ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ),(WHO) అగ్రరాజ్యం అమెరికా మధ్య విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. సంస్థ నుంచి వైదొలుగుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రెయెసస్ తీవ్రంగా తప్పుబట్టారు. అమెరికా ప్రభుత్వం చెబుతున్న కారణాల్లో ఏమాత్రం వాస్తవం లేదని.. ఈ నిర్ణయం వల్ల అమెరికాకే కాకుండా ప్రపంచ దేశాల ఆరోగ్య భద్రతకు కూడా ముప్పు వాటిల్లుతుందని ఆయన హెచ్చరించారు.
Read Also: Iran Protests: ఇరాన్‌పై దాడి యోచన రద్దు చేసిన ట్రంప్
ప్రపంచ దేశాలను అప్రమత్తం చేశాం: టెడ్రోస్
కరోనా మహమ్మారి వ్యాప్తి సమయంలో డబ్ల్యూహెచ్‌ఓ సకాలంలో స్పందించలేదని.. కీలక సమాచారాన్ని దాచి పెట్టడం వల్లే అమెరికాలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారని ట్రంప్ సర్కార్ ఆరోపించింది. జనవరి 22వ తేదీన అమెరికా ఆరోగ్య మంత్రి కెనడీ జూనియర్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ మేరకు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. అయితే దీనిపై డబ్ల్యూహెచ్‌ఓ జనరల్ డైరెక్టర్ టెడ్రోస్ ఎక్స్ వేదికగా స్పందించారు. “కరోనా కట్టడిలో డబ్ల్యూహెచ్‌ఓ విఫలమైందన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవం. మేం సకాలంలోనే స్పందించాం. ప్రపంచ దేశాలను అప్రమత్తం చేశాం. సమాచారాన్ని దాచామన్న వాదనలో ఏమాత్రం నిజం లేదు” అని టెడ్రోస్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అమెరికా ఆరోపణలను ఆధారాలతో సహా తిప్పికొడుతూ.. రూపొందించిన అధికారిక నోటిఫికేషన్‌ను కూడా ఆయన విడుదల చేశారు. అగ్రరాజ్యం లాంటి దేశం ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వైదొలగడం వల్ల భవిష్యత్తులో వచ్చే మహమ్మారులను ఎదుర్కోవడం కష్టం అవుతుందని నిపుణులు భావిస్తున్నారు. నిధుల కోతతో పాటు అంతర్జాతీయ ఆరోగ్య విధానాల అమలులో అమెరికా లేకపోవడం పెద్ద లోటుగా పరిణమిస్తుందని పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: