📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Washington Sundar: బెన్ స్టోక్స్ అతివిశ్వాసంతోనే ఇంగ్లండ్ ఓడిందన్న సుందర్

Author Icon By Anusha
Updated: August 14, 2025 • 12:08 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇటీవల మాంచెస్టర్ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో చోటుచేసుకున్న ఒక సంఘటన ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇంగ్లండ్ టెస్ట్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ ప్రవర్తనపై టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ చేసిన వ్యాఖ్యలు క్రికెట్ అభిమానుల్లో విస్తృత చర్చకు దారితీశాయి. సుందర్ ప్రకారం, స్టోక్స్ ఓవరాక్షన్, ఒత్తిడి కారణంగానే ఆఖరి టెస్ట్‌లో ఇంగ్లండ్ విజయాన్ని సాధించిందని అన్నారు.మాంచెస్టర్‌లో జరిగిన నాలుగో టెస్ట్ చివరి రోజు పరిస్థితులు డ్రాకే అనుకూలంగా ఉన్నప్పటికీ, ఇంగ్లండ్ జట్టు భిన్నమైన వ్యూహాన్ని అనుసరించింది. ఆ సమయంలో సుందర్, జడేజా ఇద్దరూ తమ శతకాలకు దగ్గరగా ఉన్నారు. కానీ ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్, ఆటను ముగించాలని, డ్రాకు అంగీకరించాలని పదేపదే ఒత్తిడి చేశాడని సుందర్ వెల్లడించాడు. స్టోక్స్ (Ben Stokes) మైదానంలో పదేపదే వచ్చి, “మనం షేక్ హ్యాండ్ చేసేద్దాం” అని అడిగాడట. దీనికి భారత ఆటగాళ్లు స్పష్టంగా నిరాకరించారు.

మ్యాచ్ ముగిసిన తర్వాత జరిగిన మరో ఘటన

ఈ నిరాకరణకు స్టోక్స్ ప్రతిస్పందన అంత మంచిది కాలేదని సుందర్ తెలిపారు. హ్యారీ బ్రూక్, బెన్ డకెట్ బౌలింగ్‌లో మీరు సెంచరీలు చేయగలరా? అని వ్యంగ్యంగా ప్రశ్నిస్తూ హేళన చేశాడు. ఇలాంటి వ్యాఖ్యలు, ఆటగాళ్లలో అసహనాన్ని రేకెత్తించేలా ఉన్నాయని సుందర్ అభిప్రాయపడ్డాడు. అయినప్పటికీ, భారత జట్టు తమ లక్ష్యాన్ని కొనసాగించింది. చివరికి సుందర్, జడేజా ఇద్దరూ తమ తమ శతకాలు పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత మాత్రమే టీమిండియా (Team India) డ్రాకు అంగీకరించింది.ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత జరిగిన మరో ఘటన కూడా వివాదాస్పదమైంది. సాధారణంగా టెస్ట్ మ్యాచ్‌లు ముగిసిన వెంటనే ఇరు జట్లు పరస్పరం చేతులు కలుపుతూ స్నేహభావాన్ని ప్రదర్శించడం ఆనవాయితీ. కానీ ఈసారి బెన్ స్టోక్స్ మాత్రం భారత ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా వెళ్లిపోయాడు. ఈ చర్యను అభిమానులు, మాజీ క్రికెటర్లు తీవ్రంగా విమర్శించారు. క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా, అసహనానికి సంకేతంగా ఈ ప్రవర్తనను అభివర్ణించారు.

Washington Sundar

ఆఖరి టెస్ట్ గెలిచేలా మమ్మల్ని మోటివేట్

అయితే బెన్ స్టోక్స్ ప్రవర్తన తమను మరింత రెచ్చగొట్టిందని, ఆఖరి మ్యాచ్‌లో గెలవాలనే కసిని రగిల్చిందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వాషింగ్టన్ సుందర్ తెలిపాడు. ‘ 100 శాతం ఆ హ్యాండ్ షేక్ వివాదం ఆఖరి టెస్ట్ గెలిచేలా మమ్మల్ని మోటివేట్ చేసింది. మా జట్టులో ఏ ఆటగాడిని అడిగినా ఇదే విషయం చెబుతారు. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్‌ (Test cricket) లో ఎవరైనా సవాళ్లను ఎదుర్కోవాలని కోరుకుంటారు. ఎందుకంటే ప్రతీరోజు మీరు ఆశించేది అదే. పరిస్థితి కఠినంగా మారినప్పుడు.. ఆ సవాల్‌ను అధిగమించాలంటే మానసికంగా చాలా దృఢంగా ఉండాలి.

భారీ ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది

అని సుందర్ చెప్పుకొచ్చాడు.ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌ను టీమిండియా 2-2తో సమం చేసుకున్న విషయం తెలిసిందే. తొలి టెస్ట్‌లో ఓడిన భారత్ రెండో మ్యాచ్‌లో గెలిచింది. మూడో టెస్ట్‌లో ఓడి.. నాలుగో టెస్ట్‌ను డ్రా చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 669 పరుగులు చేసి 311 పరుగుల భారీ ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది. భారీ లోటుతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్.. సుందర్, జడేజా అసాధారణ శతకాలతో డ్రాతో గట్టెక్కింది. ఓవల్ వేదికగా హోరాహోరీగా సాగిన ఆఖరి టెస్ట్‌లో టీమిండియా 6 పరుగుల తేడాతో గెలుపొందింది. సిరాజ్ అద్భుత ప్రదర్శనతో టీమిండియా ఈ విజయాన్నందుకుంది.

వాషింగ్టన్ సుందర్ అంతర్జాతీయ క్రికెట్‌లో ఎప్పుడు అరంగేట్రం చేశాడు?

వాషింగ్టన్ సుందర్ 2017 డిసెంబరులో శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్‌లో భారత జట్టుకు ప్రథమ మ్యాచ్ ఆడాడు.

వాషింగ్టన్ సుందర్ ప్రత్యేకత ఏమిటి?

బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ సమర్థుడైన ఆల్‌రౌండర్‌గా వాషింగ్టన్ సుందర్ ప్రసిద్ధి చెందాడు. పవర్‌ప్లే ఓవర్లలో కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంలో నైపుణ్యం కలవాడు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/harbhajan-fires-at-bcci/sports/529987/

Ben Stokes handshake controversy Breaking News England captain Ben Stokes overaction India vs England Test series latest news Manchester Test Draw Washington Sundar statement

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.