📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి

Telugu News: Visa Rules: H1B, H4 వీసాలపై ట్రంప్ సంచలన నిర్ణయం

Author Icon By Pooja
Updated: December 14, 2025 • 3:26 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్ నుంచి అమెరికా వెళ్లే నిపుణులకు జారీ చేసే హెచ్1బీ, హెచ్4 వీసాల (Visa Rules) విషయంలో ట్రంప్(Trump) ప్రభుత్వం తరచూ కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే హెచ్1బీ వీసా ఫీజుల పెంపు, రాష్ట్రాల మధ్య న్యాయపోరాటాలు, వీసా దరఖాస్తులపై కఠిన వెట్టింగ్ కారణంగా ఇంటర్వ్యూలు ఆలస్యం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా అమెరికా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

Read Also: Mexico Import Tariffs: భారత్ ఉత్పత్తులపై మెక్సికో టారిఫ్ పెంపు

Visa Rules

ప్రస్తుతం భారత్‌లో జరుగుతున్న హెచ్1బీ వీసా(Visa Rules) ఇంటర్వ్యూలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇదే సమయంలో అమెరికాలో ఉన్న హెచ్1బీ, హెచ్4 వీసాదారులకు కాన్సులేట్ నుంచి ఈమెయిల్స్ వెళ్తున్నాయి. అందులో వారి వర్క్ వీసాలను ముందుజాగ్రత్త చర్యగా తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియా తనిఖీలను మరింత విస్తృతంగా చేపట్టాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించడంతో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీని వల్ల వేలాది వీసాలు ప్రభావితమయ్యాయి.

అయితే ప్రభుత్వం చేపట్టిన ఈ చర్యను ‘ప్రుడెన్షియల్ రివోక్’గా పిలుస్తున్నారు. ఇది శాశ్వత రద్దు కాదని, కేవలం తాత్కాలికంగా ముందుజాగ్రత్తగా తీసుకున్న చర్య మాత్రమేనని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ విధంగా వీసా తాత్కాలికంగా రద్దు కావడం వల్ల అమెరికాలో ఉన్నవారి చట్టబద్ధ హోదాపై ఎలాంటి ప్రభావం ఉండదని, వీసా గడువు ముగిసే వరకు వారు అక్కడే కొనసాగవచ్చని తెలిపారు. తదుపరి వీసా అపాయింట్‌మెంట్ సమయంలో మాత్రం ఈ అంశాన్ని మళ్లీ సమీక్షిస్తారు.

హెచ్1బీ దరఖాస్తుదారులు, అలాగే హెచ్4 డిపెండెంట్ వీసాలపై ఉన్న కుటుంబ సభ్యుల సోషల్ మీడియా ప్రొఫైల్‌లను స్క్రీన్ చేయనున్నట్లు విదేశాంగ శాఖ ప్రకటించిన కొద్ది రోజులకే ఈ నిర్ణయం వెలువడింది. ఈ ఏడాది ప్రారంభంలో విద్యార్థి వీసాలతో మొదలైన ఆన్‌లైన్ తనిఖీలను ఇప్పుడు వర్క్ వీసాలకూ విస్తరించారు. వీసా అర్హతపై అనుమానాలు ఉన్నా, అవి ఇంకా పూర్తిగా నిర్ధారణ కాకపోతే ఇలాంటి తాత్కాలిక రద్దు చర్యలు చేపడతారని నిపుణులు వివరిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read also :

Google News in Telugu Latest News in Telugu Trump administration US Immigration

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.