📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Ali Khamenei: ఇజ్రాయెల్‌పై మేమే గెలిచాం: ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ

Author Icon By Shobha Rani
Updated: June 26, 2025 • 5:31 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇజ్రాయెల్‌పై ఇరాన్ (Israel Iran) ‘విజయం’ సాధించిందని, అమెరికాను కూడా చావుదెబ్బ తీశామని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్‌ను నేరుగా ప్రస్తావించకుండా, “మోసపూరిత జియోనిస్ట్ పాలన” అంటూ సంబోధించారు. ఈ మేరకు ఆయన అధికారిక ‘ఎక్స్’ ఖాతా ద్వారా స్పందించారు.
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ధీటైన ప్రకటన
“ఎంత గందరగోళం సృష్టించినా, ఎన్ని ప్రకటనలు చేసినా, జియోనిస్ట్ పాలన ఆచరణాత్మకంగా ఇస్లామిక్ రిపబ్లిక్ దెబ్బలకు చిత్తయి, నలిగిపోయింది” అని ఖమేనీ (Ali Khamenei) ఒక పోస్టులో పేర్కొన్నారు. దేశ ప్రజలకు ఈ ‘విజయం’ పట్ల అభినందనలు అంటూ పోస్టు చేశారు.
ఇజ్రాయెల్‌పై ఘాటు వ్యాఖ్యలు
ఆ వెంటనే అమెరికా(America)ను లక్ష్యంగా చేసుకుని మరో పోస్ట్ చేశారు. “మన ప్రియమైన ఇరాన్ అమెరికా ప్రభుత్వంపై సాధించిన విజయానికి నా అభినందనలు. జియోనిస్ట్ పాలన పూర్తిగా నాశనమవుతుందని భావించిన అమెరికా ప్రభుత్వం, దానిని కాపాడేందుకే నేరుగా యుద్ధంలోకి దిగింది. కానీ ఏమీ సాధించలేకపోయింది” అని ఖమేనీ (Ali Khamenei)అన్నారు.
అమెరికాపై నేరుగా విమర్శలు
గల్ఫ్‌లో మోహరించిన అమెరికా దళాలపై ఇరాన్ (Iran) ప్రతీకార దాడిని కూడా ఖమేనీ ప్రస్తావించారు. “ఇస్లామిక్ రిపబ్లిక్ అమెరికా చెంప చెళ్లుమనిపించింది. ఈ ప్రాంతంలోని కీలకమైన అమెరికా స్థావరాల్లో ఒకటైన అల్-ఉదీద్ (Al udeid) వైమానిక స్థావరంపై దాడి చేసి నష్టం కలిగించింది” అని ఆయన తెలిపారు.
భవిష్యత్‌ హెచ్చరిక – “భారీ మూల్యం చెల్లించుకోవాలి”
ఈ ప్రాంతంలోని అమెరికా ఆస్తులపై ఇరాన్ ఎప్పుడైనా దాడి చేయగల సత్తా కలిగి ఉందని ఖమేనీ (Ali Khamenei) మరో పోస్టులో హెచ్చరించారు. “ఈ ప్రాంతంలోని కీలకమైన అమెరికా కేంద్రాలను ఇస్లామిక్ రిపబ్లిక్ చేరుకోగలగడం,

Ali Khamenei: ఇజ్రాయెల్‌పై మేమే గెలిచాం: ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ

అవసరమని భావించినప్పుడల్లా చర్యలు తీసుకోగలగడం ఒక ముఖ్యమైన విషయం. భవిష్యత్తులో కూడా ఇలాంటి చర్య పునరావృతం కావచ్చు. ఏదైనా దురాక్రమణ జరిగితే, శత్రువు కచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకోవలసి ఉంటుంది” అని ఆయన స్పష్టం చేశారు.
రాజకీయ, రాష్ట్రీయ ప్రేరణలతో కూడిన ప్రసంగం
ఖమేనీ వ్యాఖ్యలు మున్ముందు పశ్చిమ ఆసియా (మిడిల్ ఈస్ట్)లో గణనీయమైన దౌత్య, రక్షణ ప్రభావాలను కలిగించొచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
అలాగే అమెరికా-ఇరాన్ సంబంధాలు మరింత క్షీణించవచ్చని అంచనా.

Read Also: Trump: ట్రంప్ నిర్ణయాలతో డాలర్ విలువ పతనం

#AliKhamenei #telugu News Breaking News in Telugu Google news Google News in Telugu iran's supreme leader khamenei IranVictory IsraelConflict Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news We won against Israel: ZionistRegime

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.