దాయాది పాకిస్థాన్(Pakistan), అఫ్గనిస్థాన్(Afghanistan) మధ్య ఇటీవల పరస్పర దాడులు దశాబ్దాల తర్వాత రెండు పొరుగు దేశాల మధ్య జరిగిన అత్యంత తీవ్రమైన ఘర్షణల్లో ఒకటిగా నిలిచింది. దీనికి ప్రధాన కారణంగా ఉగ్రవాద నేత పేరు వినిపిస్తోంది. పాక్ ఆరోపణల ప్రకారం.. ఆ నేత తన భూభాగంపై దాదాపు ప్రతిరోజూ దాడులు చేసే ఉగ్రవాదులకు దిశానిర్దేశం చేస్తున్నాడని మండిపడుతోంది. అఫ్గన్, పాక్ మధ్య అక్టోబరు 14న 48 గంటల కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చినప్పటికీ తెహ్రిక్ ఇ తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) ఉగ్రవాద సంస్థ అధినేత నూర్ వలి మెహ్‌సూద్, అతడి సహచరులు అఫ్గనిస్థాన్‌లో ఆశ్రయం పొందడంపై పాక్ ఆవేదన వ్యక్తం చేస్తోంది.
Read Also: Trump: రష్యా చమురు కొనుగోళ్లు ఆపేస్తామని మోదీ ట్రంప్‌కు చెప్పారా?
ఉగ్రవాదులకు స్వర్గంగా మారిన పాక్
గతవారం నూర్ వలి మెహసూద్ లక్ష్యంగా పాకిస్థాన్ సైన్యం కాబూల్‌లో వైమానిక దాడి చేసింది. అతడు ఉన్నట్టు భావించిన టయోటా ల్యాండ్ క్రూయిజర్ వాహనాన్ని లక్ష్యంగా చేసుకుంది. కానీ, ఈ దాడిలో అతడు త్రుటిలో తప్పించుకున్నట్టు పాక్ చెబుతోంది. ఆ తరువాత అతడి పేరుతో టీటీడీ ఓ ఆడియో సందేశాన్ని విడుదల చేసింది. కానీ, 2022లో అల్ ఖైదా నేత ఐమాన్ అల్-జవహిరి లక్ష్యంగా అమెరికా జరిపిన దాడి తర్వాత కాబూల్‌లో జరిగిన తొలి వైమానిక దాడి ఇదే కాగా.. దీనిని పాక్ అధికారికంగా ధ్రువీకరించలేదు. అయితే,, పాక్ ఆరోపణలను ఖండించిన తాలిబన్లు.. ఆ దేశమే ఉగ్రవాదులకు స్వర్గంగా మారిపోయిందని ఎదురుదాడి చేశారు.
2018లో పగ్గాలు చేపట్టిన టీటీపీ చీఫ్
అమెరికా డ్రోన్ దాడిలో టీటీపీ అగ్రనేతలు ముగ్గురు హతమవ్వగా.. మెహ్‌సూద్ 2018లో దాని నాయకత్వ బాధ్యతలు చేపట్టారు. అప్పటికే పాక్ దళాలు పట్టున్న ప్రదేశాల నుంచి అఫ్గన్‌లోకి తరిమికొట్టాయి. అయితే, మెహ్‌సూద్ పగ్గాలు చేపట్టిన తర్వాత టీటీపీ పునరుద్దరించి, వ్యూహాన్ని మార్చాడు. తమలో తాము పోరాడుకుంటోన్న వర్గాలను ఏకతాటిపైకి తీసుకొచ్చాడని విశ్లేషకులు అంటున్నారు. మత పండితుడిగా శిక్షణ పొందిన అతను సైద్ధాంతిక యుద్ధాన్ని కూడా చేపట్టాడు.
సైన్యం, పోలీసులనే లక్ష్యంగా
గతంలో మసీదులు, మార్కెట్లు సహా పౌరులను లక్ష్యంగా చేసుకున్న టీటీపీ.. 2014లో ఓ పాఠశాలపై మారణకాండకు పాల్పడిన 130 మందికిపైగా పిల్లల ప్రాణాలు తీసింది. ఈ దాడులు పాక్ ప్రజల ఆగ్రహానికి కారణమయ్యాయని ఆందోళన చెందిన మెహ్‌సూద్.. కేవలం సైన్యం, పోలీసులనే లక్ష్యంగా చేసుకోవాలని టీటీపీకి సూచించారు.
టీటీపీని సాయుధ పోరాట ఉద్యమంగా మలిచే ప్రయత్నం
ఉగ్రవాద కార్యకలాపాలపై నిపుణుడు అబ్దుల్ సయీద్ ప్రకారం.. మేహ్‌సూద్ పాక్ వాయువ్య ప్రాంతం, అఫ్గనిస్థాన్‌లో ఉండే పశ్తూన్ తెగకు ప్రతినిధిగా మాట్లాడుతున్నట్టు చెప్పుకుంటాడు. టీటీపీని సాయుధ పోరాట ఉద్యమంగా మలిచే ప్రయత్నం చేస్తున్నాడు. అంతేకాదు, పశ్తూన్ గిరిజనుల హక్కుల కోసం తాలిబన్ పాలనా విధానానికి సమానమైన వ్యవస్థను స్థాపించాలనే లక్ష్యంతో ఉన్నాడు.
ఆఫ్ఘనిస్తాన్ దేనికి ప్రసిద్ధి చెందింది?
ఆఫ్ఘనిస్తాన్ దాని గొప్ప చరిత్ర మరియు సంస్కృతికి ప్రసిద్ధి చెందింది, అందమైన ఓరియంటల్ రగ్గులు మరియు పెర్షియన్ కవిత్వ సంప్రదాయంతో సహా. భౌగోళికంగా, ఇది హిందూ కుష్ పర్వతాలు మరియు దాని ప్రత్యేకమైన ప్రకృతి దృశ్యానికి ప్రసిద్ధి చెందింది.
పాకిస్తాన్ పూర్తి పేరు ఏమిటి?
దీనిని అధికారికంగా ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ అని పిలుస్తారు. దీనికి దక్షిణాన అరేబియా సముద్రం వెంబడి పొడవైన తీరప్రాంతం ఉంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: