📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

అదానీ పై కుట్ర చేస్తోంది ఎవరు?

Author Icon By Vanipushpa
Updated: January 30, 2025 • 12:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశీయ పారిశ్రామిక దిగ్గజం, అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీల అధినేత గౌతమ్ అదానీపై ఆర్థికపరమైన దాడి చేయడానికి హిండెన్‌బర్గ్‌‌ను నియమించుకున్న అమెరికన్ చైనీస్ ఇన్వెస్టర్/చైనీస్ గూఢచార్యం ఇటీవలే బహిర్గతం కావడం, సీనియర్ అడ్వొకేట్ మహేశ్ జెఠ్మలానీ చైనా హస్తం గురించి ఆరోపణలు చేయడం అదానీ వ్యవహారాన్ని స్పై థ్రిల్లర్‌గా మార్చివేశాయి. ఈ వరుస పరిణామాలు అనేక ప్రశ్నలను లేవనెత్తాయి. అదానీ వంటి భారత వ్యాపార, పారిశ్రామిక దిగ్గజంపై ఈ తరహా దాడులను చేయడంలో ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశాల్లో ఒకటి ఎందుకు ఉంది?, చైనాకు వ్యతిరేకంగా అదానీకి అమెరికా ఎందుకు మద్దతు ఇస్తోంది?.. అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గుజరాత్‌లో అదానీకి చెందిన ముంద్రా, ఖవ్డా సైట్లను భారత్‌లోని అమెరికా రాయబారి ఇటీవలే సందర్శించారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికీ వెనుకాడలేదు. దీని ద్వారా అదానీకి అమెరికా మద్దతుగా నిలిచిందనే సంకేతాలను ఆ రాయబారి పంపించినట్టయింది.

నవంబర్ 2023లో అదానీకి చెందిన కొలంబో పోర్ట్ ప్రాజెక్ట్‌కు ఆర్థిక సహాయం అందించిన అమెరికా ప్రభుత్వానికి చెందిన డీఎఫ్‌సీ అనే సంస్థ హిండెన్‌బర్గ్ నివేదికను అసంబద్ధం అంటూ తేల్చి పడేసింది. దీన్ని నిర్ద్వందంగా తోసిపుచ్చింది. ఈ పరిణామం- దేశీయ స్టాక్ మార్కెట్‌లో అదానీ షేర్ల విలువను అమాంతం పెంచింది. చైనా తరువాత, అదానీ ఈ రంగంలో బలంగా అడుగు పెట్టింది. ప్రపంచంలోనే వనరులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో పాదం మోపిన సంస్థల్లో మొదటి భారతీయ కంపెనీగా నిలిచింది. ఆస్ట్రేలియా కార్యకలాపాలలో ఇప్పటి వరకు తొమ్మిది బిలియన్ల సొంత నిధులు/ఈక్విటీని పెట్టుబడి పెట్టింది.. అదాని సంస్థ. అదాని కంటే ముందు బొగ్గు సహా ఆస్ట్రేలియా సహజ వనరులను చైనీయులు అధికశాతం కొనుగోలు చేశారు. అదానీ రాకతో ఈ ప్రాంతంలో చైనా ఆధిపత్యానికి తెర పడే పరిస్థితులు ఏర్పడ్డాయి. 2020లో ఆస్ట్రేలియాలోని యాంకోల్ గనులు కలిగిన చైనా బొగ్గు దిగ్గజం.. అదానీ ఆస్ట్రేలియాలో ఉత్పత్తి చేసిన దానిలో 20 రెట్లు ఎక్కువ ఉత్పత్తి చేసింది. ఇది మొత్తం ఎగుమతుల్లో 40 శాతం. మొత్తానికి అదానీని, ఆయన వ్యాపార సామ్రాజ్యాన్ని టార్గెట చేస్తూ, ఆయన ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఒక నెట్‌వర్క్ పనిచేస్తున్నట్లు స్పష్టమవుతోంది.

china conspiring Gautam Adani india USA

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.