బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. పెట్టుబడిదారులకు లాభాల పంట పండిస్తున్నాయి. అదే సమయంలో సామాన్యులకు భారీ షాక్ ఇస్తున్నాయి. ధరలు పెరుగుదల చూసి పసిడి ప్రియులు లబోదిబోమనే పరిస్థితి. అందుకే వారు పసిడి కొనుగోలును వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు బంగారం ధర పెరుగుదలను చూస్తూ అది పెట్టుబడికి అనుకూలమా లేక అందులో పెట్టుబడి పెట్టడం అనేది అంత ఉపయోగం లేనిదా అనే దానిపై ప్రశ్నలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రముఖ పెట్టుబడిదారుడు వారెన్ బఫెట్ (Warren Buffett)దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు. దశాబ్దాల పాటు బెర్క్‌షైర్ హాత్వేకు నాయకత్వం వహించిన వారెన్ బఫెట్ 2025 చివరిలో పదవీ విరమణ చేశారు.
Read Also: Baba Vanga Predictions 2026: భవిష్యత్తులో నోట్లు చెల్లవు..వాంగా షాకింగ్ జ్యోష్యం
అదనపు ఆదాయం లేదు
అయినా పెట్టుబడి తత్వంపై చర్చలు ఆయన నుంచి ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఇక బంగారం పెట్టుబడిగా ఎందుకు సంపదను సృష్టించదో అనే అంశంపై బఫెట్ అభిప్రాయం ఎప్పటినుంచో స్పష్టంగా ఉంది. ఇటీవలి సంవత్సరాల్లో Gold ధరలు భారీగా పెరిగినా, ద్రవ్యోల్బణ భయాలు, భౌగోళిక రాజకీయ అనిశ్చితి, కేంద్ర బ్యాంకుల కొనుగోళ్ల కారణంగా 2025లో రికార్డు స్థాయిలకు చేరుకున్నప్పటికీ, బఫెట్ మాత్రం బంగారాన్ని తన పెట్టుబడి వ్యూహంలో ఎప్పుడూ ప్రధానంగా పరిగణించలేదు. 2025 మధ్యకాలం వరకు వచ్చిన బెర్క్‌షైర్ హాత్వే ఫైలింగ్‌లను పరిశీలిస్తే.. కంపెనీకి ప్రత్యక్ష బంగారు పెట్టుబడులు లేవు. బఫెట్ పదే పదే చెప్పిన మాట ఏమిటంటే బంగారం తన విలువ ఆధారిత పెట్టుబడి తత్వానికి సరిపోదు అని. బంగారంపై పెట్టుబడి బఫెట్‌కు ఉన్న ప్రధాన అభ్యంతరం.. ఒకే మాటలో చెప్పాలంటే ఉత్పాదకత లేమి. ఆయన 2011లో వాటాదారులకు రాసిన లేఖలో బంగారానికి రెండు ప్రధాన లోపాలు ఉన్నాయని వివరించారు. మొదటిది.. బంగారం పెద్దగా ఉపయోగకరం కాదు. నిజమే, ఇది ఎలక్ట్రానిక్స్, ఆభరణాల్లో వాడుతారు. కానీ ఈ వినియోగం పరిమితమైనది, కొత్తగా ఉత్పత్తి అయ్యే సరఫరాను పూర్తిగా గ్రహించేంత స్థాయిలో ఉండదు. రెండవది.. మరింత కీలకమైన లోపం నగదు ప్రవాహం లేకపోవడం.
బంగారం భయంపై ఆధారపడిన పెట్టుబడి
బంగారం, వెండి ధరల పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. వెండి రేటు భారీగా పతనమవుతుందంటున్న ఆర్థిక నిపుణులు బఫెట్ ఒక ఇంటర్వ్యూలో బంగారాన్ని భయంపై ఆధారపడిన పెట్టుబడిగా అభివర్ణించారు. ప్రపంచంలో అనిశ్చితి పెరిగినప్పుడు ధరలు పెరుగుతాయి. పరిస్థితులు స్థిరపడితే అవే ధరలు తగ్గిపోతాయి. ఎందుకంటే బంగారం విలువను సృష్టించదు.. కేవలం భావోద్వేగాలపై ఆధారపడుతుందని తెలిపారు. బఫెట్ తన వాదనను బలపరచడానికి తరచూ దీర్ఘకాలిక గణాంకాలను ఉదహరిస్తారు. 1960ల మధ్యలో ఆయన బెర్క్‌షైర్ హాత్వే నియంత్రణ చేపట్టినప్పుడు.. బంగారం ధర ఔన్సుకు సుమారు 35 డాలర్లు మాత్రమే ఉండేది. అదే సమయంలో బెర్క్‌షైర్ షేర్లు టీనేజ్ ధరల్లో ట్రేడ్ అవుతుండేవి. దశాబ్దాలుగా వ్యాపార వృద్ధి, తిరిగి పెట్టుబడి పెట్టిన లాభాల ద్వారా, బెర్క్‌షైర్ విలువ బంగారాన్ని చాలా రెట్లు అధిగమించింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: