📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు

Telugu News: H-1B Visa-హెచ్-1బి వీసా ఫీజు పెంపుతో పెళ్లిళ్లు రద్దు

Author Icon By Pooja
Updated: September 22, 2025 • 1:25 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ సర్కారు హెచ్-1బి వీసా ఫీజు లక్షడాలర్లకు పెంచడంతో భారతీయ వీసాదారులకు పెద్ద కష్టమే వచ్చిపడింది. దీపావళి, సంవత్సరం ముగింపు సెలవుల సీజన్ కొద్దిరోజుల ముందు వచ్చిన ఈ ప్రకటన.. ఆయా కుటుంబాల ప్రణాళికలపై తీవ్ర ప్రభావమే చూపిస్తున్నది. అనేకులు చివరి నిమిషంలో విమాన టిక్కెట్లు(Flight tickets) రద్దు చేసుకుంటున్నారు. అంతేకాక కొందరు తమ పెళ్ళిళ్ల పర్యటనలను కూడా రద్దు చేసుకుంటున్నారు.

కొత్త వీసాదారులకు ఈ నియమాలు వర్తిస్తాయి

ట్రంప్ ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం.. ఈ కొత్త నియమాలు కొత్త వీసా దరఖాస్తుదారులకు మాత్రమే వర్తిస్తాయి. ఇప్పటికే హోల్డర్ గా ఉన్నవారు లక్ష డాలర్లు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే సమాచార లోపం, ఆఫీసియల్ స్పష్టత లేకపోవడం వల్ల భారతీయ హెచ్-1బి హొల్డర్లు విదేశాలలో చిక్కుకుపోతారా అనే భయాందోళనలు నెలకొన్నాయి. ఏం చేయాలో తెలియక చివరి నిమిషంలో విమానా ప్రయాణాలను రద్దు చేసుకున్నామని పలువురు మీడియాలో వాపోయారు.

దీపావళికి వచ్చేందుకు ప్రణాళికలు

అనేకులు దీపావళి కోసం భారతదేశానికి వెళ్లే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. డిసెంబరు సెలవుల్లో కుటుంబంతో కలిసి ఉండాలని సౌకర్యంగా టిక్కెట్లు ముందుగానే బుక్ చేసుకున్నారు. అయితే ట్రంప్ ప్రకటన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈ సంవత్సరం ప్రయాణం చేయాలంటే అందరికి ‘ఓ మై గాడ్’ అని అనిపిస్తోందని పలువురు వాపోతున్నారు. ఈ చర్యను కొందరు ప్రయాణ నిషేధంగా పేర్కొన్నారు. హెచ్-1బి వీసా చెల్లుబాటు అయినప్పటికీ, సరైన ఫీజు రుజువులు లేకపోతే అమెరికా ప్రవేశం సాధ్యం కాదు. పూర్తి విధానం ఏమిటి అనే అంశాల్లో స్పష్టత లేకపోవడం భయాందోళనను మరింతగా పెంచింది.

కొన్ని ప్రధాన టెక్ కంపెనీలు(Tech companies) కూడా అంతర్గత మెమోలో ముందే దేశం విడిచి వెళ్లవద్దు, ఇప్పటటికే అమెరికా వెలుపల ఉన్నవారు తిరిగి రాకూడదని ఉద్యోగులను హెచ్చరించాయి. పెళ్లి తేదీలు మార్పు, కొన్ని పెళ్లిళ్లు రద్దు హెచ్-1బిపై సందిగ్ధత కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికాలో ఉద్యోగం చేస్తున్న వారి భవిష్యత్తు ప్రణాళికలపై తీవ్ర సందిగ్ధత నెలకొంది.

ఇప్పటికే పెళ్లిళ్ల తేదీలను ఫిక్స్ చేసుకున్నవారి పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఇండియాకు రాలేని పరిస్థితిలో కొందరు అయితే, వేచి ఉండలేక, పెళ్లిని రద్దు చేసుకుంటున్నవారు ఉన్నారు. అమెరికా కామర్స్ సెక్రటరీ హోవార్డ్ లుట్నిక్ ‘ఐటీ కంపెనీలు అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలి. పనికిరాని వ్యక్తులను అమెరికాలోకి రాకుండా ఆపాలి. కేవలం అత్యుత్తమ, విలువైన వ్యక్తులు మాత్రం అమెరికాకు రావాలి’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

H-1B వీసా ఫీజు పెంపు కారణంగా పెళ్లిళ్లు రద్దవుతున్నాయి ఎందుకు?
అమెరికా ప్రభుత్వం హెచ్-1బి వీసా కోసం ఫీజులను పెంచడంతో, అమెరికాలో ఉద్యోగం పొందే అవకాశం ఉన్న యువతులు వ్యక్తిగత ఖర్చులు పెరగడంతో పెళ్లిళ్లను రద్దు చేస్తున్నారనేది ప్రధాన కారణం.

ఫీజు పెంపు ఎంత మేరకు ఉంది?
ఫీజు మొత్తం కొన్ని లక్షల రూపాయల సమానంగా పెరుగుతుందని తాజా వివరాలు ఉన్నాయి. (ప్రస్తుత రేట్లు దేశాధారితంగా మారవచ్చు)

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/protests-for-rdt-protection-from-the-23rd/andhra-pradesh/551809/

Breaking News in Telugu Google News in Telugu H-1B Visa Indian students Latest News in Telugu Marriage Postponement USA Visa Fee Hike

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.