📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

America: భారతీయ విద్యార్థులు, టూరిస్ట్‌లకు భారీగా వీసా ఫీజు పెంపు

Author Icon By Vanipushpa
Updated: July 11, 2025 • 4:26 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా(America) ఇటీవల ఆమోదించిన ‘ది బిగ్ బ్యూటిఫుల్ బిల్లు’ (One Big Beautiful Bill )తో వీసా కోసం దరఖాస్తు చేసే విదేశీయులపై డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఆర్థిక భారం మోపారు. ఈ చట్టం కింద ‘ వీసా ఇంటిగ్రిటీ ఫీజు ’(visa integrity fee) పేరుతో 250 డాలర్లు (సుమారు రూ. 21,400) అదనపు ఫీజు విధించిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది. ఈ కొత్త ఫీజు 2026 జనవరి 1 నుంచి అమలులోకి రానుంది. ఇప్పటికే ఉన్న వీసా(Visa) ఫీజుతో పాటు దీనిని అదనంగా వసూలు చేయనున్నారు. ముఖ్యంగా భారతీయ పర్యాటకులు, విద్యార్థులు, ఐటీ ఉద్యోగులపై ఈ భారం ఎదుర్కొనవలసి ఉంటుంది.
వీసా ఇంటిగ్రిటీ ఫీజు వాస్తవానికి పలు రకాల నాన్-ఇమిగ్రంట్ వీసాలకు వర్తించనుంది. వ్యాపార/ టూరిజం వీసాలు (B-1/B-2), స్టూడెంట్ వీసాలు (F, M), ఉద్యోగ వీసాలు (H-1B), ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ వీసాలకు (J) అదనంగా వసూలు చేస్తారు. కేవలం దౌత్యపరమైన వీసాలకు (A, G క్యాటగిరీలు) మాత్రమే మినహాయింపు ఉంటుంది.

America: భారతీయ విద్యార్థులు, టూరిస్ట్‌లకు భారీగా వీసా ఫీజు పెంపు

ప్రస్తుతం సాధారణ టూరిస్టు వీసా ఖర్చు 185 డాలర్లు (అంటే సుమారు రూ. 15,800) ఖర్చవుతుంది. 2026లో కొత్త ఫీజులు అమల్లోకి వచ్చాక.. వీసా అప్లికేషన్ ఫీజు 185 డాలర్లు(₹15,800), వీసా ఇంటిగ్రిటీ ఫీజు 250 డాలర్లు (₹21,400), ఇతర ఫీజులు (ESTA, I-94) కింద 37 డాలర్లు (₹3,302) వసూలు చేస్తారు. ఈ మొత్తం 472 డాలర్లు (₹40,502) ఉంటుంది. ఒక్క టూరిస్ట్ వీసా మీదే 2.5 రెట్లు పెరుగుతుంది. విద్యార్థి వీసాలు (F), ఉద్యోగ వీసాలు (H-1B)కు ఇది వర్తించనుంది.

ఫీజు మినహాయింపు పొందుతారు
అయితే, ఈ ఇంటిగ్రిటీ ఫీజు రీఫండబుల్ కాదు. కానీ, కొన్ని నిబంధనలు పాటించినవారికి మినహాయింపు ఉంటుంది. వీసా గడువు ముగిసిన 5 రోజుల్లోగా అమెరికాను వీడినవారు, వీసా గడువు పొడిగించుకున్నవారు, చట్టబద్దంగా అమెరికాలో స్థిరపడినవారు (ఉదాహరణకు గ్రీన్ కార్డ్ పొందినవారు) ఫీజు మినహాయింపు పొందుతారు.
వీసా నిబంధనలు ఉల్లంఘించినవారికి ఫీజు తిరిగి చెల్లించరు
ట్రంప్ యంత్రాంగం వీసా ఇంటిగ్రిటీ ఫీజును భద్రతాపరమైన చర్యగా పేర్కొంది. విదేశీయులు తమ వీసా షరతులను కచ్చితంగా పాటించాలన్న ఉద్దేశంతో దీనిని ‘సెక్యూరిటీ డిపాజిట్’లాగా అమలు చేస్తోంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్ సెక్యూరిటీ (DHS) దీనిని నిర్వహిస్తోంది. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (Consumer Price Index) ఆధారంగా ఇది సవరించనున్నారు. కాగా, ఈ భారీ చట్టం ద్వారా ట్రంప్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది .

తాత్కాలిక కాలానికి అమెరికాలోకి ప్రవేశించాలనుకునే వారికి మరియు అమెరికాలో నిరవధిక లేదా శాశ్వత నివాసం తీసుకోవాలనుకునే వారికి వీసా సేవలను అందించే బాధ్యత అమెరికా రాయబార కార్యాలయం మరియు కాన్సులేట్‌ల కాన్సులర్ విభాగాలపై ఉంది.

ఏది ఉత్తమ US వీసా?
పర్యాటక మరియు వ్యాపార వీసాలు (B-1/B-2)
B-1 మరియు B-2 వీసాలు యునైటెడ్ స్టేట్స్ జారీ చేసే అత్యంత సాధారణ వలసేతర వీసాలలో ఒకటి. B-1 వీసా వ్యాపార ప్రయోజనాల కోసం ప్రయాణించే వ్యక్తుల కోసం రూపొందించబడింది, అంటే సమావేశాలకు హాజరు కావడం, ఒప్పందాలను చర్చించడం లేదా పరిశోధన నిర్వహించడం.
బలమైన వీసా ఏది?
ప్రపంచవ్యాప్తంగా 10 బలమైన మరియు బలహీనమైన పాస్‌పోర్ట్‌లు (2025): ఎక్కడ ...
2025 నాటికి, సింగపూర్ ప్రపంచంలోని బలమైన పాస్‌పోర్ట్‌కు నిలయంగా అగ్రస్థానంలో కొనసాగుతోంది, దాని హోల్డర్లకు ఆకట్టుకునే 195 గమ్యస్థానాలకు వీసా-రహిత ప్రాప్యతను అందిస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Radhika Yadav: మహిళా టెన్నిస్ ప్లేయర్‌ రాధికా యాదవ్ ని కాల్చి చంపిన తండ్రి..కారణమిదే?

#telugu News Indian Students Abroad International Travel India Student Visa India Tourist Visa Charges Travel Restrictions Visa Fee Hike Visa Policy Update

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.