📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Wimbledon 2025: వింబుల్డన్ 2025 విజేతగా జానిక్ సినెర్

Author Icon By Anusha
Updated: July 14, 2025 • 2:52 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

2025 వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో ఇటలీకి చెందిన వరల్డ్ నెంబర్ వన్ జానిక్ సిన్నర్ అద్భుతమైన ఆటతీరుతో తన పేరును చరిత్రలో లిఖించుకున్నాడు. జూలై 13, ఆదివారం నాడు జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్ (Men’s Singles Final) మ్యాచ్‌లో టాప్ సీడ్ సిన్నర్, వరల్డ్ నెంబర్ 2 స్పెయిన్‌కు చెందిన కార్లోస్ అల్కరాజ్‌ను 4-6, 6-4, 6-4, 6-4 స్కోరుతో ఓడించి టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇది వింబుల్డన్ 148 ఏళ్ల చరిత్రలో టైటిల్ గెలిచిన తొలి ఇటాలియన్ ఆటగాడిగా సిన్నర్‌కు ఘన గుర్తింపు.ఈ విజయం సినెర్ కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మక ఘట్టంగా నిలిచింది. ఫ్రెంచ్ ఓపెన్ 2025 ఫైనల్‌లో అల్కరాజ్ (Alcaraz) చేతిలో ఓడినపుడు కలిగిన బాధకు ఈ విజయమే సరైన ప్రతీకారం అయ్యింది. అంతేకాదు, అల్కరాజ్ హ్యాట్రిక్ వింబుల్డన్ టైటిల్ గెలవాలన్న ఆశలను కూడా ఈ గెలుపుతో చెరిపివేశాడు.

డబుల్ పాల్ట్స్

మూడు గంటల నాలుగు నిమిషాలపాటు సాగిన ఫైనల్ మ్యాచ్ నాటకీయతతో, ఉత్కంఠతో నిండిపోయింది. మొదటి సెట్‌ను 6-4తో అల్కరాజ్ సొంతం చేసుకున్నాడు. కానీ, ఆ తర్వాత మూడు సెట్లలో సిన్నర్ తన ఆటతీరు మెరుగుపరుచుకుంటూ, ఫలితంగా వరుసగా 6-4, 6-4, 6-4 స్కోర్లతో మ్యాచ్‌ను గెలిచేశాడు. అతని శక్తివంతమైన సర్వ్‌లు, ఖచ్చితమైన గ్రౌండ్‌స్ట్రోక్‌లు, అసాధారణ కోర్ట్ కవరేజ్ – ఇవన్నీ కలిసి విజయం అందించాయి.ఈ మ్యాచ్‌లో అల్కరాజ్ 15 ఏస్‌లు సంధించి 7 డబుల్ పాల్ట్స్ చేశాడు. మరోవైపు జానిక్ సినెర్ (Janic Siner) 8 ఏస్‌లు సంధించి 2 డబుల్ ఫాల్ట్స్ మాత్రమే నమోదు చేశాడు. జానిక్ సినెర్ 4 బ్రేక్ పాయింట్స్ సాధించగా కార్లోస్ అల్కరాజ్ 2 మాత్రమే అందుకున్నాడు. సినర్ 125 పాయింట్స్ గెలిస్తే అల్కరాజ్ 113కు మాత్రమే పరిమితమయ్యారు.

తొలి వింబుల్డన్ టైటిల్ కాగా

వింబుల్డన్ విజేతగా నిలిచిన సినర్‌కు రూ. 34 కోట్ల ప్రైజ్‌మనీ దక్కనుంది. ఇది గతేడాది కంటే 11శాతం ఎక్కువ. రన్నరప్ అల్కరాజ్‌ రూ. 17.65 కోట్ల ప్రైజ్‌మనీ అందుకోనున్నాడు. గతేడాది కంటే ఇది 8.6 శాతం ఎక్కువ.సినర్‌కు ఇది తొలి వింబుల్డన్ టైటిల్ కాగా, నాలుగో గ్రాండ్ స్టామ్ టైటిల్. గతేడాది, ఈ ఏడాది ఆస్ట్రేలియా (Australia) ఓపెన్ గెలిచిన సినెర్, ఈ ఏడాది యూఎస్ ఓపెన్ సాధించాడు. వింబుల్డన్‌లో అల్కరాజ్ జైత్రయాత్రకు సినెర్ కళ్లెం వేసాడు. వరుసగా 24 విజయాల తర్వాత అల్కరాజ్ ఓటమిపాలయ్యాడు. గత రెండేళ్లలో సినెర్ నాలుగు గ్రాండ్ స్లామ్ ఛాంపియన్‌షిప్‌లు, నాలుగు ఏటీపీ మాస్టర్స్ 1000 ట్రోఫీలు, 2024 నిట్టో ఏటీపీ ఫైనల్స్ టైటిల్‌ను గెలుచుకున్నాడు.

జానిక్ సినెర్ ఎవరు?

జానిక్ సినెర్ ఒక ఇటాలియన్ ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయర్. అతను 2025 వింబుల్డన్ పురుషుల సింగిల్స్ విజేతగా నిలిచాడు. ప్రస్తుతం అతను వరల్డ్ నంబర్ వన్ ర్యాంక్‌లో ఉన్నాడు.

జానిక్ సినెర్ జన్మస్థలం ఎక్కడ?

జానిక్ సినెర్ 2001 ఆగస్టు 16న ఇటలీలోని సాన్ కాండిడో అనే చిన్న పట్టణంలో జన్మించాడు. అతను దక్షిణ త్రోలే ప్రాంతంలో పెరిగాడు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Saina Nehwal: వివాహ బంధానికి సైనా-కశ్యప్ గుడ్ బై

Breaking News Carlos Alcaraz vs Sinner Italian tennis history Jannik Sinner wins Telugu News Wimbledon 2025 Wimbledon champion Wimbledon final

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.