ఇజ్రాయెల్ ప్రధాన విమానాశ్రయమైన బెన్ గురియన్ ఎయిర్‌పోర్ట్‌పై హౌతీ తిరుగుబాటుదారులు మిస్సైల్ దాడికి తెగబడ్డారు. యెమెన్‌కి చెందిన హౌతీలు ప్రయోగించిన ఈ మిస్సైల్ విమానాశ్రయం సమీపంలో పేలడంతో తీవ్ర ఆందోళనకు దారి తీసింది. ఐరన్ డోమ్ డిఫెన్స్ సిస్టమ్ ఈ మిస్సైల్‌ను అడ్డుకోలేకపోవడం తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ పేలుడుతో ఆరుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించగా, వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.
ఐరన్ డోమ్ విఫలమైందా?
ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థగా ప్రసిద్ధమైన ఐరన్ డోమ్ ఒక మిస్సైల్‌ను కూడా అడ్డుకోలేకపోవడం విపరీత చర్చనీయాంశమైంది. సాధారణంగా చిన్న మిస్సైల్ దాడులను సైతం సమర్థవంతంగా అడ్డుకునే ఈ వ్యవస్థ ఎందుకు పని చేయలేకపోయిందనే దానిపై ఇజ్రాయెల్ ప్రభుత్వం సీరియస్‌గా దర్యాప్తు ప్రారంభించింది. హౌతీలు ప్రయోగించిన మిస్సైల్ అత్యంత వేగంగా ప్రయాణించినదా, లేక వ్యూహాత్మకంగా ఐరన్ డోమ్‌ను తప్పించిందా అనే కోణాల్లో అధికారులు పరిశీలిస్తున్నారు.
ఇజ్రాయెల్ గగనతలాన్ని మూసివేత
ఈ దాడి నేపథ్యంలో దేశ భద్రతా విభాగం అప్రమత్తమైంది. తాత్కాలికంగా గంటపాటు ఇజ్రాయెల్ గగనతలాన్ని మూసివేశారు. అంతర్జాతీయ విమానాల రాకపోకలను నిలిపివేసి ప్రయాణికుల సురక్షిత బదలాయింపుకు చర్యలు తీసుకున్నారు. హౌతీల మిస్సైల్ దాడి మళ్లీ యుద్ధ భూతాన్ని ముంచేసిందని విశ్లేషకులు అంటున్నారు. ఇదిలా ఉండగా, ఇజ్రాయెల్ మరోసారి హౌతీలపై కౌంటర్ దాడులకు సిద్ధమవుతోందని సమాచారం.
Read Also : Tragedy : తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గిరిజా ప్రియదర్శిని మృతి