📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News: World Skill: వరల్డ్ స్కిల్ కాంపిటీషన్లలో యువత పాల్గొనాలి

Author Icon By Pooja
Updated: October 7, 2025 • 12:29 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ : రాష్ట్రంలోని 16 నుంచి 24 సంవత్సరాల లోపు ఉన్న యువత ఉపాధి, శిక్షణ శాఖ నిర్వహించే వరల్డ్ స్కిల్స్(World Skill) కాంపిటీషన్-2026 పోటీల్లో పాల్గొనాలని తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకిష్టారెడ్డి సూచించారు. ఇందులో గెలుపొందిన వారు వచ్చే ఏడాది సెప్టెంబర్లో చైనాలోని షాంఘైలో జరిగే ఒలంపిక్స్-2026లోవరల్డ్ స్కిల్స్(World Skill) పాల్గొనే అవకాశం దక్కనుందని తెలిపారు. ఉత్సాహ వంతులైన యువతీ, యువకులు ఈ నెల 15లోగా స్కిల్ ఇండియా డిజిటల్ పోర్టల్లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.

Read also: Ramchandra Rao: బస్సు ఛార్జీల పెంపు రద్దు చేయాలి

ఇందుకు సంబంధించిన వివరాలను ఎంప్లాయీమెంట్ అండ్ ట్రెయినింగ్ డెవలప్ మెంట్ స్టేట్ కోఆర్డినేటర్ ప్రశాంతితోపాటు ఉన్నత విద్యా మండలి వైస్ చైర్జున్ ప్రొఫెసర్ కటిక్యాల
పురుషోత్తం, కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ కలిసి సోమవారం మీడియాకి వివరాలను వెల్లడించారు. స్టేట్ స్కిల్ కాంపిటీషను డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంప్లాయీమెంట్ అండ్ ట్రెయినింగ్(Department of Employment and Training) తెలంగాణ నిర్వహిస్తుందని తెలిపారు. ఇండియా స్కిల్ కాంపిటీషన్స్్ను కేంద్ర స్కిల్ డెవలప్మెంట్ ఆండ్ ఎంటర్ప్రైన్యూర్షిప్ వారు నిర్వహిస్తారని తెలిపారు. జోనల్, స్టేట్, రీజినల్, నేషనల్ పేరిట నాలుగు లెవల్స్లో స్కిల్ కాంపిటీషన్స్ ఉంటాయని తెలిపారు.

కుకింగ్ నుంచి ఎయిర్ క్రాప్ట్ వరకు 63 రకాల స్కిల్ కాంపిటీషను నిర్వహించనున్నారు. నవంబర్లో జోనల్ లెవల్స్ ను పూర్తి చేసుకొని డిసెంబర్లో స్టేట్, ఫిబ్రవరిలో నేషనల్ లెవలు పూర్తి చేసేలా ఇప్పటి వరకు ప్రణాళికను రూపొందించుకున్నట్టు తెలిపారు. అయితే వచ్చే దరఖాస్తుల ఆధారంగా మార్పులు, వేర్పులు ఉంటాయని తెలిపారు. 63 స్కిల్ కేటగిరిల్లో పోటీలు ఉంటాయన్నారు. వ్యక్తిగతంగా గ్రూప్ పోటీలు ఉంటాయని తెలిపారు. స్టేట్ నుంచి 63 స్కిల్ కాంపిటీషన్స్ నుంచి గెలుపొందిన వారిని నేషనల్ పోటీలకి పంపిస్తామన్నారు. ఉచితంగానే స్కిల్ ఇండియా డిజిటల్ పోర్టల్లో 16 నుంచి 24 సంవత్సరాల యువతీ, యువకులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
ఈ నెల 15 వరకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు ఉందన్నారు. ఇప్పటి వరకు సుమారు 5500 మంది దరఖాస్తు చేసుకున్నట్టు తెలిపారు. గత ఏడాది 25 మంది రాష్ట్రం నుంచి నేషనల్ కాంపిటీషన్కి వెళ్లారని.. ఈ సారి ఎక్కువ మంది వెళ్లేలా ప్రయత్ని స్తున్నట్టు స్టేట్ స్కిల్ కాంపిటీషన్స్ కోఆర్డినేటర్ ప్రశాంతి తెలిపారు. వరల్డ్ స్కిల్ కాంపిటీషన్స్ 89 దేశాల నుంచి ప్రాతినిధ్యం ఉందని తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

employment opportunities Latest News in Telugu Telugu News Today Youth Participation

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.