UAE President: మీ యుద్ధం మాతో కాదు.. ఇరాన్‌పై యూఏఈ అధ్యక్షుడు ఆగ్రహం

Read Time:  1 min
UAE President: మీ యుద్ధం మాతో కాదు.. ఇరాన్‌పై యూఏఈ అధ్యక్షుడు ఆగ్రహం
FONT SIZE
GET APP

UAE President: అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ హతమైనట్లు వార్తలు రావడంతో ఇరాన్ ఉగ్రరూపం దాల్చింది. తన ప్రతీకారాన్ని కేవలం అమెరికా, ఇజ్రాయెల్‌కే పరిమితం చేయకుండా, పొరుగున ఉన్న యూఏఈ (UAE), ఖతార్, కువైట్, బహ్రెయిన్, ఒమన్, సౌదీ అరేబియాలపై క్షిపణి వర్షం కురిపిస్తోంది. దీంతో మొత్తం పశ్చిమాసియా యుద్ధ క్షేత్రంగా మారింది.

Read Also: Iran Shock to America : తీవ్రమైన యుద్ధం.. అమెరికాకు ఇరాన్ షాక్!

దుబాయ్, అబుదాబి ఎయిర్‌పోర్టులే టార్గెట్.. దద్దరిల్లిన లగ్జరీ హోటళ్లు

ఇరాన్ తన అత్యాధునిక మిస్సైల్స్ మరియు ఆత్మాహుతి డ్రోన్లతో యూఏఈలోని అత్యంత రద్దీగా ఉండే దుబాయ్, అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయాలను లక్ష్యంగా చేసుకుంది. ఎయిర్‌పోర్టులతో పాటు పలు హోటళ్ల సమీపంలో పేలుళ్లు సంభవించినట్లు నివేదికలు అందుతున్నాయి. ఈ దాడుల వల్ల అంతర్జాతీయ విమాన రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి.

Your war is not with us.. UAE President's anger at Iran
Your war is not with us.. UAE President’s anger at Iran

మీ యుద్ధం మాతో కాదు.. ఇరాన్‌పై యూఏఈ అధ్యక్షుడు ఆగ్రహం

ఇరాన్ తీరుపై యూఏఈ అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పొరుగు దేశాలపై, సామాన్య ప్రజలపై దాడులు చేయడం ఏంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. “మీ యుద్ధం పొరుగు దేశాలతో కాదు, శత్రువులతో తేల్చుకోండి. శాంతియుతంగా ఉన్న గల్ఫ్ దేశాలను ఈ రక్తపాతంలోకి లాగడం తగదు” అని ఆయన ఇరాన్‌ను హెచ్చరించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.