ఇరాన్ అత్యున్నత నేత అయాతుల్లా అలీ ఖొమేనీ(Ayatollah Ali Khamenei) మరోసారి హిజాబ్ చట్టాన్ని గట్టిగా సమర్థించుకున్నారు. పశ్చిమ దేశాలు సహా అమెరికాలోని పెట్టుబడిదారీ విధానం మహిళల గౌరవాన్ని దెబ్బతీస్తోందని ఆయన తీవ్రంగా ఆరోపించారు. దేశంలో మహిళలు హిజాబ్ నిబంధనలను బహిరంగంగా ధిక్కరిస్తున్న తరుణంలో, ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ వేదికగా ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. పాశ్చాత్య దేశాల్లో మహిళలను ఒక వస్తువుగా చూస్తూ, వారి ఆత్మగౌరవాన్ని కాలరాస్తున్నారని ఖొమేనీ విమర్శించారు. “మహిళల భద్రత, గౌరవం, మర్యాదను కాపాడటమే వారి హక్కులలో ప్రధానమైనది. దుష్ట పెట్టుబడిదారీ తర్కం మహిళల గౌరవాన్ని నాశనం చేస్తోంది” అని ఆయన పేర్కొన్నారు. పశ్చిమ దేశాల్లో మహిళలు దోపిడీకి గురవుతున్నారని, సమాన పనికి పురుషుల కన్నా తక్కువ వేతనం పొందుతున్నారని ఆరోపించారు.
Read Also: Donald Trump: క్యాబినెట్ మీటింగ్‌లో నిద్రమత్తులో ట్రంప్.. వీడియో వైరల్
క్షీణిస్తున్న కుటుంబ సంబంధాలు
అమెరికా సంస్కృతిపై విరుచుకుపడిన ఖొమేనీ, అక్కడ కుటుంబ వ్యవస్థ పూర్తిగా నాశనమైందని అన్నారు. “తండ్రిలేని పిల్లలు, క్షీణిస్తున్న కుటుంబ సంబంధాలు, యువతులపై ముఠాల దాడులు, స్వేచ్ఛ పేరుతో పెరిగిపోతున్న లైంగిక విశృంఖలత్వం.. ఇదీ పశ్చిమ దేశాల్లో కుటుంబాల పరిస్థితి” అని ఆయన వ్యాఖ్యానించారు. ఇస్లాంలో మహిళలకు స్వాతంత్ర్యం, గుర్తింపు, అభివృద్ధి చెందే అవకాశం ఉన్నాయని ఆయన వివరించారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: