हिन्दी | Epaper
అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర

Latest News: Nobel Peace Prize: నోబెల్ శాంతి బహుమతిని తిరస్కరించిన వ్యక్తి ఎవరంటే?

Anusha
Latest News: Nobel Peace Prize: నోబెల్ శాంతి బహుమతిని తిరస్కరించిన వ్యక్తి ఎవరంటే?

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ బహుమతులు ప్రతి సంవత్సరం వివిధ రంగాలలో ఎవరికి ఇవ్వబడతాయో అనేది చాలామందికి ఆసక్తికరంగా ఉంటుంది. ప్రతి సంవత్సరం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెడిసిన్, సాహిత్యం, శాంతి వంటి విభాగాలలో అత్యుత్తమ ప్రతిభను గుర్తించి, కమిటీ ఆ విజేతలను ప్రకటిస్తూ ఉంటుంది.

Swathi Varma: ఐర్లాండ్‌లో భారత యువతిపై దాడి

అయితే ఈ సంవత్సరం అందరి దృష్టి ప్రత్యేకంగా నోబెల్ శాంతి బహుమతి వైపుకు ఉన్నది. ఎందుకంటే, ఈసారి నోబెల్ శాంతి బహుమతికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కూడా అభ్యర్ధిగా నిలిచారు.తాను పలు దేశాల మధ్య తలెత్తిన యుద్ధాలను ఆపానని.. కనుకు తనకు తప్పకుండా నోబెల్ శాంతి బహుమతి (Nobel Peace Prize) ఇవ్వాలని ట్రంప్ కోరుతూ వచ్చారు.

అలానే పలు దేశాలతో తన పేరును సిఫారసు చేయించుకున్నారు. అయినా సరే ఆయనకు నోబెల్ శాంతి బహుమతి దక్కలేదు. వీరంతా శాంతి బహుమతి (Nobel Peace Prize) కోసం ఇంతలా ఎదురు చూస్తుంటే.. ఒకరు మాత్రం నోబెల్ శాంతి బహుమతిని తిరస్కరించిన ఏకైక వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయారు.

నోబెల్ శాంతి బహుమతిని తిరస్కరించిన వ్యక్తి

2025 సంవత్సరానికి సంబంధించి.. వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరినా మచాడో (Maria Corina Machado) కు నోబెల్ శాంతి బహుమతి ఇస్తున్నట్లు కమిటీ ప్రకటించింది. ఇదిలా ఉంటే.. ఆయన ఎవరు.. ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారంటే..నోబెల్ శాంతి బహుమతిని తిరస్కరించిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయారు వియత్నాంకు చెందిన విప్లవకారుడు,

దౌత్యవేత్త, రాజకీయవేత్త అయిన లె డక్ థోను (Le Duck Thon). నోబెల్ బహుమతుల చరిత్రలో శాంతి బహుమతిని తిరస్కరించిన ఏకైక వ్యక్తిగా థోను నిలిచిపోయారు.ఫ్రాన్స్ ఓటమి తర్వాత వియత్నాం రెండుగా విభజించబడింది.

Nobel Peace Prize
Nobel Peace Prize

ఉత్తర వియత్నాంలో కమ్యూనిస్టులు పాలనా పగ్గాలు

ఉత్తర వియత్నాంలో కమ్యూనిస్టులు పాలనా పగ్గాలు చేపట్టగా.. దక్షిణ వియత్నాంలోని ప్రభుత్వానికి అమెరికాకు మద్దతిచ్చింది. కానీ ఉత్తర వియత్నాంలో కమ్యూనిస్టుల పాలనను చూసి.. దాని చుట్టు పక్కల ఉన్న దేశాలు కూడా కమ్యూనిస్టు పాలననే కోరుకుంటాయన్న భయం మొదలైంది.

దాంతో, అమెరికా వియత్నాంపై యుద్ధం ప్రకటించింది. ఈ యుద్ధం ముగింపులో లె డక్ థోను ఉత్తర వియత్నాం తరఫున కీలక పాత్ర పోషించారు.ఈ క్రమంలో లె డక్ థో (Le Duck Tho), అమెరికా విదేశాంగ కార్యదర్శి హెన్రీ కిస్సింజర్‌తో కలిసి 1973లో వియత్నాం యుద్ధం కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకోవడంలో కీలక పాత్ర పోషించారు.

