📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Virgin Australia: వర్జిన్ ఆస్ట్రేలియా విమానంలో పాము కలకలం

Author Icon By Shobha Rani
Updated: July 2, 2025 • 4:41 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆస్ట్రేలియా(Virgin Australia)లో ఓ విమానంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. విమానం కార్గో హోల్డ్‌లో ఒక పాము ప్రత్యక్షం కావడంతో కలకలం రేగింది. దీంతో విమానం దాదాపు రెండు గంటలపాటు ఆలస్యంగా బయలుదేరింది. ఈ సంఘటన మంగళవారం మెల్‌బోర్న్ విమానాశ్రయంలో జరిగింది.
సిబ్బంది అప్రమత్తతతో తప్పిన పెనుభారం
వర్జిన్ ఆస్ట్రేలియా(Virgin Australia)కు చెందిన వీఏ337 విమానం మెల్‌బోర్న్ నుంచి బ్రిస్బేన్ వెళ్లేందుకు సిద్ధమైంది. ప్రయాణికులు విమానంలోకి ఎక్కుతుండగా సిబ్బంది కార్గో హోల్డ్‌లో పామును గుర్తించి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు, పాములు పట్టడంలో నిపుణుడైన మార్క్ పెల్లీకి సమాచారం అందించారు.
పామును పట్టిన నిపుణుడు మార్క్ పెల్లీ
విమానాశ్రయానికి చేరుకున్న పెల్లీ, కార్గో హోల్డ్‌లోకి ప్రవేశించారు. అక్కడ ప్యానెల్ వెనుక సగం దాక్కుని ఉన్న పామును చూశారు. ఆ చీకటిలో అది విషపూరితమైన పాము అయి ఉంటుందని తాను మొదట భావించినట్టు పెల్లీ తెలిపారు. “ఒకే ప్రయత్నంలో నేను దీన్ని పట్టుకోలేకపోతే, అది ప్యానెళ్ల లోపలికి జారుకుంటుంది. అప్పుడు మనం విమానాన్ని మొత్తం ఖాళీ చేయించి, దాన్ని వెతకాల్సి ఉంటుంది” అని ఆయన విమాన సిబ్బందిని, ఇంజనీర్లను హెచ్చరించినట్టు వివరించారు.
‘గ్రీన్ ట్రీ స్నేక్’ అని గుర్తింపు
అయితే, ఎంతో చాకచక్యంగా వ్యవహరించిన పెల్లీ, మొదటి ప్రయత్నంలోనే ఆ పామును పట్టుకున్నారు. “అదృష్టవశాత్తు నేను దాన్ని ఒకే ప్రయత్నంలో పట్టుకున్నాను. లేదంటే ఈ పాటికి మేమంతా బోయింగ్ 737 విమానాన్ని పూర్తిగా తనిఖీ చేయవలసి వచ్చేది” అని ఆయన అన్నారు. పామును పట్టుకున్న తర్వాత అది హాని చేయని, 60 సెంటీమీటర్ల పొడవున్న ‘గ్రీన్ ట్రీ స్నేక్’ అని గుర్తించారు.

వర్జిన్ ఆస్ట్రేలియా విమానంలో పాము కలకలం

లగేజీ ద్వారా ప్రయాణించిన అనుమానం
ఈ పాము బ్రిస్బేన్ ప్రాంతానికి చెందినది కావడంతో, అక్కడి నుంచి మెల్‌బోర్న్‌కు వచ్చిన విమానంలో ప్రయాణికుల లగేజీ ద్వారా ఇది లోపలికి ప్రవేశించి ఉంటుందని పెల్లీ (Mark Pelley) అనుమానం వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం, ఈ పామును తిరిగి అడవిలో వదిలిపెట్టే అవకాశం లేదు. ఇది రక్షిత జాతికి చెందిన పాము కావడంతో, లైసెన్స్ ఉన్న సంరక్షకుడికి అప్పగించేందుకు దాన్ని ఒక జంతు వైద్యుడికి అందజేశారు.
జంతు వైద్యుడి సంరక్షణలోకి
పాము రక్షిత జాతికి చెందిందిగా గుర్తించి, నిబంధనల మేరకు దాన్ని అడవిలో వదిలే అవకాశం లేకపోవడంతో లైసెన్స్ ఉన్న సంరక్షకుడికి అప్పగించేందుకు ముందుగా జంతు వైద్యుడికి అప్పగించారు.

Read Also: POK: భారతదేశంపై విషం కక్కుతూనే… ఆక్రమిత కశ్మీర్‌లో

Animal Control Australia Australian Airport Incident Breaking News in Telugu Brisbane to Melbourne Cargo Hold Snake Flight Delay Google news Google News in Telugu Green Tree Snake Latest News in Telugu Melbourne Airport Paper Telugu News Snake in Plane Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news VA337 Flight Virgin Australia

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.