📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Israel PM On Gaza: గాజా మొత్తం స్వాధీనం చేసుకుంటాం – నెతన్యాహు ప్రకటన

Author Icon By Shobha Rani
Updated: May 20, 2025 • 2:26 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గాజా మొత్తాన్ని ఆక్రమిస్తామంటూ ఇజ్రాయెల్ చేసిన వ్యాఖ్యలపై యూకే, ప్రాన్స్, కెనడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ మేరకు ఈ దేశాలు ఓ ప్రకటనను విడుదల చేశాయి. మరోవైపు దీనిని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు(Netanyahu) తీవ్రంగా ఖండించారు. 2023 అక్టోబరు 7న జరిగిన ఘటనను పట్టించుకోకుండా, ఇప్పుడు దాడులు చేసేలా ప్రోత్సాహిస్తున్నారని ఆరోపించారు. ఇజ్రాయెల్ హమాస్​పై పూర్తి విజయం సాధిచండమే లక్ష్యంగా ఉన్నట్లు మరోసారి నెతన్యాహు (Netanyahu) స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ న్యాయబద్ధమైన మార్గాల్లో తనను తాను రక్షించుకుంటూ పూర్తి విజయాన్ని సాధించే వరకు పోరాడుతూనే ఉంటుందని చెప్పారు. ‘హమాస్ ఉగ్రవాదులను పూర్తిగా నిర్మూలించకముందే రక్షణ యుద్ధాన్ని ఆపాలని చెబుతున్నారు. అంతేకాకుండా పాలస్తీనా ఇచ్చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అక్టోబర్ 7న ఇజ్రాయెల్​పై జరిగిన దాడులపై వారు స్పందించలేదు. ఇప్పుడు మా రక్షణ కోసం దాడులు చేస్తుంటంటే స్పందిస్తున్నాయి. ఇది భవిష్యత్తులో మరిన్ని దాడులకు ఆహ్వానం పలకడమే అవుతుంది. యుద్ధం ముగించే విషయంలో ట్రంప్ ప్రతిపాదించిన విధానాన్ని ఇజ్రాయెల్ అంగీకరిస్తోంది. యూరోపియన్ నాయకులు కూడా అదే దిశగా ముందుకు సాగాలని పిలుపునిస్తున్నారు అని నెతన్యాహు పేర్కొన్నారు.

Israel PM On Gaza: గాజా మొత్తం స్వాధీనం చేసుకుంటాం – నెతన్యాహు ప్రకటన

గిడియన్ చారియట్స్ ఆపరేషన్ – ఇజ్రాయెల్ సైనిక చర్యలు
గిడియన్ చారియట్స్ పేరుతో గాజా వ్యాప్తంగా ఇజ్రాయెల్ సైన్యం భూతల దాడులు చేయడాన్ని ఖండిస్తూ యూకే, ప్రాన్స్, కెనడా సంయుక్తంగా ఓ ప్రకటను విడుదల చేశాయి. ఈ దాడి వల్ల గాజాలో తీవ్రమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పాయి. మానవతా సాయం అందకుండా ఇజ్రాయెల్ ఆంక్షలు విధించడాన్ని ఎత్తివేయాలని సూచించాయి. ఇజ్రాయెల్ ఇదే విధంగా కొనసాగితే కచ్చితంగా ప్రతిస్పందన ఉంటుందని స్పష్టం చేశాయి. గాజాలో తక్షణ కాల్పుల విరమణ కోసం అమెరికా, ఖతార్, ఈజిప్ట్‌లు చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు పలికాయి.హమాస్ ను పూర్తిగా నిర్మూలించడం ప్రధాన లక్ష్యం.మిలిటరీ సమర్థత, ఉగ్ర మూలాలను తొలగించడం ద్వారా స్థిరమైన భద్రత సాధించాలన్నది ఉద్దేశం.
నెతన్యాహు ప్రతిస్పందన – అభ్యంతరాలకు గట్టి కౌంటర్
గాజా మొత్తాన్ని తమ నియంత్రణలోకి తీసుకుంటామని గిడియన్ చారియట్స్ పేరుతో చేసిన దాడుల సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు (Netanyahu) ప్రకటించారు. తమ పోరాటం తీవ్రస్థాయిలో ఉందని పురోగతి సాధిస్తున్నామని తెలిపారు. గాజా మొత్తాన్ని నియంత్రణలోకి తీసుకుంటామని ఇందులో వెనక్కి తగ్గేదేలేదని తేల్చిచెప్పారు. మరోవైపు గాజాలోకి పరిమిత మానవతా సాయం ప్రవేశించేందుకు నెతన్యాహు అనుమతించారు. ఫలితంగా దాదాపు మూడు నెలల తర్వాత మానవతా సాయం గాజాలోకి ప్రవేశించింది. పసిపిల్లలతో పాటు ఇతరులకు కావాల్సిన ఆహారంతో కూడిన ఐదు ట్రక్కులు కేరం షాలోమ్ సరిహద్దు గుండా గాజాలోకి ప్రవేశించాయి. అక్టోబర్ 7న హమాస్ చేసిన దాడుల్ని పట్టించుకోకుండా, ఇప్పుడు మమ్మల్ని విమర్శిస్తున్నారు అని విదేశీ దేశాలపై నెతన్యాహు (Netanyahu) విమర్శ. రక్షణ యుద్ధం ముగించమని, పాలస్తీనా ఇస్తే బాగుంటుందని సూచిస్తున్నారు – ఇది భవిష్యత్తులో మరిన్ని దాడులకు ఆహ్వానం పలకడమే అని వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్ – గాజా యుద్ధం మరింత తీవ్రమవుతుండగా, ఇజ్రాయెల్ ఆక్రమణ లక్ష్యం అంతర్జాతీయ దౌత్యరంగంలో బహుళ విమర్శలకు కారణమవుతోంది. అంతర్జాతీయ సమాజం మానవతా కోణాన్ని నెరిపించాలంటూ గట్టిగా వినిపిస్తుండగా, ఇజ్రాయెల్ మాత్రం భద్రతా కోణాన్ని ప్రధానంగా ఉంచి ముందుకు సాగుతోంది.

Read Also: Sofia qureshi : సోఫియా ఖురేషిపై అనుచిత వ్యాఖ్యలు..SIT ఏర్పాటు

#telugu News Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Netanyahu's statement Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news We will capture all of Gaza

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.