Shamshabad Airport: యుద్ధం ఎఫెక్ట్.. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో విమాన సర్వీసులు రద్దు

Read Time:  1 min
Shamshabad Airport: యుద్ధం ఎఫెక్ట్.. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో విమాన సర్వీసులు రద్దు
FONT SIZE
GET APP

Shamshabad Airport: మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) పై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య భీకర దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో, భద్రతా కారణాల దృష్ట్యా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి వెళ్లాల్సిన, రావాల్సిన 10 విమాన సర్వీసులను అధికారులు రద్దు చేశారు. ముఖ్యంగా పశ్చిమ ఆసియా మీదుగా ప్రయాణించే అంతర్జాతీయ సర్వీసులపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంది.భద్రతా కారణాల వల్ల కొన్ని ఎయిర్‌లైన్స్ తమ సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసినట్లు సమాచారం. రద్దైన సర్వీసుల వల్ల ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Read Also: Kamala Harris-Trump: ట్రంప్‌పై నిప్పులు చెరిగిన కమలా హ్యారిస్

War effect.. Flight services canceled at Shamshabad Airport
War effect.. Flight services canceled at Shamshabad Airport

తాత్కాలికంగా రద్దు..

విమానాశ్రయ అధికారులు ప్రయాణికులు తమ తమ ఎయిర్‌లైన్స్‌ను సంప్రదించి తాజా సమాచారం తెలుసుకోవాలని సూచించారు.ప్రస్తుత పరిస్థితులను బట్టి మరికొన్ని సర్వీసుల షెడ్యూల్ ను త్వరలో ప్రకటిస్తామని విమానయాన శాఖ అధికారులు తెలిపారు. పశ్చిమాసియాలో అనేక విమానాశ్రయాలు మూసివేయడంతో ఆ ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎయిర్ పోర్టుకు వెళ్లే ముందు స్టేటస్ చెక్ చేసుకోవాలని, గల్ఫ్ దేశాలకు విమానాలను నడపటం లేదని పలు విమానయాన సంస్థలు ఇప్పటికే ప్రకటించాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.