ఇప్పుడంతా డిజిటల్ యుగం. ఇది మనషి జీవన శైలిని(vreels) పూర్తిగా మార్చేసింది. మనం నిత్యం చేసే పనులను ఈజీ చేయడానికి ఎన్నో యాప్ లు అందుబాటులోకి వచ్చాయి. అందులో కొన్ని చాటింగ్ కోసం, మరికొన్ని వీడియోల కోసం, ఇంకొన్ని షాపింగ్ కోసం.. ఇలా రకరకాలుగా వాడుతుంటాం. అయితే ఒకే యాప్ పై అన్ని సర్వీసులను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో వీరీల్స్ రూపొందింది. ప్రపంచానికి కొత్త తరహా డిజిటల్ అనుభవాన్ని అందించడానికి అమెరికాలోని తెలుగు ఇంజినీర్లు దీన్ని తయారు చేయడం విశేషం. ఇది ఇప్పటికే 22 దేశాల్లో విడుదలై, ప్రస్తుతం బీటా దశలో ఉంది. ప్లే స్టోర్,(Play Store) యాప్ స్టోర్ వీరీల్స్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ కొత్త అనుభవాన్ని ఆస్వాదించవచ్చని కంపెనీ నిర్వాహకులు చెబుతున్నారు.
Read also: చేవెళ్ల ఘటనాస్థలికి మంత్రి పొన్నం
ప్రతియూజర్ ఓ క్రియేటర్ గా మారవొచ్చు
వీరీల్స్(vreels) ఒకే చోట కంటెంట్ సృష్టి, వినోదం, సంభాషణకు డిజిటల్ వేదికగా పనిచేస్తుంది. ఇందులో ప్రతి యూజర్ ఒక క్రియేటర్ గా మారే అవకాశం ఉంది. చిన్న వీడియోలు, ఫొటోలు, క్రియేటివ్ స్టోరీస్ ను వ్యక్తిగతంగా యూజర్ల ఆసక్తులకు సరిపోయేలా రూపొందించుకునే అవకాశం ఉంది. ఇందులోని ఫీడ్ యూజర్లు ఇష్టపడే విషయాలను నేర్చుకుంటూ మరింత పర్సనల్ ఎక్స్పీరియన్స్ ను పొందవచ్చు. కీల్స్, ఫిక్స్ మన భావాలు, ప్రయాణాలు, అభిప్రాయాలు, ఆలోచనలు.. అన్నీ ఒక క్లిక్ లో రికార్డ్ చేసి, ఎడిట్ చేసి ఇతరులతో పంచుకోవచ్చు. వీడియోలు, ఫొటోల రూపంలో ఆసక్తికరంగా యూజర్లు తమ భాబాలను వ్యక్తీకరించే అవకాశం ఉంది. ఫిల్టర్లు, టెక్స్ట్, స్టిక్కర్లు, మ్యూజిక్ సపోర్ట్ తో క్రియేటర్లకు మెరుగైన అనుభవం దీని సొంతం. చాట్స్, కాల్స్ కనెక్ట్ అయ్యేందుకు.. స్నేహితులతో మాట్లాడటానికి, గ్రూప్ చేయటానికి లేదా వీడియో కాల్ చేసుకోవటానికి వేర్వేరు యాప్ లు అవసరం లేదు. వీరీల్స్ లోనే ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి. వీరీల్స్ క్రియేటివ్ వేదికగా ఉన్నందున ఇది సాధ్యపడింది. మీరు మాట్లాడుతూనే మీ ఆలోచనలను ఇతరులతో పంచుకోవడానికి అవకాశం ఉంది.
విమ్యాప్ లేకేషన్ షేరింగ్
మీ స్నేహితులు లేదా కమ్యూనిటీ సభ్యులు ఎక్కడ ఉన్నారో వీమ్యాప్స్ సులభంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంది. లొకేషన్ షేరింగ్ పూర్తిగా మీ నియంత్రణలో ఉంటుంది. వీరీల్స్ ఒక యాప్ మాత్రమే కాదు. అమెరికన్ వ్యాపార స్ఫూర్తిని, భారతీయ స్వయం ఆవిష్కరణ శక్తిని ప్రతిబింబించే ఒక వవేదిక అని చెప్పవచ్చు. ప్రతి అప్ డేట్ తో కొత్త సాంకేతిక పరిణామాలు, స్థానిక భాషల సపోర్ట్, యూజర్ అనుభవాన్ని మెరుగుపరిచే మార్పులు తీసుకువస్తుంది. ఇది మేడ్ ఫర్ ద వరల్డ్ అనే స్పూర్తికి ఉదాహరణగా నిలుస్తుంది. ఇప్పటికే వీరీల్స్ బృందం వినూత్న సాంకేతిక పేటెంట్లను దాఖలు చేసింది. ఇవి ప్రస్తుతం ఆమోద దశలో ఉండగా, త్వరలోనే మంజూరు అవుతాయని అంచనా.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: