📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News: Gaza-గాజా గాయం మానేదెన్నడు.. నేతల మనసు కరిగేదెన్నడు?

Author Icon By Pooja
Updated: September 17, 2025 • 3:29 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గాజా అదొక చిన్న దేశం. రెండేళ్ల క్రితం వీధుల్లో పిల్లలు కేరింతలు కొడుతూ ఆడుకునేవారు. మహిళలు ఇండ్లలో ఉంటూ ఆనందంగా ఇంటిపనులు చేసుకునేవారు. పురుషులు కుటుంబ పోషణలకు పనులు చేసేవారు. కానీ ఇప్పుడు ఇవన్నీ ఓ గతం. నేడు ఆకలి కేకలు, మరణభయాలు,(Fears of death) గాయాలు, పచ్చిపుండ్లు, పరిశుభ్రత లేని వీధులు, మంచనపడ్డ రోగులకు కొరత లేదు. ఆదుకునే నాథుడు లేడు. సాయం చేసే మనిషి లేడు. వీధుల్లో పిల్లల ఆటపాటలు లేవు. ఎక్కడ ఆహారం దొరికితే అక్కడికి పరుగులు, ఏడుపులు, కేకలు.

ఆ గుండెల నిండా గాయాలే. మమతలు, అనురాగాలు చూపేందుకు సత్తువ లేదు. ఏక్షణంలో ఏ బాంబు మీదపడుతుందో, ఎప్పుడేం ఉపద్రవం వస్తుందో తెలియని భయం గుప్పెట్లో రోజుల్ని వెళ్లదీస్తున్నారు. ప్రపంచ సాయం కోసం నిరీక్షించే కళ్లతో దినదినగడం, క్షణం ఓ భయానక చిత్రాలే అక్కడ కనిపిస్తున్నాయి. పట్టువదలని పాలకుల మూర్ఖత్వాలకు సామాన్యప్రజల బతుకు చిత్రం అవుతున్నది. ఇంకా ఇంకా ఎంతకాలం ఈ యుద్ధం, ఎప్పుడు తమ బతుకులు బాగుపడతాయనే ఆవేదన వారిది

భూతల దాడులు మొదలు పెట్టిన గాజా

గాజాను ఆక్రమించుకునే లక్ష్యంలో భాగంగా భూతల దాడులు మొదలుపట్టామని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. దీంతో వేలాది కుటుంబాలు గాజా నగరాన్ని వీడుతున్నాయి. ప్రమాదం ఉన్నా ఇంటిని వీడకూడదనే పట్టుదలతో ఉన్నాను. కానీ ఓ ఇజ్రాయెల్ అధికారి నుంచి ఫోన్ కాల్ వచ్చి ఖాళీ చేయమని ఆదేశించిన తరువాత బయటకు రావాల్సి వచ్చింది’ అని షేక్ రాడ్వాన్ ప్రాంతానికి చెందిన లీనా అల్-మగ్ బీ అనే మహిళ తన ఆవేదనను వ్యక్తం చేసింది. నిరాశ్రయురాలిగా మారిన తర్వాత టెంట్ వేయడానికి నా బంగారాన్ని అమ్ముకోవాల్సి వచ్చిందని చెప్పారు.

ఒక్కమార్గానికే ఇజ్రాయెల్ సైన్యం అనుమతి

ప్రజల తరలింపునకు ఇజ్రాయెల్ సైన్యం ‘అల్-రషీద్(Al-Rashid)’ కోస్తా రహదారిని మాత్రమే వినియోగించేందుకు అనుమతించింది. దీంతో ఈ మార్గంలో పెద్ద ఎత్తున రద్దీ ఏర్పడింది. కార్లు, ట్రక్కులు భారీగా బారుతు తీరాయి. వైమానిక దాడులు కొనసాగుతుండటంతో, తాత్కాలికంగా తలదాచుకోవడానికి ప్రయత్నిస్తున్న కుటుంబాలు మధ్యలోనే చిక్కుక్కుపోయినట్లు పలువురు తెలిపారు. యుద్ధం వల్ల అనేకులు ఆదాయాన్ని కోల్పోయారు.

Gazaదీంతో ముప్పు పొంచి ఉన్నా ఇళ్లలోనే ఉండిపోతున్నారు. ఇజ్రాయెల్ మూడుదిశల నుండి దాడులు కొనసాగిస్తోంది. భూమిపైన మీద బాంబులు పెట్టిన వాహనాలతో, తీవ్రమైన దాడులు, భారీ కాల్పులతో ఈ దాడులు ముమ్మరంగా సాగుతున్నాయని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. వీటికి తోడు నగరంలోని వివిధ ప్రాంతాల్లో హెలికాప్టర్లు ఎగురుతూ నిరంతరం కాల్పులు జరుపుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. తమ చావు ఎప్పుడో తెలియదని, ఈ పాణాలను కాపాడుకునేందుకు నిత్యం భయంతోను, ఆకలితోను అలమటిస్తున్నట్లు గాజా ప్రజలు వాపోతున్నారు.

గాజాలో ప్రస్తుత పరిస్థితి ఏమిటి?
గాజాలో యుద్ధం తీవ్రతరం అయింది. ప్రజలు ఆకలి, భయం, గాయాలు, పరిశుభ్రత లేని వాతావరణంలో జీవిస్తున్నారు. వేలాది కుటుంబాలు నిరాశ్రయులుగా మారి టెంట్లలో నివసిస్తున్నారు.

ఇజ్రాయెల్ సైన్యం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది?
ఇజ్రాయెల్ భూతల దాడులు ప్రారంభించింది. మూడుదిశల నుండి బాంబులు, కాల్పులు, వాహనాల దాడులు, హెలికాప్టర్ దాడులు కొనసాగిస్తున్నట్లు సమాచారం.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/khwaja-asif-pakistan-defense-ministers-sensational-comments-on-american-politicians/international/549025/

Gaza Gaza attacks Gaza crisis Gaza war Google News in Telugu israel Latest News in Telugu palestine

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.