📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Vladimir Putin: యార్క్.. సూట్ కేసులో పుతిన్ మలమూత్రాలు.. అంతర్జాతీయ మీడియాలో న్యూస్ హల్ చెల్

Author Icon By Anusha
Updated: August 18, 2025 • 1:25 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి


రష్యా-ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం మొదలైనప్పటి నుంచి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ లకు సంబంధించినవి రోజుకో వార్త అయినా ఉంటుంది. ప్రపంచ దేశాలు,దీనిపై ఏదో ఒక వార్తను కవర్ చేస్తూనే ఉంటుంది. తాజాగా పుతిన్ పై ఓ ఆసక్తికరమై వార్త అంతర్జాతీయ మీడియాలో హల్ చెల్ చేస్తున్నది. ఇటీవల పుతిన్ (Vladimir Putin) అమెరికాలోని అలాస్కాలో ట్రంప్ తో పర్యటించిన విషయం తెలిసిందే. విదేశీ పర్యటనలకు పుతిన్ వెళ్లినప్పుడు ఆయన మలమూత్రాలను ఓ ప్రత్యేక సూట్కేసులో భద్రపరిచి వెనక్కి తీసుకెళ్తారని న్యూస్ హాట్ టాపిక్ గా మారింది.

శత్రు దేశాలకు పుతిన్ ఆరోగ్య రహస్యాలు దొరకుండా జాగ్రత్తలు

కాగా పుతిన్ ఆరోగ్య రహస్యాలు శత్రు దేశాలకు చిక్కకుండా ఉండేందుకే ఈ వినూత్న భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారని ‘ది ఎక్స్ప్రెస్ యూఎస్’ ఒక వార్తను ప్రచురించింది.అలాస్కాలో కూడా ఇదే జరిగింది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో (Donald Trump) అలాస్కాలో జరిగిన సదస్సు సందర్భంగా పుతిన్ భద్రతా సిబ్బంది ఒక ప్రత్యేక బ్రీఫ్ కేసును తీసుకెళ్లినట్లు ఈ కథనం పేర్కొంది. ఫ్రాన్కు చెందిన ఇన్వెస్టిగేటివ్,జర్నలిస్టులు రెగిస్ జెంట్, మిఖాయిల్ రూబిన్ లను ఉటంకిస్తూ, పుతిన్ విదేశాలకు వెళ్లినప్పుడు ఆయన మలమూత్రాలను రష్యా ఫెడరల్ ప్రొటెక్షన్ సర్వీస్ (ఎఫ్పీఎస్) సిబ్బంది సేకరిస్తారని తెలిపింది.సేకరించిన విసర్జితాలను ప్రత్యేక సంచులలో భద్రపరిచి, సూట్ కేసులో ఉంచి రష్యాకు తిరిగి తీసుకువస్తారని వివరించింది.

Vladimir Putin

చాలా ఏళ్లుగా ఈ పద్ధతి కొనసాగుతున్నది

అయితే ఈ పద్ధతి చాలా సంవత్సరాలుగా కనసాగుతున్నదని, 2017 మేలో పుతిన్ ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లినప్పుడు కూడా ఇలాగే జరిగిందని నివేదికలు చెబుతున్నాయి. విదేశీ గూఢచార సంస్థలు పుతిన్,విసర్జితాలను సేకరించి, దానిని విశ్లేషించడం ద్వారా ఆయన ఆరోగ్య పరిస్థితిపై కీలక సమాచారం తెలుసుకునే ప్రమాదం ఉందని రష్యా భావిస్తోందని, అందుకే ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారని,సమాచారం. జర్నలిస్టు ఫరీదా రుస్తమోవా కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. పుతిన్ వియన్నా పర్యటనలో ఉన్నప్పుడు ఒక పోర్టబుల్ టాయిలెట్ను ఉపయోగించారని, ఆయన 1999లో అధికారం,చేపట్టినప్పటి నుంచే ఈ విధానాన్ని అనుసరిస్తున్నారని ఒక సోర్స్ ద్వారా తెలిసిందని ఆమె చెప్పినట్లు ‘ది ఎక్స్ప్రెస్ యూఎస్’పేర్కొంది.

పుతిన్ ఆరోగ్యంపై పలు ఊహాగానాలు

కాగా గతకొన్ని రోజులుగా పుతిన్ ఆరోగ్యంపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గతేడాది కజికిస్థాన్లో జరిగిన ఓ సమావేశంలో ఆయన తన కాళ్లను అదుపులేకుండా కదిలించడం, 2023లో బెలారస్అధ్యక్షుడు లుకాషెంకోతో భేటీలో అసౌకర్యంగా కనిపించడం వంటి సంఘటనలు ఆయనకు పార్కిస్సన్స్ వంటి నరాల సంబంధిత వ్యాధి ఉందనే అనుమానాలకు తావిచ్చాయి. దీంతో తన ఆరోగ్య రహస్యాలు బయటకు పొక్కకుండా ఉండేందుకే పుతిన్ ఇంతటి కఠినమైన, వింతైన భద్రతా చర్యలు తీసుకుంటున్నారని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య సుదీర్ఘకాలంగాజరుగుతున్న యుద్ధం కారణంగా పుతిన్ తరచూ వార్తలో నిలుస్తున్నారు. పుతిన్ ఏది చేసినా అది వార్తగా ట్రెండింగ్ అవుతున్నది.

పుతిన్ రాజకీయ జీవితాన్ని ఎప్పుడు ప్రారంభించారు?

1990లలో రాజకీయ రంగంలోకి ప్రవేశించిన పుతిన్, 1999లో రష్యా ప్రధానిగా, 2000లో అధ్యక్షుడిగా నియమితులయ్యారు.

పుతిన్ ఏ ఏ పదవుల్లో పనిచేశారు?

ఆయన రష్యా అధ్యక్షుడిగా, ప్రధానమంత్రిగా కూడా పలు సార్లు పనిచేశారు.

    Read more: hindi.vaartha.com

    Read Also:

    https://vaartha.com/vijay-deverakonda-rashmika-celebrate-in-newyork/cinema/531877/

    Alaska Breaking News international news latest news putin putin news russia trump Ukraine War Vladimir Putin world politics Zelensky

    గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.