📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు

Yemen: యెమెన్ నర్స్ నిమిషా ప్రియకు ఉరిశిక్ష – భారత ప్రభుత్వం కాపాడేందుకు యత్నాలు

Author Icon By Vanipushpa
Updated: July 10, 2025 • 10:47 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కేరళ(Kerala)కు చెందిన నర్సు నిమిషా ప్రియ(Nimisha Priya)కు యెమెన్(Yemen) ఉరిశిక్షను ఖరారు చేసింది. ఆదేశ అధ్యక్షుడి(President) ఆమోదంతో ఈ నెల 16న ఈ శిక్షను యెమెన్‌ దేశం అమలు చేయనున్నారు. ఈ విషయాన్ని మానవ హక్కుల కార్యకర్త శామ్యూల్ జెరోమ్ తెలిపారు. గతంలో నిమిష ఉరిశిక్షపై క్షమాభిక్షను భారత విదేశాంగ శాఖ కోరగా అందుకు ఆదేశ అధ్యక్షుడు రషద్ అల్-అలిమి తిరస్కించారు. వ్యాపార భాగస్వామిని హత్య చేసిన కేసులో నిమిష ప్రియకు ఉరిశిక్ష ఖరారైంది. ప్రస్తుతం యెమెన్ రాజధాని సనా జైలులో ఉన్నారామే. 2017లో వ్యాపార భాగస్వామిని నిమిష హత్య చేయగా.. 2020లో మరణ శిక్ష విధించింది యెమెన్ కోర్టు. నిమిష ప్రియది కేరళలోని పాలక్కాడ్‌ జిల్లా కొల్లెంగోడ్‌. 2008లో యెమెన్‌కు వెళ్లింది. యెమెన్‌ హాస్పిటల్స్‌లో నర్సుగా పని చేసింది. తర్వాత చిన్న క్లినిక్ ప్రారంభించింది. యెమెన్‌లో వ్యాపారం చేయాలంటే స్థానిక భాగస్వామి కంపల్సరీగా ఉండాలి.

Yemen: యెమెన్ నర్స్ నిమిషా ప్రియకు ఉరిశిక్ష – భారత ప్రభుత్వం కాపాడేందుకు యత్నాలు

నిమిషను తప్పించేందుకు ప్రయత్నాలు..
ఉరిశిక్ష పడిన కేరళ నర్స్ ను కాపాడేందుకు భారత ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఆమె ఉరిశిక్షను ఆపేందుకు స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది. అయితే నిమిష ప్రస్తుతం హౌతీ తిరుగుబాటు దారుల నియంత్రణలో ఉన్న సనాలోని జైల్లో ఉన్నారు. భారత్ కు, హౌతీ తిరుగుబాటు దారులకు ప్రత్యక్ష అధికార సంబంధాలు లేకపోవడం వల్లన ఆమె కేసు చర్చలు కష్టంగా మారుతున్నాయి. పైగా హౌతీ పరిపాలన తాలూకా సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ కూడా 2024 లో ఆమె మరణశిక్షను సమర్థించింది. మరోవైపు నిమిషా ప్రియ యాక్షన్ కౌన్సిల్‌ అధికారులు, యెమెన్ అధికారులు బాధిత కుటుంబాన్ని ఒప్పించేందుకు ప్రయత్నిస్తోంది. బ్లడ్ మనీ ద్వారా వారిని ఒప్పించాలని చూస్తున్నారు.

బ్లడ్ మనీ అంటే ఏంటి..
నిమిష ేతుల్లో చిపయిన మెహదీ కుటుంబానికి బ్లడ్ మనీ ఇవ్వడం ద్వారా ఆమెను శిక్ష నుంచి తప్పించాలని ప్రయత్నాలు జరగుతున్నాయి. బ్లడ్ మనీ దీనినే ఇస్లామిక్ షరియా చట్టంలో ‘దియ్యా’ అని కూడా పిలుస్తారు. యెమెన్ లో షరియా చట్టం అనుసరిస్తారు. దీని ద్వారా బాధిత కుటుంబానికి ఆర్థిక పరిహారాన్ని అందిస్తారు. దీంట్లో బాధిత కుటుంబానికి 1 మిలియన్ డాలర్ల సాయం అందించడంతో పాటు, ఆ కుటుంబం సిఫారసు చేసిన వ్యక్తికి లేదా ఏ ఇతర వ్యక్తికైనా కేరళలో ఉచిత చికిత్స అందించడంతో పాటూ ప్రయాణ ఖర్చుల్ని కూడా భరిస్తారు. ఇదే కాక మెహదీ సోదరుడు యూఏఈ, సౌదీ అరేబియాలో స్థిరపడాలని నిర్ణయించుకుంటే ఖర్చులను భరించేందుకు కూడా సిద్ధపడ్డారు. అయితే దీనిపై మెహదీ కుటుంబసభ్యులు ఇంకా స్పందించలేదు. నిమిషాను కాపాడ్డానికి ప్రస్తుతానికి ఇదొక్కటే మార్గం ఉంది. ఇది వర్కౌట్ అవ్వకపోతే ఆమెకు ఉరిశిక్ష పడడం ఖాయం.

నిమిషా ప్రియ ప్రస్తుతం ఉన్న స్థితి
యెమెన్ రాజధాని సనా జైల్లో నిమిషా ప్రియ ఉన్నారు.ఈ ప్రాంతం హౌతీ తిరుగుబాటుదారుల నియంత్రణలో ఉంది. భారత్‌కు హౌతీలతో ప్రత్యక్ష సంబంధాలు లేకపోవడం వల్ల సమస్యలు ఎదురవుతున్నాయి. హౌతీ సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ కూడా మరణశిక్షను మద్దతుగా నిలిపింది .

యెమెన్‌లో మరణశిక్ష విధించబడిన నర్సు ఎవరు?
నిమిషా ప్రియ 2008లో దక్షిణ భారత రాష్ట్రమైన కేరళ నుండి యెమెన్‌కు నర్సుగా పని చేయడానికి బయలుదేరింది. మహదీ మృతదేహం లభించిన తర్వాత ఆమెను 2017లో అరెస్టు చేశారు.
యెమెన్‌లో భారత నర్సు మరణశిక్ష ఎవరికి?
భారతీయ నర్సుకు జూలై 16న ఉరిశిక్ష విధించనున్నట్లు ఆమెను కాపాడటానికి పనిచేస్తున్న ప్రచారకులు బిబిసికి తెలిపారు. నిమిషా ప్రియా అనే స్థానిక వ్యక్తిని హత్య చేసినందుకు ఆమెకు మరణశిక్ష విధించబడింది - ఆమె మాజీ వ్యాపార భాగస్వామి తలాల్ అబ్దో మహదీ

Read hindi news: hindi.vaartha.com

Read Also:Elon Musk: ట్రంప్, ఎలాన్ మస్క్ మధ్య మళ్లీ భగ్గుమన్న విభేదాలు

#telugu News Houthi rebels humanitarian case India India Foreign Ministry Indian Nurse in Yemen Nimisha Priya Nimisha Priya blood money Yemen death penalty Yemen Execution

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.