📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్

Virat Kohli: ఐసీసీ రేటింగ్ పాయింట్లలో కోహ్లీ రికార్డ్

Author Icon By Anusha
Updated: July 17, 2025 • 3:31 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) తన క్రికెట్ కెరీర్‌ను మరో విశిష్ట ఘనతతో ఆలంకరించుకున్నాడు. మూడు ఫార్మాట్లలోనూ ఐసీసీ రేటింగ్‌లో 900కు పైగా పాయింట్లు సాధించిన తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇప్పటికే కోహ్లీ టెస్ట్ క్రికెట్‌లో 937, వన్డేల్లో 909 పాయింట్లను సాధించగా, తాజాగా టీ20 ర్యాంకింగ్స్‌లో 909 రేటింగ్ పాయింట్లు నమోదు చేశాడు. దీంతో టెస్ట్, వన్డే, టీ20 ఫార్మాట్లలో 900 పాయింట్ల మైలురాయిని దాటిన ఏకైక ఆటగాడిగా అవతరించాడు.ఇక‌, ఐసీసీ (ICC) టీ20 ర్యాంకింగ్స్‌లో విరాట్ వరుసగా 1202 రోజులు అగ్రస్థానంలో నిలిచాడు. క్రికెట్ చరిత్రలో ఏ ఆటగాడూ సాధించని రికార్డు ఇది. 2018లో అత్యధిక పరుగులతో కోహ్లీ ఒకేసారి టెస్టులు, వన్డేలు, టీ20ల్లో నంబర్ వ‌న్‌ ఐసీసీ ర్యాంక్ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఇంత‌కుముందు ఈ ఘనతను ఆసీస్ స్టార్ క్రికెట‌ర్‌ రికీ పాంటింగ్ మాత్రమే సాధించాడు. 

Virat Kohli: ఐసీసీ రేటింగ్ పాయింట్లలో కోహ్లీ రికార్డ్

వ్యక్తిగత ఘనతలతో

మూడు ఫార్మాట్లలోనూ నంబర్ 1 ర్యాంక్‌ను విరాట్ కోహ్లీ, రికీ పాంటింగ్ (Ricky Ponting), మాథ్యూ హేడెన్, జస్‌ప్రీత్ బుమ్రా మాత్రమే పొందారు. కానీ, ఒకేసారి అన్ని ఫార్మాట్ల‌లో నం.01గా నిలిచింది కోహ్లీ, పాంటింగ్ మాత్రమే. కాగా, కోహ్లీ టీ20తో పాటు టెస్టుల‌కు వీడ్కోలు ప‌లికి వ‌న్డేల్లో కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. విరాట్ కోహ్లీ అనేది ఒక్క క్రికెటర్ పేరు కాదు – అది క్రికెట్‌కు అంకితభావం, పట్టు, పరాక్రమానికి చిహ్నం. ఐసీసీ రేటింగ్ రికార్డులు (ICC Rating Records), వరల్డ్ కప్ విజయాలు, ఎన్నో వ్యక్తిగత ఘనతలతో కోహ్లీ పేరు భారత క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది.

విరాట్ కోహ్లీ జన్మతేదీ ఏమిటి?

విరాట్ కోహ్లీ నవంబర్ 5, 1988న ఢిల్లీ నగరంలో జన్మించాడు.

విరాట్ కోహ్లీ ఇప్పుడు ఏ ఫార్మాట్లలో ఆడుతున్నాడు?

కోహ్లీ ప్రస్తుతం వన్డే ఫార్మాట్‌లో ఆడుతున్నాడు. అతను టెస్ట్‌కు 2025లో వీడ్కోలు చెప్పాడు.

Read hindi news:hindi.vaartha.com

Read Also: Owais Shah: రాహుల్‌ను పొగడ్తలతో ముంచెత్తిన ఓవైస్ షా

900+ ICC Rating Points All Format Cricket Records Breaking News Kohli Ranking History latest news Telugu News Virat Kohli Records

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.