📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Warren Buffett: షోఆఫ్ వద్దు.. అవసరాలకే పరిమితం..బఫెట్

Author Icon By Sharanya
Updated: July 19, 2025 • 1:08 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వారెన్ బఫెట్ (Warren Buffett) గురించి పరిచయం అక్కర్లేదు. డబ్బు ఎలా సంపాదించాలి అనేది కాదు, ఎలా ఖర్చుపెట్టాలి, సంపాదించిన డబ్బుతో మరింత ధనవంతులుగా ఎలా కాగలరో ఇలా ఒక్కటేమిటీ ఆర్థిక సలహాలు అంటే బఫెట్ నుంచే నేర్చుకోవాలి. ఆర్థిక సలహా పితామహుడిగా (Grandmaster of Financial Advice) కూడా ఈయనను ముద్దుగా పిలుస్తూ కొనియాడుతుంటారు. పొదుపు, మదుపు గురించి ఆయన చెప్పిన సూత్రాలు ఆచరణీయం. మదుపుపై 5 సూత్రాలు చెప్పారు. అవి ఏమిటో గమనిద్దాం.


కారు అవసరమే కాని తప్పనిసరికాదు


కొందరికి కారు అవసరం అయితే మరికొందరికి కాదు వాడడం తమ హోదాకు చిహ్నంగా భావిస్తారు. చాలామంది తమవద్ద తగినంత డబ్బు లేకపోయినా ఈఎంఐ ద్వారా కారు కొనుగోలు చేస్తుంటారు. ఇది సరైంది కాదని బఫెట్ (Warren Buffett) అభిప్రాయం. మనం పెట్టుబడులు ఎప్పుడూ వస్తువు విలువ (Investments always increase the value) పెంచేలా ఉండాలని అంటారు.


లాటరీ ఊబిలాంటిది


లాటరీ.. ఆన్లైన్ గేమ్లతో అనేకులు తమ జీవితాలను పాడుచేసుకుంటున్నారు. కొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. అయితే అదృష్టం ఆధారంగా నడిచే ఇలాంటి వాటి జోలికి అసలు వెళ్లవద్దని బఫెట్ సలహా. ప్రత్యేకంగా యువత ఈ మాయలో నుంచి బయటికి రావాలని కోరుతున్నారు. లక్ అనేది లక్షలో ఒకరికి మాత్రమే వస్తుందని, ఆ చట్రంలో ఇరుక్కుంటే పోగొట్టుకోవడం తప్ప వచ్చేది ఉండదని బఫెట్ ఉద్దేశం.


తెలియని పథకాల్లో పెట్టుబడులు వద్దు


మీకు తెలియని వాటిపై స్నేహితుల కోసం పెట్టుబడులు అసలు పెట్టవద్దని ఈ పెద్దాయని సూచన. ఎక్కువ లాభం వంటి పదాలు వినేందుకు బాగానే ఉన్నా.. వాటిలో అంతేస్థాయిలో రిస్క్ దాగి ఉందని గ్రహించాలి అంటారు.

క్రెడిట్కార్టులు కత్తిలాంటివి

క్రెడిట్ కార్డు రెండువైపులా పదునుగల కత్తిలాంటిది అంటారు బఫెట్. వీటి వాడకంలో చాలాజాగ్రత్తగా ఉండాలి. లేకపోతే అప్పులు మిమ్మల్ని వేధిస్తాయి. క్రెడిట్ కార్డు ద్వారా అధిక ఖర్చులు చేస్తుంటే.. మీరు ఇబ్బందులో పడేందుకు ఎక్కువ టైమ్ పట్టదు అంటున్నారు వారెన్ బఫెట్.


ఇల్లు విలాసవంతానికి కాదు అది అవసరం..


సొంతిల్లు కల ప్రతివారికీ ఉంటుంది. సొంతింట్లో నివసించడంలో ఉండే సంతృప్తి
వేరు. అయితే, డబ్బులున్నాయి కదాని 2బీహెచ్కే కొనుగోలు చేయాల్సి నచోట 4బీ
వాచ్ అతీసుకోవడం అర్థం లేదంటారు బఫెట్. అవసరానికి మించి ఇంటిని
కొనుగోలు చేస్తే ఈఎంఐ, ట్యాక్సులు ఇలాంటివి చాలానే ఉంటాయి . జాగ్రత్త..

Read hindi news: hindi.vaartha.com

Read also: Suspend: హెచ్ఐర్ మేనేజర్తో సరసాలు.. ఊడిన సీఈవో ఉద్యోగం

avoid showoff Breaking News Buffett quote financial advice frugal lifestyle latest news money management simple living Telugu News Warren Buffett

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.