📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Vladimir Putin: త్వ‌ర‌లోనే ఇండియాలో ప‌ర్య‌టించ‌నున్న పుతిన్

Author Icon By Sudha
Updated: August 7, 2025 • 3:52 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ (Vladimir Putin) త్వ‌ర‌లోనే ఇండియాలో ప‌ర్య‌టించ‌నున్నారు (visit India). ఆయ‌న ప‌ర్య‌ట‌న‌కు చెందిన తేదీలు దాదాపు ఖ‌రారు అయిన‌ట్లు జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు అజిత్ ధోవ‌ల్ తెలిపారు. ప్ర‌స్తుతం ధోవ‌ల్.. మాస్కోలో ఉన్నారు. అయితే ఈనెల చివ‌ర‌లో ఆ భేటీ జ‌రిగే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. ర‌ష్యాతో వాణిజ్యం విష‌యంలో భార‌త్‌పై అమెరికా అద‌న‌పు సుంకం విధిస్తున్న నేప‌థ్యంలో మోదీ, పుతిన్ (Vladimir Putin)భేటీ కీల‌కం కానున్న‌ది.

Vladimir Putin: త్వ‌ర‌లోనే ఇండియాలో ప‌ర్య‌టించ‌నున్న పుతిన్


మరో వైపు ట్రంప్‌, పుతిన్ కూడా భేటీకానున్నారు. ఆ ఇద్ద‌రి భేటీకి వేదిక‌ను డిసైడ్ చేసిన‌ట్లు ర‌ష్యా అధ్య‌క్ష కార్యాల‌యం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. భేటీకి సంబంధించిన వేదిక అంశంలో రెండు దేశాలు అంగీక‌రించిన‌ట్లు తెలుస్తోంది. అమెరికా దౌత్య‌వేత్త స్టీవ్ విట్‌కాఫ్ ఇటీవ‌ల మాస్కోలో ప‌ర్య‌టించారు. ఆయ‌న ప‌ర్య‌ట‌న త‌ర్వాత ఇద్ద‌రు అగ్ర‌నేత‌ల‌కు చెందిన మీటింగ్‌పై అంగీకారం కుదిరిన‌ట్లు అంచ‌నా వేస్తున్నారు. ఈ భేటీకి జెలెన్‌స్కీని కూడా ఆహ్వానించాల‌ని అమెరికా నిర్ణ‌యించింది. కానీ దీనిపై ర‌ష్యా స్పందించ‌లేదు. ఈనెల చివ‌ర‌లో ప్ర‌ధాని మోదీ.. చైనాలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఆ ప‌ర్య‌ట‌న‌కు చెందిన నిర్ణ‌యం తీసుకున్నారు. చైనా అధ్య‌క్షుడు జీ జిన్‌పింగ్‌తో మోదీ భేటీ అవుతారు. అమెరికా అద‌న‌పు సుంకాలు విధించిన నేప‌థ్యంలో ఇండియా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

వ్లాదిమిర్ పుతిన్ ఏ జాతికి చెందినవారు?

2000 నుండి 2008 వరకు మరియు 2012 నుండి పదవిలో పనిచేసిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కుటుంబం రష్యన్ రైతు కుటుంబానికి చెందినది.

రష్యా అధ్యక్ష పదవి కాలం?

ఈ పరిమితులను రష్యా రాజ్యాంగం నిర్వచించింది. రష్యా అధ్యక్షుడు ఆరు సంవత్సరాల పదవీకాలానికి రెండు కంటే ఎక్కువ కాలాలకు పరిమితం చేయబడలేదు. 2020లో రాజ్యాంగ సవరణలకు ముందు, ఈ పరిమితి వరుస పదవీకాలాలకు మాత్రమే వర్తించేది, పదవీకాల పరిమితి ఉన్న అధ్యక్షుడిని ఒక పదవీకాలం తర్వాత మళ్లీ ఎన్నుకోవడానికి వీలు కల్పించింది.

రష్యా శక్తివంతమైన నాయకుడు ఎవరు?

వ్లాదిమిర్ వ్లాదిమిరోవిచ్ పుతిన్ (జననం 7 అక్టోబర్ 1952) ఒక రష్యన్ రాజకీయ నాయకుడు మరియు మాజీ ఇంటెలిజెన్స్ అధికారి, అతను 2012 నుండి రష్యా అధ్యక్షుడిగా పనిచేశాడు, గతంలో 2000 నుండి 2008 వరకు పనిచేశాడు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Rice: ఫిలిప్పీన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు బారి ఎత్తున తెలంగాణ బియ్యం ఎగుమతి..

Ajit Doval Breaking News India Visit latest news Modi Putin Meeting Russia-India Relations Telugu News Vladimir Putin

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.