపోతున్నాయి. సింధు నది (Indus River) జలాల విషయంలో పాకిస్తాన్ భారత్ పై నిప్పులను కురిపిస్తున్నది. రెండుదేశాల మధ్య ఉద్రిక్తతల మధ్య ప్రజలు నలిగిపోతుంటే దేశానికి సేవ చేయాల్సింది పోయి,

పాకిస్తాన్కు భారత్ సమాచారాన్ని అందిస్తున్న ఓ యూట్యూబర్ను,పోలీసులు అదుపులో తీసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా (Jyoti Malhotra) పాకిస్తాన్ ఐఎస్ఐకి గూఢచర్యం చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది..

Bomb threat: నటి త్రిషా, సీఎం స్టాలిన్ ఇంటికి బాంబు బెదిరింపులు

తాజాగా అదే హర్యానా (Haryana) కు చెందిన మరో యూట్యూబర్ వసీం అక్రమ్ కూడా పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజన్స్ తరపున గూఢచర్యం చేస్తున్నాడనే ఆరోపణలతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మేవాట్ హిస్టరీపై యూట్యూబ్లో వీడియోలు చేసిన అక్రమ్ ను బుధవారం రాత్రి అరెస్టు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

మూడేళ్లుగా పాక్ ఏజెంట్లతో సంబంధాలు

పాల్వాల్ జిల్లాలోని కోట్ గ్రామానికి చెందిన వసీం అక్రమ్ (Wasim Akram) మూడేండ్ల నుంచి పాకిస్తాన్ ఏజెంట్లతో సంబంధాలు కొనసాగిస్తున్నట్లు పోలీసుల విచారణలోతేలింది. అక్రమ్ వాట్సాప్ చెక్ చేయగా, నేరపూరిత సందేశాలను గుర్తించామన్నారు.

అతని ఫోన్ ను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించామని చెప్పారు. త్వరలోనే అక్రమ్ గూఢచర్యానికి సంబంధించి మరిన్ని వివరాలను వెల్లడిస్తామన్నారు.హర్యానాలోని పల్వర్ ప్రాంతానికి చెందిన ‘జ్యోతి మల్హోత్రా’ అనే యూట్యూబర్ను పోలీసులు అరెస్టు చేశారు.

ఆమె ‘ట్రావెల్ విత్ జో’ పేరుతో యూట్యూబ్ ఛానెల్ నడుపుతోంది. ట్రావెల్ బ్లాగర్ (Travel blogger) ముసుగులలో జ్యోతి, దేశంలోని సున్నితమైన సమాచారాన్ని, ముఖ్యంగా సైనిక స్థావరాలు, కదలికలకు సంబంధించిన వివరాలను పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లకు చేరవేసినట్లు విచారణలో
తేలింది.

పాక్ ఏజజెంట్లతో నిరంతరం టచ్

జ్యోతి మల్హోత్రా, ఆమెతో పాటు అరెస్టైన మరో ఐదుగురు నిందితులు వాట్సప్, టెలిగ్రామ్, స్నాప్ చాట్ వంటి ఎన్క్రిప్టెడ్ మేనేజింగ్ యాప్ల ద్వారా పాక్ ఏజజెంట్ల (Pakistani agents) తో నిరంతరం టచ్ లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

ఈ సమాచారం చేరవేసినందుకుగాను వారికి పెద్ద మొత్తంలో డబ్బు చేరినట్లుతెలుస్తోంది. పోలీసుల దర్యాప్తులో జ్యోతి మల్హోత్రా 2023లో ట్రావెల్ వీసాపై పాకిస్తాన్ లో పర్యటించినట్లు వెల్లడించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870