War: 2023 నుంచి గాజాలో ఇజ్రాయెల్ చేస్తున్న దాడులతో గాజా అతలాకుతలమైపోయింది. పూర్తిగా జనజీవనం స్తంభించిపోయింది. ఎక్కడ చూసిన ఆకలి కేకలు. పిల్లలు ఆహారం లేక ఏడుస్తుంటే మహిళలు ఏవమీ చేయలేని నిస్సహాయస్థితి. ఇక చంటిబిడ్డలకు పాలు, బ్రెడ్, వైద్యసదుపాయాలు లేక కడుదయనీయస్థితిలో జీవిస్తున్నారు. ఆహారం కోసం వేచిచూస్తున్న వారిపై ఇజ్రాయెల్ దాడులకు పాల్పడుతుండడంతో వందల్లో ప్రజలు చనిపోతున్నారు. దీంతో ఇక్కడి ప్రజలకు తిండి దొరక్క అల్లాడిపోతున్నారు. ఆహారం కోసం సహాయక కేంద్రాల వద్ద ఎగబడుతున్నారు. మరికొందరికి ఆహారమే దొరకడం లేదు. ఆకలితో అలమటిస్తూ ఇటీవల వందమందికిపైగా ప్రజలు మరణించడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్న విషయం.
ఉద్యమిస్తున్న మానవీయ విపత్తు మధ్య ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు ముందడుగు
War: గాజాలో పెరుగుతున్న మరణాలు.. కాల్పుల విరమణ గాజా (Gaza) లోని జనాభా ఎక్కువగా ఉండే మూడు ప్రాంతాల్లో రోజుకు 10 గంటలపాటు కాల్పుల విరమణను అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఆదివారమే దీన్ని అమల్లోకి తీసుకొచ్చింది. గాజా సిటీ, డెయిర్ అల్బలా, మువాసీ ప్రాంతాల్లో కాల్పుల విరమణ ఉంటుంది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8గంటల వరకు దీన్ని అమలు చేస్తున్నామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఆహార సరఫరాలకు ఇబ్బంది ఉండదు ఈ విధమైన కాల్పుల విరమణకు రావడంతో స్థానిక ప్రజలకు ఆహారం అందించేందుకు మార్గం సుగమం అవుతుందని ఇక్కడి అధికారులు తెలిపారు. అలాగే అవసరమైన ప్రజలంరికీ ఆహారం అందించాలంటే విస్తృతకాల్పుల విరమణ అవసరమని సూచించింది. ఇక హమాస్ విషయంలో మాత్రం ఇజ్రాయెల్ (Israel) ఏమాత్రం తగ్గడం లేదు. గాజాలోని మిగిలిన ప్రాంతాల్లో హమాస్కు వ్యతిరేకంగా దాడులు కొనసాగుతాయని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది.
గాజా యుద్ధానికి కారణం ఏమిటి?
దక్షిణ ఇజ్రాయెల్‌పై హమాస్ రాకెట్ దాడులను మరియు గాజాలోకి ఆయుధాల అక్రమ రవాణాను ఆపడం అనే లక్ష్యంతో, ఇజ్రాయెల్ 2008 డిసెంబర్ 27న గాజా స్ట్రిప్‌లో ఆపరేషన్ “కాస్ట్ లీడ్” (హీబ్రూ: מבצע עופרת יצוקה) అనే సంకేతనామంతో ఒక పెద్ద సైనిక ప్రచారాన్ని ప్రారంభించడంతో గాజా యుద్ధం ప్రారంభమైంది.
గాజా యుద్ధం ఎవరు ప్రారంభించారు?
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం, ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా ఉగ్రవాదుల మధ్య, ముఖ్యంగా హమాస్ మరియు పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్ (PIJ) మధ్య యుద్ధం, ఇది అక్టోబర్ 7, 2023న హమాస్ గాజా స్ట్రిప్ నుండి ఇజ్రాయెల్‌పై భూమి, సముద్రం మరియు వైమానిక దాడిని ప్రారంభించినప్పుడు ప్రారంభమైంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Operation Sindoor : త్రివిధ దళాల పరాక్రమాన్ని చూసి పాక్ తట్టుకోలేకపోయింది ..రాజ్‌నాథ్ సింగ్