📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest News: Nvidia CEO: విదేశీ ఉద్యోగులకు హెచ్1బీ వీసా స్పాన్సర్ చేస్తాం: ఎన్విడియా సీఈఓ

Author Icon By Aanusha
Updated: October 8, 2025 • 6:02 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కొన్ని నెలలుగా తన వాదనలో “మొత్తం ఉద్యోగాలు అమెరికన్లకే ఉండాలి” అనే విధంగా చెప్పడం తెలిసిన విషయం. ఈ విధానం ప్రకారం, విదేశీయులపై కఠినమైన నియమాలు అమలుపర్చే ప్రయత్నం కొనసాగుతోంది. తాజాగా, అమెరికా H-1B వీసా (H-1B Visa) విధానంలో ఒక పెద్ద మార్పు చేసింది. నిపుణుల H-1B వీసాకు సంబంధించి వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచినట్లు ప్రకటించారు.

Militants: మిలిటెంట్లు దాడిలో 11 మంది షాక్ సైనికులు మృతి

విదేశీయులను ఉద్యోగాల్లోకి తీసుకోవాలనుకుంటే.. కంపెనీలు ఈ ఫీజు చెల్లించి వీసాలు స్పాన్సర్ చేయాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం వల్ల భారతీయులపై ఎక్కువగా ప్రభావం పడింది. హె1బీ నిపుణుల వల్ల ఎక్కువ ప్రయోజనం పొందుతున్న టెక్ కంపెనీలు కూడా ట్రంప్ నిర్ణయాన్ని సమర్థించాయి.

టెగ్ దిగ్గజం ఎన్విడియా సీఈఓ జెన్సన్‌ హువాంగ్‌ (Nvidia CEO Jensen Huang) అందులో ఒకరు. అయినప్పటికీ హెచ్1బీ ఫీజుల విషయంలో వెనకడుగు వేయమని చెప్పారు. విదేశీ నిపుణులకు వీసాలు స్పాన్సర్ చేయడం కొనసాగిస్తామన్నారు. ఈ మేరకు ఉద్యోగులకు ఈమెయిల్ పంపారు.

విదేశీ నిపుణులే లేకపోతే ఈ విజయం సాధ్యమయ్యేది కాదు

తమ కంపెనీలో చాలామంది విదేశీ నిపుణులు పనిచేస్తున్నట్లు ఎన్విడియా సీఈఓ తెలిపారు. అందులో తాను ఒకడినని చెప్పారు. “అమెరికాలో మనకు దొరికిన అవకాశాలు మన జీవితాలను మార్చేశాయని నేను నమ్ముతున్నాను. ప్రపంచంలోని నలు మూలల నుంచి అమెరికాకు వలస వచ్చిన ప్రతిభావంతులే ఎన్విడియా (Nvidia) ను కూడా తీర్చిదిద్దారు.

Nvidia CEO

ఆ విదేశీ నిపుణులే లేకపోతే ఈ విజయం సాధ్యమయ్యేది కాదు. టెక్నాలజీ రంగంలో అమెరికా అగ్రగామిగా కొనసాగడానికి చట్టబద్ధమైన వలసలు అవసరమే. అందుకోసమే హెచ్1బీ వీసా ఫీజు పెంపుతో ఆగకుండా.. ప్రపంచ నలుమూలల నుంచి ట్యాలెంట్‌ను తీసుకుంటాం ” అని జెన్సన్‌ ఈ మెయిల్‌ ( E – Mail) లో రాసుకొచ్చారు.డొనాల్డ్ ట్రంప్ హెచ్1బీ వీసా ఫీజును పెంచడాన్ని జెన్సన్ హువాంగ్ గతంలో సపోర్ట్ చేశారు.

ఇలా చేయడం తనకు ఆనందంగా ఉందన్నారు

ఇలా చేయడం తనకు ఆనందంగా ఉందన్నారు. లక్షల డాలర్లు ఎక్కువే అయినా.. ఇది గొప్ప ప్రారంభమని చెప్పారు. అయితే స్టార్టప్‌ (Startup) లు ఈ మొత్తాన్ని భరించలేవని తెలిపారు.ఎన్విడియా కంపెనీ పెద్ద మొత్తంలో హెచ్1బీ వీసాదారులను నియమించుకుంటోంది.

ప్రపంచంలోని ఏఐ రీసెర్చర్లలో సగం మంది చైనీయులే అని కంపెనీ గతంలో ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ నేపథ్యంలో హెచ్1బీ వీసాలను స్పాన్సర్ చేయడం తప్ప ఎన్విడియాకు మరో మార్గం లేకుండా పోయింది.

హెచ్1బీ వీసా ఫీజు పెంపును యూనియన్లు

ఈ కెంపెనీ సీఈఓ ప్రకటన కూడా అందులో భాగమే అని విశ్లేషకులు అంటున్నారు.ట్రంప్ తీసుకువచ్చిన హెచ్1బీ వీసా ఫీజు పెంపును యూనియన్లు, విద్యా సంస్థలు, మతపరమైన సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

గత నెల ఇలాంటి ఓ సంస్థ.. ఫీజు పెంపును సమర్థించుకోలేని, చట్టవ్యతిరేక చర్యగా అభివర్ణించింది. అమెరికా కాంగ్రెస్ రూపొందించిన పథకాన్ని ఏకపక్షంగా ట్రంప్ యంత్రాంగం మార్చలేదని కోర్టు మెట్లు ఎక్కింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Donald Trump H1B visa latest news Nvidia CEO Jensen Huang Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.