యెమెన్‌లో మరణశిక్ష (Death penalty in Yemen) ఎదుర్కొంటున్న భారతీయ నర్సు నిమిష ప్రియ (Nimisha Priya)కు ఊరట లభించింది. ఆమె మరణశిక్షను యెమెన్ ప్రభుత్వం అధికారికంగా రద్దు చేసింది. ఈ శుభవార్తను భారత గ్రాండ్ ముఫ్తీ కాంతపురం ఏపీ అబుబాకర్ ముస్లియార్ కార్యాలయం ప్రకటించింది.గ్రాండ్ ముఫ్తీ ఏపీ అబుబాకర్ ముస్లియార్ జోక్యం చేసుకున్నారు. యెమెన్ అధికారులను మరణశిక్షపై పునఃపరిశీలించాలని కోరారు. ఫలితంగా జూలై 16న అమలు చేయాల్సిన ఉరిశిక్షను ముందురోజే నిలిపివేశారు. తరువాత కేంద్రం, గ్రాండ్ ముఫ్తీ కలిసి యెమెన్ ప్రభుత్వంతో చర్చలు జరిపారు.

ఉన్నత స్థాయి సమావేశంలో కీలక నిర్ణయం
తాజాగా యెమెన్ రాజధాని సనాలో కీలక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో నిమిష ప్రియకు మరణశిక్ష రద్దు చేయాలని నిర్ణయించారు. అయితే ఇప్పటి వరకు యెమెన్ ప్రభుత్వం నుంచి రాతపూర్వక ఆదేశాలు రాలేదు. భారత విదేశాంగ శాఖ కూడా ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.ఆమెను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారత అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి సుప్రీంకోర్టులో వివరాలు వెల్లడించారు. కోర్టు విచారణను ఆగస్టు 14కి వాయిదా వేసింది.
నిమిష ప్రియ కేసు నేపథ్యం
యెమెన్ జాతీయుడు మహద్ హత్యకేసులో నిమిష ప్రియకు శిక్ష విధించారు. ఆమె మహద్‌తో వ్యాపారం చేసింది. విభేదాలు రావడంతో తన పాస్‌పోర్టు కోసం అడిగింది. మహద్ నిరాకరించడంతో మత్తుమందు ఇచ్చి పాస్‌పోర్టు తీసుకోవాలని ప్రయత్నించింది. డోస్ ఎక్కువ కావడంతో మహద్ మరణించాడు.హత్యకేసులో యెమెన్ పోలీసులు నిమిషను అరెస్ట్ చేశారు. స్థానిక కోర్టు ఆమెకు మరణశిక్ష విధించింది. ఆ శిక్షను టాప్ కోర్టు కూడా సమర్థించింది. జూలై 16న ఉరిశిక్ష అమలు చేయాల్సి వచ్చింది. కానీ చివరి నిమిషంలో అది వాయిదా పడింది. ఇప్పుడు మరణశిక్ష పూర్తిగా రద్దు అయింది.
Read Also : RBI : ఆర్బీఐకి తలనొప్పిగా మారిన ఈ భారీ డిపాజిట్లు!