West Asia War: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ప్రారంభమైన పోరు ఇప్పుడు పశ్చిమాసియాలోని ఇతర దేశాలకు వేగంగా విస్తరిస్తోంది. కేవలం రెండు దేశాలకే పరిమితం కాకుండా, గల్ఫ్ దేశాలు మధ్య ప్రాంత దేశాలపై కూడా దాడులు జరుగుతుండటంతో అంతర్జాతీయ సమాజం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. గురువారం ఖతార్, యూఏఈలలో జరిగిన దాడులు ఈ యుద్ధ తీవ్రతను చాటిచెబుతున్నాయి.
Read Also: Alaska: అలాస్కా సమీపంలో రష్యన్ సైనిక విమానాలను గుర్తించిన అమెరికా, కెనడా
ఖతార్‌లో పేలుళ్లు.. అబుధాబీలో డ్రోన్ విలయం
గురువారం ఖతార్ రాజధాని దోహాలో పలుచోట్ల శక్తివంతమైన పేలుళ్లు సంభవించాయి. మరోవైపు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుధాబీపై ఇరాన్ డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ డ్రోన్ దాడుల కారణంగా ఆరుగురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఇజ్రాయెల్‌కు మద్దతు ఇస్తున్న లేదా అమెరికా స్థావరాలు ఉన్న దేశాలను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంటోందని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇరాన్ దాడులను ఎదుర్కొంటున్న సైప్రస్, గల్ఫ్ దేశాలకు సహాయం చేయడానికి ఇటలీ ముందుకు వచ్చింది. ఇటలీ నేవీ సిబ్బందిని సైప్రస్‌కు పంపుతుందని, గల్ఫ్ దేశాలకు యాంటీ మిసైల్, యాంటీ డ్రోన్ రక్షణ వ్యవస్థలను అందిస్తుందని తెలిపింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: