News Telugu: Viral News: పరువు తీశారు కదా! విదేశీ యూట్యూబర్‌పై పేడ చల్లిన వీడియో వైరల్

Read Time:  1 min
Viral News
Viral News
FONT SIZE
GET APP

Viral News: కర్ణాటకలో (karnataka) ఇటీవల జరిగిన సంప్రదాయ పండుగలో చోటుచేసుకున్న ఒక సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ పండుగలో పాల్గొన్న అమెరికన్ యూట్యూబర్ టైలర్ ఒలివెరాపై స్థానికులు ఆవు పేడ చల్లడంతో, ఆయన పూర్తిగా అందులో మునిగిపోయారు. ఈ దృశ్యాల వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

Read also: Bus Accident: బైక్‌పైకి దూసుకెళ్లిన ప్రైవేట్ బస్సు – ఇద్దరి దుర్మరణం

గోరెహబ్బ పండుగలో వివాదం

Viral News: కర్ణాటకలో దీపావళి (Diwali) వేళ జరుపుకునే ప్రత్యేక పండుగ గోరెహబ్బలో ప్రజలు ఒకరిపై ఒకరు ఆవు పేడను చల్లుకోవడం సాంప్రదాయంగా జరుగుతుంది. అక్కడి ప్రజలు గ్రామ దేవత బీరేశ్వర స్వామి ఆవు పేడ నుంచే అవతరించారని నమ్మకం ఉంది. అందువల్ల ప్రతి సంవత్సరం ఈ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఆ వేడుకల్లో పాల్గొన్న టైలర్ ఒలివెరా వీడియోను తన యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేశారు. ఆయన సేఫ్టీ గాగుల్స్, షర్ట్ ధరిచి ఆవు పేడ మధ్యలో పాల్గొన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

సోషల్ మీడియాలో విమర్శలు

ఈ వీడియోపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు భారతీయులు ఇలా ఒక విదేశీ యూట్యూబర్‌ను పేడలో ముంచడం ద్వారా “దేశ పరువు తీసారు” అని కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు, ఇంకొంతమంది ఈ సంఘటనను తప్పుగా చూపించారని, పండుగ వెనుక ఉన్న భక్తి, సాంప్రదాయాన్ని గౌరవించాల్సిన అవసరం ఉందని అంటున్నారు.

యూట్యూబర్ స్పందన

వీడియోపై వస్తున్న విమర్శల నేపథ్యంలో టైలర్ ఒలివెరా కూడా స్పందించాడు. “నేను ఈ అనుభవం కోసం 10,000 మైళ్ల దూరం ప్రయాణించి వేల డాలర్లు ఖర్చు చేశాను. భారత సాంస్కృతిక సంప్రదాయాన్ని అనుభవించడమే నా ఉద్దేశ్యం” అని ఆయన స్పష్టం చేశారు.

ఏమి జరిగింది?
కర్ణాటకలో ‘గోరెహబ్బ’ పండుగ సందర్భంగా విదేశీ యూట్యూబర్ టైలర్ ఒలివెరా స్థానికులతో కలిసి పేడ చల్లుకునే వేడుకలో పాల్గొన్నాడు.

ఎందుకు పేడ చల్లుకుంటారు?
ఈ పండుగలో గ్రామ దేవత బీరేశ్వర స్వామి ఆవు పేడ నుంచి జన్మించాడని నమ్మకం ఉంది. అందుకే ప్రజలు పేడను పవిత్రంగా భావించి ఒకరిపై ఒకరు చల్లుకుంటారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Rajitha

రచయిత గురించి

Rajitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.