📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu News: Asif: భారత్​తో యుద్ధ అవకాశాలు వాస్తవమే: ఆసిఫ్

Author Icon By Vanipushpa
Updated: October 8, 2025 • 3:20 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్​పై పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ (Khawaja Asif) మరోసారి అక్కసు వెళ్లగక్కారు. భారత్​తో యుద్ధ అవకాశాలు వాస్తవమేనని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. పొరుగు దేశం ఇండియాతో యుద్ధం అవకాశాలను ఏమాత్రం తిరస్కరించలేమని తెలిపారు. ఓ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆసిఫ్, భారత్​పై యుద్ధం గురించి ప్రగల్భాలు పలికారు.

Jaffar Express : జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌పై మరోసారి దాడి‌..

అల్లాహ్ పేరు మీద పాకిస్థాన్ ఏర్పడింది

“నేను ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులను కోరుకోవడం లేదు. కానీ యుద్ధ అవకాశాలు వాస్తవం. నేను దానిని తిరస్కరించడం లేదు. ఒకవేళ భారత్​తో యుద్ధం వస్తే గతం కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తాం. భారత్‌ ఎప్పుడూ ఒకే ఐక్య దేశం కాదని చరిత్ర చెబుతోంది. ఔరంగజేబ్ పాలనలో కొంతకాలం తప్ప భారత్ ఎప్పుడూ ఐక్య దేశం కాదు. పాకిస్థాన్ అల్లాహ్ పేరు మీద ఏర్పడింది. పాకిస్థానీయులు స్వదేశంలో వాదించుకుంటారు, పోటీ పడతారు. కానీ భారత్​తో పోరాటం అంటే మాత్రం మేము అందరం కలిస్తే వస్తాం అని అయన అన్నారు.

Pak: భారత్​తో యుద్ధ అవకాశాలు వాస్తవమే: ఆసిఫ్

సాధారణ పౌరులపై మాకు ఎలాంటి కోపంలేదు : ఉపేంద్ర ద్వివేది

ఇటీవలే ఓ కార్యక్రమంలో పాకిస్థాన్​కు భారత సైన్యాధిపతి జనరల్‌ ఉపేంద్ర ద్వివేది వార్నింగ్ ఇచ్చారు. ఉగ్రవాద ముఠాలను ఎగదోయడం మానుకోకుంటే ప్రపంచ పటంలో పాక్‌ అస్థిత్వమే ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. ఆపరేషన్‌ సిందూర్‌ 1.0 సమయంలో చూపిన సంయమనాన్ని ఈసారి తాము చూపలేకపోవచ్చన్నారు. ఈ దఫా ఒక అడుగు ముందుకేసి ప్రపంచ పటంలో కొనసాగాలా? లేదా అని పాక్‌ ఆలోచించుకోవాల్సిన స్థాయిలో భారత్ చర్యలు ఉంటాయని వెల్లడించారు. ప్రపంచ పటంలో తన స్థానాన్ని కాపాడుకోవాలంటే ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదాన్ని పాక్ ఆపాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాదాన్ని పాక్‌ ఎగదోయనంతకాలం ఆ దేశానికి చెందిన సాధారణ పౌరులపై మాకు ఎలాంటి కోపంలేదని స్పష్టం చేశారు.

రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ఆసిఫ్ కు అలవాటే

ఇక, అంతకుముందు కూడా భారత్​పై పాక్ రక్షణ మంత్రి ఖవాజా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో సైనిక ఘర్షణ జరిగితే తమ యుద్ధ విమానాల శిథిలాల కింద భారత్‌ సమాధి అవుతుందని ప్రగల్భాలు పలికారు. భారత సైనికాధికారులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఏడాది మే నెలలో జరిగిన దాడుల్లో భారత్​కు భారీ నష్టం వాటిల్లిందన్నారు. దెబ్బతిన్న ప్రతిష్టను, విశ్వసనీయతను పునరుద్ధరించుకోవడానికి ఆరాటపడుతున్నారని, విఫల యత్నాలు చేస్తున్నారని భారత్​పై ఖవాజా అక్కసు వెళ్లగక్కారు.

భారత్ దాడిలో వందలాది ముష్కరులు హతం

ఈ ఏడాది ఏప్రిల్​లో జమ్ముకశ్మీర్​లోని పహల్గాంలో 26 మంది అమాయక పర్యటకులను పొట్టన పెట్టుకున్నారు ముష్కరులు. ఈ క్రమంలో భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో పాక్​తో సింధూ నదీ జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకుంది. అలాగే పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టింది. పాకిస్థాన్, పీఓకేలోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను టార్గెట్ చేసుకుంది. ఇండియన్ ఆర్మీ జరిపిన దాడుల్లో జైషే మహ్మద్, లష్కరే తోయిబాకు చెందిన తొమ్మిది ఉగ్రవాద స్థావరాలు ధ్వంసం అయ్యాయి. అలాగే వందలాది ముష్కరులు హతమయ్యారు. భారత్ జరిపిన దాడుల వల్ల పాకిస్థాన్ సైన్యానికి గణనీయమైన నష్టం కూడా వాటిల్లింది.

1971 ఇండియా vs పాకిస్థాన్ యుద్ధంలో ఎవరు గెలిచారు?

1లో జరిగిన ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో ఎవరు గెలిచారు? 1971 ఇండో-పాకిస్తాన్ యుద్ధంలో భారతదేశం మరియు బంగ్లాదేశ్ గెలిచాయి. భారతదేశం పాకిస్తాన్‌ను ఓడించింది, బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం పొందింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

cross-border issues defense news geopolitical tensions India-Pakistan Tensions International Relations Khawaja Asif statement Latest News Breaking News Telugu News war possibility

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.