Latest Telugu News : Vladimir Putin: డాన్‌బాస్ ప్రాంతాల‌ను త్వ‌ర‌లోనే ఉక్రెయిన్ ఆర్మీ కోల్పోనుంది : వ్లాదిమిర్ పుతిన్

Read Time:  1 min
Vladimir Putin
Vladimir Putin
FONT SIZE
GET APP

వివాదాస్ప‌ద డాన్‌బాస్ ప్రాంతం నుంచి ఉక్రెయిన్ ద‌ళాల‌ను త‌రిమికొట్టి, ఆ ప్రాంతాన్ని విముక్తి చేయ‌నున్న‌ట్లు ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin) పేర్కొన్నారు. సైనిక చ‌ర్య ద్వారా అయినా లేక దౌత్య‌ప‌ర‌మైన ప‌ద్ధ‌తిలోనైనా డాన్‌బాస్ ప్రాంతాన్ని విముక్తి చేయ‌నున్న‌ట్లు చెప్పారు. భార‌త ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ఇండియా టుడేకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. డాన్‌బాస్ ప్రాంతంలో ఉన్న డోన‌స్కీ, లుంగాస్క్ ప్రాంతాలు ఉక్రెయిన్ ద‌ళాలు విడిచి వెళ్లాల‌ని పుతిన్ భావిస్తున్నారు. నాటోలో చేరే ప్ర‌క్రియ‌ను విర‌మించుకోవాల‌న్నారు.

Read Also : India: భారత్ కు రష్యా, అమెరికాలలో ఏది ముఖ్యం

 Vladimir Putin
Vladimir Putin

డాన్‌బాస్ ప్రాంతాల‌ను త్వ‌ర‌లోనే ఉక్రెయిన్ ఆర్మీ కోల్పోతుంద‌ని పుతిన్(Vladimir Putin) తెలిపారు. ఆ ప్రాంతం నుంచి ఉగ్ర‌వాదుల్ని సైనిక చ‌ర్య‌తో త‌రిమిస్తామ‌ని, లేదా ఉక్రెయిన్ ద‌ళాలు అక్క‌డ నుంచి ఉప‌సంహ‌రించుకుని, యుద్ధాన్ని ఆపేయాల‌న్నారు. వాస్త‌వానికి ఆ ప్రాంతంలో అంత‌గా భీక‌ర యుద్ధం జ‌ర‌గాల్సిన ప‌నిలేద‌న్నారు. ముందు నుంచీ ఉక్రెయిన్‌కు చెబుతూ వ‌స్తున్నామ‌ని, అక్క‌డ ఉన్న ప్ర‌జ‌లు ఉక్రెయిన్‌తో క‌లిసి ఉండాల‌నుకోవ‌డం లేద‌ని, వాళ్లంతా ప్ర‌జాభిప్రాయ సేక‌ర‌ణ‌లో పాల్గొన్నార‌ని, స్వ‌తంత్రం కావాల‌ని ఓటు వేశార‌ని, అందుకే ఉక్రెయిన్ అక్క‌డ నుంచి త‌మ ద‌ళాల‌ను వెన‌క్కి తీసుకెళ్లాల‌ని, అప్పుడు యుద్ధం ఉండ‌ద‌ని, కానీ వాళ్లు ఫైటింగ్ కోరుకున్న‌ట్లు పుతిన్ పేర్కొన్నారు.

వ్లాదిమిర్ పుతిన్ నేపథ్యం?

పుతిన్ 16 సంవత్సరాలు KGB విదేశీ నిఘా అధికారిగా పనిచేశారు, లెఫ్టినెంట్ కల్నల్ స్థాయికి ఎదిగారు. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో రాజకీయ జీవితాన్ని ప్రారంభించడానికి 1991లో రాజీనామా చేశారు. 1996లో, అధ్యక్షుడు బోరిస్ యెల్ట్సిన్ పరిపాలనలో చేరడానికి ఆయన మాస్కోకు వెళ్లారు.

భారత్ కు రష్యా మద్దతు ఉందా?

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారతదేశం శాశ్వత సభ్యత్వాన్ని పొందేందుకు రష్యా కూడా మద్దతు ఇస్తుంది. అదనంగా, భారతదేశం NSG మరియు APECలో చేరడానికి రష్యా తన మద్దతును ప్రకటించింది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Sudha

రచయిత గురించి

Sudha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.