Latest news: Yarlagadda Rajyalakshmi: అమెరికాలో అనారోగ్యంతో బాపట్ల విద్యార్థిని మృతి

Read Time:  1 min
Yarlagadda Rajyalakshmi
Yarlagadda Rajyalakshmi
FONT SIZE
GET APP

ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన బాపట్ల జిల్లా విద్యార్థిని అనారోగ్యంతో మృతి చెందింది. ఈ ఘటన బాపట్ల జిల్లా కారంచేడు గ్రామంలో విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళ్తే, యార్లగడ్డ రాజ్యలక్ష్మి (Yarlagadda Rajyalakshmi) (23) అనే యువతి అమెరికాలోని టెక్సాస్ ఏ అండ్ ఎమ్ యూనివర్సిటీలో ఎంఎస్ పూర్తి చేసింది. భవిష్యత్తు కోసం ఎంతో కష్టపడి ఉన్నత చదువులు పూర్తి చేసిన ఆమె ఆకస్మిక అనారోగ్యంతో కన్నుమూసింది.

Read Also: Actor Vishal: కోయంబత్తూర్‌ ఘటన.. నిందితులకు మరణశిక్ష విధించాలని విశాల్‌ డిమాండ్

రాజి (Yarlagadda Rajyalakshmi) రెండు మూడు రోజులుగా తీవ్రమైన దగ్గు, ఛాతి నొప్పితో బాధపడుతూ ఉంది. నవంబర్ 7 ఉదయం అలారం మోగినా లేవలేదు. దీంతో తోటి స్నేహితులు గమనించి చికిత్స అందించే లోపే ఆమె మృత్యువాత పడినట్టు తెలిసింది. దీంతో ఆమె కుటుంబం, స్నేహితులు శోకసముద్రంలో మునిగిపోయారు.

రాజి కుటుంబం ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) లోని ఒక చిన్న గ్రామంలో వ్యవసాయం ఆధారంగా జీవిస్తోంది. వారికున్న భూమి, పశువులు వారిని నిలబెట్టే ఆర్థిక ఆధారం . రాజి మాత్రం చదువుతో కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న తపనతో అమెరికాకు వెళ్లింది.

Yarlagadda Rajyalakshmi
Yarlagadda Rajyalakshmi

రాజ్యలక్ష్మి మృతి పట్ల సాంబశివరావు ప్రగాఢ సంతాపం

అయితే ఆ ఆశలు నెరవేరకముందే ఆమె తనువు చాలించింది.రాజి మృతదేహాన్ని స్వగ్రామం కారంచేడుకు తరలించేందుకు భారత ఎంబసి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలోనే ఆమె మృతదేహం ఇండియాకు చేరుకోనుంది.

రాజ్యలక్ష్మి మృతి పట్ల పర్చూరు శాసనసభ్యుడు ఏలూరి సాంబశివరావు ఆమె కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపం తెలిపారు. 

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.