📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Trump: త్వరలోనే యుద్ధం ముగింపు..చమురు ధరల్లో భారీ మార్పు!

Author Icon By Vanipushpa
Updated: March 10, 2026 • 11:19 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా అమెరికా ఇరాన్ యుద్ధం (iran war) గురించే చర్చ జరుగుతోంది. ఈ యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు (Crude Oil) ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఏకంగా బ్యారెల్‌కు 100 డాలర్ల మార్కును దాటేసింది. దాదాపు నాలుగేళ్ల తర్వాత చమురు ధరలు ఈ స్థాయికి చేరడం గమనార్హం. ఈ పరిణామం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉండటంతో. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Trump) రంగంలోకి దిగారు. ఆంక్షల ఎత్తివేతపై ట్రంప్ కీలక ప్రకటన చమురు ధరల పెరుగుదల వల్ల సామాన్యులపై భారం పడకుండా చూసేందుకు అమెరికా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. మంగళవారం విలేకరులతో మాట్లాడిన ట్రంప్.. చమురు ధరలను తగ్గించేందుకు కొన్ని దేశాలపై ఉన్న ఆంక్షలను (Sanctions) తొలగించబోతున్నట్లు ప్రకటించారు. “పరిస్థితి చక్కబడే వరకు కొన్ని ఆంక్షలను ఎత్తివేస్తున్నాం. దీనివల్ల మార్కెట్లోకి చమురు సరఫరా పెరిగి ధరలు తగ్గుతాయని ఆశిస్తున్నాం” అని ఆయన పేర్కొన్నారు. కేవలం ఆంక్షల ఎత్తివేతే కాకుండా ధరలను అదుపు చేసేందుకు ఇతర మార్గాలను కూడా అన్వేషిస్తున్నట్లు ఆయన తెలిపారు.

Read Also: Rental Coolers in Hyderabad: హైదరాబాద్​లో అద్దె​కు కూలర్లు


Trump: War will end soon.. Huge change in oil prices!

సామాన్యులపై ధరల ప్రభావం

ముఖ్యంగా ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైన ‘స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్’ (Strait of Hormuz) మార్గాన్ని అడ్డుకోవాలని చూస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. “ప్రపంచాన్ని బందీగా మార్చుకోవాలని చూసే ఏ ఉగ్రవాద పాలననైనా నేను ఉపేక్షించను. చమురు సరఫరాను ఆపాలని చూస్తే.. ఇరాన్ గతంలో ఎన్నడూ చూడని రీతిలో భారీ దాడులను ఎదుర్కోవాల్సి ఉంటుంది” అని ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్ ఇజ్రాయెల్-అమెరికా మధ్య జరుగుతున్న ఈ యుద్ధం వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. అమెరికాలో త్వరలో జరగనున్న మిడ్-టర్మ్ ఎన్నికల నేపథ్యంలో పెరుగుతున్న గ్యాసోలిన్ ధరలు ఓటర్లపై ప్రభావం చూపే అవకాశం ఉందని ట్రంప్ ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. అయితే, ఈ ధరల పెరుగుదల అనేది కేవలం “స్వల్పకాలిక సమస్య” అని, యుద్ధం ముగియగానే ధరలు మళ్ళీ సాధారణ స్థితికి వస్తాయని ట్రంప్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Crude Oil Prices energy crisis global oil market International Trade Latest News in Telugu oil price drop petrol diesel rates Stock Market Update Telugu News Paper war impact on economy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.