📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Viral Video: ఇరాన్ సైనికుడి నోట బాలయ్య డైలాగ్

Author Icon By Anusha
Updated: March 7, 2026 • 11:30 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి
Viral Video: Balayya’s dialogue in the mouth of an Iranian soldier

Viral Video: ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధం అత్యంత భయంకరమైన మలుపు తీసుకుంది. ఇరాన్ జరుపుతున్న ప్రతీకార దాడుల వల్ల ఆగ్రహంతో ఉన్న అమెరికా, హిందూ మహాసముద్రంలో ప్రయాణిస్తున్న ఒక ఇరాన్ నౌకను తమ అత్యాధునిక జలాంతర్గామి (Submarine) సాయంతో ఢీకొట్టి ముంచేసింది. ఈ ఆకస్మిక దాడి ప్రపంచ దేశాలను దిగ్భ్రాంతికి గురిచేసింది.ఇందులో 100 మందికి పైగా ఇరాన్ నేవీ అధికారులు చనిపోయారు.

Read Also: Iran Earthquake: ఇరాన్‌లో మళ్లీ భూకంపం

‘మిలాన్ 2026’ నుంచి తిరిగి వెళ్తుండగా ఘోరం

అయితే ఆ మునిగిపోయిన నౌకలో ఉన్న ఓ ఇరాన్ నేవీ అధికారి దానికి కొన్ని రోజుల ముందే విశాఖపట్నంలో జరిగిన నేవీ విన్యాసాల్లో పాల్గొన్న సమయంలో స్థానిక యూట్యూబర్ కు ఇచ్చిన ఓ వీడియో వైరల్ (viral video)అవుతోంది. ఇందులో అతను తన అభిరుచుల్ని పంచుకోవడంతో పాటు సదరు యూట్యూబర్ కోరిక మేరకు చెప్పిన బాలయ్య సినీ డైలాగ్ కూడా వైరల్ అవుతోంది. కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా అంటూ బాలయ్య చెప్పే సినీ డైలాగ్ ను ఇరాన్ సైనికుడు యూట్యూబర్ చెప్పినట్లే చెప్పి అలరించాడు.అయితే ఆ తర్వాత అనూహ్యంగా ఈ నౌక తిరిగి ఇరాన్ కు బయలుదేరడం,

మధ్యలో శ్రీలంక సమీపంలో దాన్ని అమెరికా జలాంతర్గామి సాయంతో ఢీకొట్టి ముంచేయడం జరిగిపోయాయి. దీనిపై భారత్ తొలుత స్పందించకపోవడం కూడా తీవ్ర విమర్శలకు తావిచ్చింది. చివరికి ఆ నౌకను కాపాడేందుకు తాము ప్రయత్నించినట్లు భారత్ వివరణ ఇచ్చింది. అటు శ్రీలంక మాత్రం ఈ నౌకలో ఉన్న పలువురు ఇరాన్ నేవీ అధికారుల్ని కాపాడి ఆస్పత్రులకు తరలించి మానవత్వం చాటుకుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Balakrishna Dialogue by Iranian Soldier Iran Navy Officer Viral Video Milan 2026 Vizag Viral Video Nandamuri Balakrishna Dialogues

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.