📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

H-1B Visa: హెచ్‌-1బీ వీసాలో భారీ కుంభకోణం ఎక్కడంటే?

Author Icon By Tejaswini Y
Updated: November 26, 2025 • 11:52 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా హెచ్–1బీ (H-1B Visa) వీసాల దుర్వినియోగంపై వచ్చిన ఆరోపణలకు తాజాగా మరింత బలం చేకూరింది. భారతీయ–అమెరికన్ మాజీ దౌత్యవేత్త మహవష్ సిద్ధిఖీ(Mahavash Siddiqui) చేసిన వ్యాఖ్యలు ఈ అంశాన్ని మరోసారి చర్చకు తెచ్చాయి. నైపుణ్యాలు కలిగిన విదేశీ ప్రొఫెషనల్స్ కోసం జారీ చేసే హెచ్-1బీ వీసాలు గత కొంతకాలంగా వివాదాలకు కేంద్రంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో, భారతీయులు నకిలీ అర్హత పత్రాలు, రాజకీయ ఒత్తిళ్లతో ఈ వీసాలను పొందుతున్నారని సిద్ధిఖీ ఆరోపించడం సంచలనం రేపింది.

Read also : Justice Suryakant: ఈ దేశానికి ప్రధాన న్యాయమూర్తి అవుతానని ఊహించలేదు: జస్టిస్ సూర్యకాంత్

భారతీయులకు జారీ చేసిన హెచ్-1బీ వీసాల్లో

the huge scam in the H-1B visa

2005–07 మధ్య చెన్నై అమెరికా కాన్సులేట్‌లో ఉద్యోగం చేసిన సిద్ధిఖీ, ఒక పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ కీలక అంశాలను వెల్లడించారు. అమెరికాలో సైన్స్, ఇంజనీరింగ్, టెక్నాలజీ రంగాల్లో నైపుణ్యం కలిగిన యువత కొరత ఉన్నప్పటికీ, భారతీయులకు జారీ చేసిన హెచ్-1బీ వీసాల్లో 80–90% నకిలీవని ఆమె పేర్కొన్నారు. తాను చెన్నైలో పనిచేసినప్పుడు పలు దరఖాస్తుల్లో నకిలీ డిగ్రీలు, తప్పుడు పత్రాలు ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. అయితే రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయామని తెలిపారు. కొందరు భారతీయ నేతలు ఈ ఒత్తిళ్లకు కారణమని కూడా ఆమె ఆరోపించారు.

హైదరాబాద్ నుండి వచ్చిన దరఖాస్తుల్లో అనేక అనుమానాస్పద అంశాలు

చెన్నై కాన్సులేట్ నుంచే 51 వేలకుపైగా నాన్-ఇమిగ్రంట్ వీసాలు జారీ చేశామని, అందులో చాలా వరకు హెచ్-1బీ వీసాలే ఉన్నాయని ఆమె వివరించారు. ముఖ్యంగా హైదరాబాద్(hyderabad) నుండి వచ్చిన దరఖాస్తుల్లో అనేక అనుమానాస్పద అంశాలు ఉన్నాయని చెప్పారు. భారత్‌లో అవినీతి, లంచం సాధారణమైపోయిన వ్యవహారమని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమెరికన్ అధికారులే ఇంటర్వ్యూలు నిర్వహిస్తే అభ్యర్థులు రాకపోవడం, కానీ భారతీయ అధికారులు ఉంటే లంచాలతో ఎంపికలు జరగడం జరుగుతుందని వెల్లడించారు.

ఈ ఆరోపణల మధ్య, అమెరికా మాజీ ప్రతినిధి మరియు ఆర్థిక నిపుణుడు డాక్టర్ డేవ్ బ్రాట్ కూడా ఇలాంటి అనుమానాలు వ్యక్తం చేశారు. ముఖ్యంగా చెన్నై నగరం నుంచే 2.2 లక్షల హెచ్-1బీ(H-1B Visa) వీసాలు జారీ కావడంపై ప్రశ్నలు లేవనెత్తారు. భారత్‌కు సంవత్సరానికి కేవలం 85 వేల హెచ్-1బీ వీసాల పరిమితి ఉన్నప్పటికీ, చెన్నై నుంచే ఆ పరిమితి కంటే 2.5 రెట్లు అధికంగా జారీ కావడం అనుమానాస్పదమన్నారు. భారతదేశం నుంచి 71% మంది హెచ్-1బీపై అమెరికాకు వస్తుండగా, చైనా నుంచి కేవలం 12% మాత్రమే ఉన్న విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. మొత్తం వ్యవహారంపై పారదర్శకత లోపిస్తున్నదంటూ తీవ్ర విమర్శలు చేశారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also :

Chennai consulate H1B fake degrees India H1B visa misuse Hyderabad visa applications Mahvash Siddiqui comments US immigration fraud

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.