📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

RUSSIA UKRAINE: ఉక్రెయిన్​తో చర్చలు జరుపుతాం – పుతిన్

Author Icon By Shobha Rani
Updated: May 12, 2025 • 11:41 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రష్యాతో పూర్తిస్థాయి, బేషరతు కాల్పుల విరమణకు సిద్ధంగా ఉన్నామని ఉక్రెయిన్ ప్రకటించిన నేపథ్యంలో మాస్కో నుంచి మరో ప్రతిపాదన వచ్చింది. ఉక్రెయిన్‌తో మూడేళ్లకు పైగా కొనసాగుతున్న యుద్ధానికి తెర దించడానికి కీవ్‌తో ప్రత్యక్ష చర్చలకు తాము సిద్ధంగా ఉన్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (vladimir putin) ప్రకటించారు. ఎలాంటి ముందస్తు షరతులు లేకుండా ఉక్రెయిన్‌తో ప్రత్యక్ష చర్చలకు సిద్ధమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (vladimir putin) తెలిపారు. మే ఈ చర్చలు రెండు దేశాల్లో శాశ్వత శాంతిని నెలకొల్పేలా ఉండాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఇస్తాంబుల్‌ వేదికగా ఇరుదేశాల చర్చలకు ఆయన ప్రతిపాదించారు.

RUSSIA UKRAINE: ఉక్రెయిన్​తో చర్చలు జరుపుతాం – పుతిన్

ప్రత్యక్ష చర్చలకు సిద్ధమంటూ స్పష్టీకరణ
అంతకుముందు, గురువారం ఇస్తాంబుల్‌ వేదికగా చర్చలు జరపాలని ఉక్రెయిన్‌ అధికారులను పుతిన్‌ కోరారు. ఈ విషయంపై తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్‌తో మాట్లాడతానని చెప్పారు. ఈ చర్చల ద్వారా పూర్తిస్థాయి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు చెప్పారు. ఇప్పటికే తాము మానవతా దృక్పథంతో కీవ్​కు చెందిన ఇంధన వనరులపై దాడులను ఆపేశామని, ఈస్టర్ కాల్పుల విరమణ, విక్టరీ డే కాల్పుల విరమణ కూడా ప్రకటించామని చెప్పారు. అయినప్పటికీ ఆ సమయాల్లో ఉక్రెయిన్‌ ఈ ఒప్పందాలను ఉల్లంఘించి 524 వైమానిక డ్రోన్‌లు, 45 సముద్ర డ్రోన్‌లు, అనేక పాశ్చాత్య క్షిపణులతో రష్యాపై దాడి చేసిందని ఆరోపణలు చేశారు. తమ సైన్యం ఉక్రెయిన్ దాడులను తిప్పి కొట్టిందని వెల్లడించారు. ప్రస్తుతం ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు దిశగా కొన్ని ముఖ్య సంకేతాలు కనిపిస్తున్నాయి. పుతిన్ వ్యాఖ్యలు, ఉక్రెయిన్ ప్రతిపాదనలు, యూరోపియన్ దేశాల మద్దతుతో శాంతి చర్చలు మొదలయ్యే అవకాశం ఉంది. అయితే, ఈ చర్చలు నిజంగా ఎలాంటి శాశ్వత పరిష్కారానికి దారితీస్తాయా? లేక ఇది మరో తాత్కాలిక ప్రతిపాదనగానే మిగులుతుందా అన్నది సమయం చెప్పాలి.
ఈస్టర్, విక్టరీ డే కాల్పుల విరమణలు
ఇదిలా ఉండగా, శనివారం కీవ్‌లో పర్యటించిన ఫ్రాన్స్‌, యుూకే, జర్మనీ, పోలాండ్ నేతలు చేసిన సూచనతో 30 రోజుల బేషరతు కాల్పుల విరమణ పాటిస్తామని ఉక్రెయిన్‌ ప్రకటన చేసింది. సోమవారం నుంచే అమల్లోకి తేవాలని రష్యాను కోరింది. రష్యా ఇప్పటికే ఈస్టర్, విక్టరీ డే సందర్భాలలో కాల్పుల విరమణలు ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు.

Read Also: TRUMP: ‘కశ్మీర్‌ సమస్య పరిష్కరిస్తా’- ట్రంప్ కొత్త ప్రకటన

Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news We will negotiate with Ukraine - Putin

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.