లె డక్ థోకు కూడా శాంతి బహుమతి

దీంతో నోబెల్ కమిటీ 1973 హెన్రీ కిస్సింజర్‌తో పాటుగా లె డక్ థోకు కూడా శాంతి బహుమతిని ప్రకటించింది. కానీ ఆయన దాన్ని తిరస్కరించారు. పారిస్ శాంతి ఒప్పందాలను (Paris Peace Accords) పూర్తి స్థాయిలో గౌరవించి.. ఆమేరకు దక్షిణ వియత్నాంలో శాంతి పునరుద్ధరిస్తేనే.. తాను నోబెల్ శాంతి బహుమతిని స్వీకరించడాన్ని పరిశీలిస్తానని తెలుపుతూ..

లె డక్ నోబెల్ కమిటీకి టెలిగ్రామ్ పంపారు.దక్షిణ వియత్నాంలో పారిస్ శాంతి ఒప్పందాల నిబంధనలను పూర్తి స్థాయిలో ఉల్లంఘిస్తున్నారని లె డక్ థో చెప్పారు.. అమెరికా, దక్షిణ వియత్నాం దేశాల మధ్య నిరంతర శత్రుత్వం, సంఘర్షణ ఇంకా కొనసాగుతున్నాయని..

అక్కడ ఇంకా శాంతి ఏర్పడలేదని.. అలాంటప్పుడు శాంతి బహుమతిని ఎలా అంగీకరించాలని ఆయన ప్రశ్నించారు. అందుకే తాను నోబెల్ శాంతి పురస్కరాన్ని తిరస్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈక్రమంలో నోబెల్ అవార్డుల చరిత్రలో ఈ అవార్డు తిరస్కరించిన ఏకైక వ్యక్తిగా లె డక్ థో నిలిచిపోయారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

https://vaartha.com/international/huge-explosion-in-american-city/562590/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

హిందువులపై దాడులు భారత్, బ్రిటన్ ఆందోళన

హిందువులపై దాడులు భారత్, బ్రిటన్ ఆందోళన

హాలీవుడ్ అవార్డుల వేదికపై ప్రియాంకా చోప్రా

హాలీవుడ్ అవార్డుల వేదికపై ప్రియాంకా చోప్రా

వెనిజువెలా వెనుక అసలు కథ ఏంటి? అమెరికాపై CPI(ML) తీవ్ర ఆరోపణలు

వెనిజువెలా వెనుక అసలు కథ ఏంటి? అమెరికాపై CPI(ML) తీవ్ర ఆరోపణలు

ట్రంప్ కు ఇరాన్ సుప్రీం లీడర్ స్ట్రాంగ్ కౌంటర్

ట్రంప్ కు ఇరాన్ సుప్రీం లీడర్ స్ట్రాంగ్ కౌంటర్

ఇరాన్ నిరసనలకు ట్రంప్ మద్దతు.. అణిచివేస్తే తీవ్ర పరిణామాలు
0:33

ఇరాన్ నిరసనలకు ట్రంప్ మద్దతు.. అణిచివేస్తే తీవ్ర పరిణామాలు

అమెరికా బెదిరింపులు, దాడి చేస్తే ముందే కాల్పులు – డెన్మార్క్ హెచ్చరిక

అమెరికా బెదిరింపులు, దాడి చేస్తే ముందే కాల్పులు – డెన్మార్క్ హెచ్చరిక

దేశవ్యాప్తంగా చెలరేగిన ఆందోళనలు, ఇంటర్నెట్ నిలిపివేత

దేశవ్యాప్తంగా చెలరేగిన ఆందోళనలు, ఇంటర్నెట్ నిలిపివేత

Aleppoలో కర్ఫ్యూ, సిరియా సైన్యం SDF మధ్య తీవ్ర ఘర్షణలు

Aleppoలో కర్ఫ్యూ, సిరియా సైన్యం SDF మధ్య తీవ్ర ఘర్షణలు

తిలక్ వర్మకు సర్జరీ, న్యూజిలాండ్‌తో తొలి 3 టీ20లకు దూరం BCCI

తిలక్ వర్మకు సర్జరీ, న్యూజిలాండ్‌తో తొలి 3 టీ20లకు దూరం BCCI

థాయ్‌లాండ్‌లో భారతీయుడిపై ట్రాన్స్‌జెండర్ల దాడి , పట్టాయలో కలకలం

థాయ్‌లాండ్‌లో భారతీయుడిపై ట్రాన్స్‌జెండర్ల దాడి , పట్టాయలో కలకలం

అమెరికా సీజ్ చేసిన ట్యాంకర్లో ముగ్గురు ఇండియన్లు!

అమెరికా సీజ్ చేసిన ట్యాంకర్లో ముగ్గురు ఇండియన్లు!

చనిపోయిన భిక్షగాడి వద్ద లక్షల నగదు , కేరళలో షాకింగ్ ఘటన

చనిపోయిన భిక్షగాడి వద్ద లక్షల నగదు , కేరళలో షాకింగ్ ఘటన

📢 For Advertisement Booking: 98481 12870