అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(trump) దేశీయ ఉద్యోగుల రక్షణపై కఠిన విధానాన్ని కొనసాగిస్తూనే, విదేశీ పెట్టుబడులకు కూడా ప్రోత్సాహం అందిస్తున్నారని వైట్ హౌస్(White House) ప్రెస్ సెక్రటరీ క్యారొలైన్ లెవిట్ తెలిపారు. ముఖ్యంగా H-1B వీసాలపై వచ్చిన విమర్శల నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
పత్రికా ప్రతినిధులతో మాట్లాడుతూ లెవిట్, “అమెరికన్ కార్మికుల స్థానంలో ఎవరూ రావద్దనే అభిప్రాయం అధ్యక్షుడికి స్పష్టంగా ఉంది. తయారీ రంగాన్ని బలోపేతం చేసేందుకు ట్రంప్ తీసుకున్న సుంకాల విధానం, కొత్త వాణిజ్య ఒప్పందాలు ఇదే దిశలో ముతున్నాయి” అని పేర్కొన్నారు. H-1B పై అధ్యక్షుడి దృక్పథం కూడా పూర్తిగా స్పష్టమైనదేనని ఆమె అన్నారు.
Read Also: Medak Crime: అత్త తిట్టిందని అల్లుడు ఆత్మ హత్య!
అమెరికాలో భారీగా పెట్టుబడులు పెట్టే విదేశీ కంపెనీలు ప్రారంభ దశలో తమ ఇంజినీర్లను తీసుకురావాల్సి ఉండొచ్చని, కానీ చివరికి ఆ అవకాశాలు అమెరికన్ ఉద్యోగులకే వెళ్లాలనే లక్ష్యమని లెవిట్ చెప్పారు. దేశంలో పెట్టుబడులు పెట్టే సంస్థలతో ట్రంప్ ప్రత్యక్షంగా మాట్లాడి, “ఇక్కడ వ్యాపారం చేయాలంటే నా ప్రజలను నియమించుకోవాలి” అని స్పష్టం చేసినట్లు ఆమె వెల్లడించారు.
“నైపుణ్యాలు ఉన్నవారు కావాలి – ఇదే అమెరికా ఫస్ట్‌లో భాగం”
H-1B కార్యక్రమాన్ని సమర్థిస్తూ ట్రంప్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. అమెరికా-సౌదీ ఇన్వెస్ట్మెంట్ ఫోరమ్‌లో ఆయన మాట్లాడుతూ, “నాకు విభేదించే కొంతమంది కన్జర్వేటివ్ మిత్రులు ఉన్నా, అమెరికాకు విదేశీ నిపుణులు అవసరమే” అని తెలిపారు. అధునాతన చిప్ ఫ్యాక్టరీల ఉదాహరణ ఇస్తూ ట్రంప్, “అంత పెద్ద పెట్టుబడులతో ఫ్యాక్టరీలు నిర్మించినప్పుడు వెంటనే నిరుద్యోగుల(unemployed) జాబితా నుంచి తీసుకొని కస్టమైజ్డ్ నైపుణ్యాలను ఇవ్వడం సాధ్యం కాదు. మొదట ఆ రంగంలో అనుభవం ఉన్న విదేశీ నిపుణులే వచ్చి శిక్షణ ఇవ్వాలి. తర్వాతే అమెరికన్ కార్మికులు బాధ్యతలు చేపడతారు” అని వివరించారు.
ఈ వ్యాఖ్యలతో ట్రంప్ మరోసారి H-1B వంటి నైపుణ్య వీసాలు అమెరికా ఆర్థిక వ్యవస్థకు అవసరమనే సంకేతం ఇచ్చారు. రిపబ్లికన్ పార్టీలో కొంతమంది ఈ కార్యక్రమాన్ని తగ్గించాలని ఒత్తిడి తీసుకొస్తున్నప్పటికీ, అత్యున్నత నైపుణ్య ఉద్యోగాల కోసం విదేశీ నిపుణులను తీసుకురావడం సరికాదని ట్రంప్ భావిస్తున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: